YS Jagan on Kuppam crime : దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన కుప్పం ఘటనపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ స్పందించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు పరిపాలనలో రాష్ట్రంలో మహిళలకు లభిస్తున్న గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ (YS Jagan on Kuppam crime) చేశారు. ట్వీట్లో ఆయన ఏమన్నారంటే..
‘‘చంద్రబాబు గారూ.. రాష్ట్రంలో మహిళలకు మీరు కల్పిస్తున్న రక్షణ ఇదేనా? మీ పాలనలో మహిళలకు లభిస్తున్న ఆత్మగౌరవం ఇదేనా? సాక్షాత్తూ మీరు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం నారాయణపురం గ్రామంలో ఒక మహిళను చెట్టుకు కట్టేసి, హింసిస్తున్న ఘటన, మీ దుర్మార్గపు పరిపాలన ఫలితమే.
తిమ్మరాయప్ప అనే కూలీ అప్పు చెల్లించలేదనే కారణంతో అతని భార్య శిరీషను మీ పార్టీ కార్యకర్త చెట్టుకు కట్టేసి, హింసించాడు. ఆమె బిడ్డలు రోదిస్తున్నా సరే కనికరం చూపలేదు, విడిచిపెట్టలేదు. చంద్రబాబుగారూ.., మీ హయాంలో జరిగిన అనేక క్రూరమైన ఘటనల్లో ఇదొకటి.
పొలిటికల్ గవర్నెన్స్, రెడ్‌బుక్ పేరిట మీరు నెలకొల్పిన దుష్ట సంప్రదాయంలో భాగంగా మీరు, మీ పార్టీ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా చెలరేగిపోయి చేస్తున్న దుర్మార్గాలకు మహిళలు, యువతులు, బాలికలు ఇలా ఎందరో బలైపోతున్నారు.
ఈ ఘటనతోపాటు, ఏడాదికాలంలో రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై జరిగిన అన్యాయాలు, అఘాయిత్యాలను సీరియస్‌గా తీసుకోవాలని, చట్టప్రకారం కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాను.’’ అని జగన్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
ఇవీ చదవండి: Jagan on Kommineni : అనని మాటలను ఆపాదించి అరెస్టులా?
YS Jagan at Tenali : నడిరోడ్డుపై కొట్టే అధికారం మీకు ఎవరిచ్చారు?: జగన్
YS Jagan PC : అరెస్టులపై సంచలనం.. సుదీర్ఘ ప్రెస్‌మీట్లో జగన్ హాట్ కామెంట్స్
YS Jagan Help: వైయస్ జగన్.. విపక్షంలో ఉండీ ఇన్ని లక్షల సహాయమా?
Jagan at Kalli Thanda: మురళీనాయక్ కుటుంబానికి రూ.25 లక్షలు : జగన్
