HomeCinemaActress Ivana : ‘పొట్టి’ అంటూ ఏడిపించినవారు: ఇవానా

Actress Ivana : ‘పొట్టి’ అంటూ ఏడిపించినవారు: ఇవానా

Actress Ivana : సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తాజాగా హాట్ టాపిక్ అవుతున్న హీరోయిన్ ఇవానా. (Actress Ivana) చిన్న వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ, తర్వాత హీరోయిన్‌గా మారి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తమిళంలో వచ్చిన ‘లవ్ టుడే’ సినిమాతో యూత్‌లో క్రేజ్ తెచ్చుకున్న ఇవానా, ఆ సినిమా తెలుగులోనూ డబ్ అయ్యి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

తాజాగా ఇవానా హీరో శ్రీవిష్ణుతో కలిసి నటించిన ‘సింగిల్’ సినిమా రిలీజ్ కాగా, ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. తన గ్లామర్‌తో పాటు నటనతోనూ ఆకట్టుకున్న ఈ చిన్నది, ఇప్పుడు సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోంది. దీనితో టాలీవుడ్‌లో వరుసగా క్రేజీ ఆఫర్స్ దక్కుతున్నాయి.

ఇక గతంలో ఓ ఇంటర్వ్యూలో ఇవానా తన చిన్ననాటి అనుభవాలను షేర్ చేసుకుంది. హైట్ తక్కువగా ఉండటంతో చాలాసార్లు అవమానాలు ఎదుర్కొన్నానని, స్కూల్‌లో ఫ్రెండ్స్ తరచూ ‘పొట్టి’ అని పిలిచి ఏడిపించేవారని చెప్పుకొచ్చింది. ఆ అనుభవాలు తన చదువుపై కూడా ప్రభావం చూపాయని, చిన్నప్పటినుంచే సినిమాల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేదని తెలిపింది.

ఇవానాకు తెలుగులో ‘హ్యాపీడేస్’ సినిమా అంటే చాలా ఇష్టం. అందులోని పాటలు తన ఫేవరెట్ అని చెప్పింది. అలాగే టాలీవుడ్ హీరోల్లో తనకు ఫేవరెట్ అల్లు అర్జున్ అని కూడా చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం ఇవానా తమిళ్, తెలుగు రెండింట్లోనూ సినిమాలు చేస్తూ స్టార్‌డమ్ వైపు దూసుకుపోతుంది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉండే ఈ అందాల భామ, తరచూ తన ఫోటోలతో అభిమానులను ఆకట్టుకుంటోంది.

ఇవీ చదవండి: Priya Bhavani Shankar: తళుక్కుమనే తార.. ప్రియా భవానీ శంకర్.. ఫొటో గ్యాలరీ
Meenakshi Chaudhary: నడుము అందాలతో కవ్విస్తున్న మీనాక్షి చౌదరి.. ఫొటోలు
Rakul preet: న్యూ లుక్‌లో రకుల్ ప్రీత్ సింగ్.. ఫొటో గ్యాలరీ

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు