Asia Cup 2025: ఆసియా కప్ 2025 కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ముంబైలో జరిగిన సమావేశం అనంతరం చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కలిసి జట్టును వెల్లడించారు. ఈ జట్టులో శుభ్‌మన్ గిల్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. అలాగే అక్షర్ పటేల్‌కూ చోటు దక్కింది. Asia Cup 2025
అయితే, వైస్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి అక్షర్‌ను తప్పించి గిల్‌కు ఇవ్వడంపై మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
అక్షర్ పటేల్ ప్రదర్శన, కానీ ఉప కెప్టెన్సీ పోయింది. ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ సిరీస్‌ను భారత్ 4-1తో గెలుచుకుంది. అక్షర్ 6 వికెట్లు పడగొట్టాడు. అంతేకాదు, 2024 టీ20 ప్రపంచ కప్లో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఇంగ్లాండ్‌పై జరిగిన సెమీఫైనల్‌లో 4 ఓవర్లలో 23 పరుగులకే 3 వికెట్లు తీసి, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.
ఫైనల్లో దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో 31 బంతుల్లో 47 పరుగులు చేసి భారత విజయానికి కీలకంగా నిలిచాడు. ఈ ప్రదర్శనల తర్వాత అక్షర్‌కు వైస్ కెప్టెన్సీ అప్పగించబడింది. కానీ తాజాగా, టీ20ల్లో పెద్దగా మ్యాచ్‌లు ఆడని శుభ్‌మన్ గిల్ తిరిగి రాగానే ఆ బాధ్యతలు అతనికి ఇవ్వడం వివాదాస్పదమైంది.
మహ్మద్ కైఫ్ ఆగ్రహం
ఈ నిర్ణయంపై మహ్మద్ కైఫ్ సోషల్ మీడియాలో స్పందిస్తూ –
“అక్షర్ పటేల్‌ను వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించే ముందు అతనికి తెలియజేశారని నేను ఆశిస్తున్నాను. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఈ విషయం తెలిసిపోవడం అతనికి అవమానంగా మారకూడదు. అక్షర్ ఎలాంటి తప్పూ చేయలేదు. కాబట్టి దీనిపై క్లారిటీ ఇవ్వాలి” అని వ్యాఖ్యానించాడు.
ఆసియా కప్ 2025లో భారత జట్టు షెడ్యూల్
సెప్టెంబర్ 10: భారత్ vs యూఏఈ (దుబాయ్)
సెప్టెంబర్ 14: భారత్ vs పాకిస్థాన్ (దుబాయ్)
సెప్టెంబర్ 19: భారత్ vs ఒమన్ (అబుదాబి)
భారత జట్టు – ఆసియా కప్ 2025
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, జితేశ్ శర్మ, శివమ్ దూబే, అర్ష్‌దీప్ సింగ్, సంజు శాంసన్, హర్షిత్ రాణా, తిలక్ వర్మ, రింకు సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్.
ఇవీ చదవండి: Asia Cup 2025 : ఆసియా కప్‌కు టీమిండియా జట్టు ఇదే.. కెప్టెన్ సూర్య!
Asia Cup 2025: ఆసియా కప్ 2025 కు ముహూర్తం ఖరారు.. భారత్-పాక్ మ్యాచ్?
