HomeBusinessBank Holidays: డిసెంబర్‌లో బ్యాంకులకు వరుస సెలవులు.. ఏకంగా 17 రోజులు!

Bank Holidays: డిసెంబర్‌లో బ్యాంకులకు వరుస సెలవులు.. ఏకంగా 17 రోజులు!

Bank Holidays: ఏ నెలలో ఎన్ని రోజులు బ్యాంకులకు హాలిడేస్ ఉన్నాయన్న చాలా మందికి తెలుసుకోవాలని ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రతి నెలా బ్యాంకులకు సెలవుల లిస్టును రిలీజ్ చేస్తుంది. బ్యాంకు పనుల (Bank Holidays) కోసం వెళ్లే వారికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

ఏ రోజు బ్యాంకు ఉంటుందో, ఏ రోజు ఉండదో తెలుసుకుని వెళ్లడం ముఖ్యం. నవంబర్ నెల ముగుస్తున్న తరుణంలో డిసెంబర్ లో ఏయే రోజులు బ్యాంకులకు సెలవులుంటాయన్న లిస్టు వచ్చింది. డిసెంబర్‌లో బ్యాంకులకు చాలా సెలవులు ఉండబోతున్నాయి. డిసెంబర్లో పెద్దగా పండుగలు లేకపోయినప్పటికీ ప్రత్యేక మైన రోజులు ఉన్నాయి. కానీ, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులు వేర్వేరు సందర్భాల్లో మూసివేయనున్నారు. డిసెంబర్‌లో మొత్తం 17 రోజుల పాటు బ్యాంకులు ఉండవు. వీటిలో రెండో, నాలుగో శనివారాలతో పాటు ఆదివారం సెలవులూ ఇంక్లూడ్ అయ్యాయి. అయితే, ఇవి అన్ని రాష్ట్రాలకూ వర్తించకపోవచ్చు. రాష్ట్రాలను బట్టి పండుగలు ఉంటాయి.

వచ్చే నెల డిసెంబర్ లో బ్యాంకులకు సెలవుల లిస్టు ఇదీ..
2024 డిసెంబర్ 1న ఆదివారం – (వరల్డ్ ఎయిడ్స్ డే) దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
2024 డిసెంబర్ 3న మంగళవారం – (సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ డే) గోవాలో బ్యాంకులు ఉండవు.
2024 డిసెంబర్ 8న ఆదివారం – వారాంతపు సెలవు
2024 డిసెంబర్ 10న మంగళవారం – మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు.
2024 డిసెంబర్ 11న బుధవారం – (UNICEF పుట్టినరోజు) అన్ని బ్యాంకులకు సెలవే.
2024 డిసెంబర్ 14న శనివారం – అన్ని బ్యాంకులు బంద్

2024 డిసెంబర్ 15న ఆదివారం – అన్ని బ్యాంకులకు జనరల్ హాలిడే
2024 డిసెంబర్ 18న బుధవారం – గురు ఘాసిదాస్ జయంతి చండీగఢ్‌లో బ్యాంకులకు సెలవు.
2024 డిసెంబర్ 19న గురువారం – గోవా విమోచన దినోత్సవం సందర్భంగా అక్కడ బ్యాంకులకు సెలవు
2024 డిసెంబర్ 22న ఆదివారం – వారాంతపు సెలవు
2024 డిసెంబర్ 24న మంగళవారం – గురు తేగ్ బహదూర్ బలిదానం రోజు, క్రిస్మస్ ఈవ్ సందర్భంగా మిజోరం, మేఘాలయ, పంజాబ్, చండీగఢ్‌ రాష్ట్రాలలో బ్యాంకులకు సెలవు.

2024 డిసెంబర్ 25న బుధవారం – (క్రిస్మస్) అన్ని బ్యాంకులకు హాలిడే
2024 డిసెంబర్ 26న గురువారం – (బాక్సింగ్ డే, క్వాంజా) అన్ని బ్యాంకులకు హాలిడే.
2024 డిసెంబర్ 28న శనివారం – 4వ శనివారం, అన్ని బ్యాంకులకు హాలిడే
2024 డిసెంబర్ 29న ఆదివారం – వారాంతపు సెలవు.
2024 డిసెంబర్ 30న సోమవారం – (తము లోసార్ సందర్భంగా) సిక్కిం రాష్ట్రంలో బ్యాంకులకు హాలిడే.
2024 డిసెంబర్ 31న మంగళవారం – (న్యూ ఇయర్ వేడుక) మిజోరంలో బ్యాంకులు సెలవు.

ఇవీ చదవండి: AP Banking Good: ఆంధ్రప్రదేశ్ పనితీరుపై కేంద్ర ప్రభుత్వం ప్రశంసలు
ICICI cash back: ఐఫోన్ కొనాలనుకుంటున్నారా.. క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇదిగో..
Shimla: ఇండియన్‌కు సెలవు ఇవ్వని టర్కిష్ బాస్.. వీడియో కాల్‌లో పెళ్లి!
Apar Generation: అపార్ జనరేషన్ కరెక్షన్స్‌కు 2025 మార్చి 31 వరకు గడువు

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు