HomeCinemaRakul preet: న్యూ లుక్‌లో రకుల్ ప్రీత్ సింగ్.. ఫొటో గ్యాలరీ

Rakul preet: న్యూ లుక్‌లో రకుల్ ప్రీత్ సింగ్.. ఫొటో గ్యాలరీ

Rakul preet: సోషల్ మీడియాలో రకుల్ ప్రీత్ లేటెస్ట్ ఫొటో గ్యాలరీ వైరల్ అవుతోంది. తాజాగా ఇన్ స్టా గ్రామ్ లో తన న్యూ లుక్ పిక్స్ అప్ లోడ్ చేసింది. ఇటీవల ఓ ఫ్యాషన్ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రకుల్ పలు విషయాలు వెల్లడించారు. తన బాల్యం, కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నారు.

నటి రకుల్‌ ప్రీత్‌సింగ్‌ (Rakul preet Singh) ఫిట్ నెస్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. ఆమె యోగా, జిమ్ కూడా రెగ్యులర్ గా చేస్తుందన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె బాల్యంలో నేర్చుకున్న గొప్ప విలువల గురించి ప్రస్తావించింది. అందువల్లే తాను ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్నానని తెలిపింది.

తమది ఆర్మీ కుటుంబం అని రకుల్ తెలిపారు. క్రమశిక్షణతో పాటు చాలా గొప్ప విషయాల గురించి, విలువల గురించి బాల్యంలో తన పేరెంట్స్ నేర్పించారని తెలిపింది. వాటివల్లే తాను డిసిప్లిన్ అలవాటు చేసుకున్నానని తెలిపింది. ఇప్పుడు గొప్ప స్థాయిలో ఉండటానికి కారణం కూడా అదేనని తెలిపింది.

ఇతరుల సమయాన్ని గౌరవించడం, ఇచ్చిన మాట మీద నిలబడటం.. లాంటివి ఎప్పుడూ పాటిస్తానని రకుల్ పేర్కొన్నారు. అనంతరం యువతరాన్ని ఉద్దేశించి సూచన చేసింది. ఏ పని చేసినా మనతో మనం నిజాయతీగా ఉండాలని రకుల్ సూచించింది.

ఇక రకుల్ లేటెస్ట్ మూవీస్ విషయానికి వస్తే.. అయలాన్‌, ఇండియన్‌ 2 చిత్రాలతో 2024 ఏడాది ఆడియన్స్ ను రకుల్ అలరించింది. ప్రస్తుతం రకుల్ ‘దే దే ప్యార్‌ దే 2’ మూవీ కోసం కష్టపడుతోంది. వచ్చే ఏడాదిలో ఈ చిత్రం రిలీజ్ కానుందట.

మరోవైపు, రకుల్‌ ప్రస్తుతం బెడ్‌ రెస్ట్‌ తీసుకుంటోంది. ఫిట్‌నెస్‌ విషయంలో చాలా జాగ్రత్తలు పాటించే ఈ అమ్మడు.. వర్కౌట్‌ చేసే సమయంలో వెన్నుకు ఇటీవల గాయం అవడంతో ఇబ్బంది పడింది. అయితే, దాన్ని లెక్కచేయకుండా షూటింగ్ లో పాల్గొనడంతో తిరగబెట్టింది. నొప్పి ఎక్కువ కావడంతో వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకున్నట్లు రకుల్ తెలిపింది. డాక్టర్లు ఆరు వారాలపాటు బెడ్‌ రెస్ట్‌ తీసుకోమన్నారని మొన్నీమధ్యే సోషల్ మీడియా వేదికగా తెలిపింది.

ఇవీ చదవండి: Zarashatavari: హీరోయిన్లూ అసూయ పడే అందం.. ఏఐ భామ హాట్ ఫొటోలు
Meenakshii Chaudhary: రెడ్ డ్రెస్‌లో మీనాక్షి చౌదరి.. ఫొటో గ్యాలరీ
Shriya Kontham: అందాలతో మతి పోగొడుతున్న బ్యూటీ.. శ్రియా కొణతం ఫొటోలు
Rashi Singh: రాశి సింగ్‌ హాట్‌ ఫొటో గ్యాలరీ.. భూతద్దం భాస్కర్‌ నారాయణ బ్యూటీ కలర్‌ఫుల్‌ పిక్స్‌!!
Mrunal Thakur: మృణాల్‌ ఠాకూర్‌ ఫొటో గ్యాలరీ

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు