HomeCinemaPushpa 2 Trailer: పుష్ప 2 ట్రైలర్ ఈవెంట్.. ఉత్తరాది ప్రేక్షకులకు పండగ

Pushpa 2 Trailer: పుష్ప 2 ట్రైలర్ ఈవెంట్.. ఉత్తరాది ప్రేక్షకులకు పండగ

Pushpa 2 Trailer: అల్లు అర్జున్ హీరోగా నటించిన సీక్వెల్ చిత్రం పుష్ప2. ఇప్పటికే విడుదలై భారీ విజయాన్ని అందుకున్న పుష్ప.. రెండో పార్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రెండో పార్ట్ లో సాంగ్స్, మ్యూజిక్ కు మంచి స్పందన వచ్చింది. (Pushpa 2 Trailer)

కొన్నిరోజులుగా పుష్ప 2 నుంచి వరుస అప్డేట్స్ ఇస్తోంది చిత్ర బృందం. ఇప్పటికే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలయ్యాయి. నిన్న మొన్నటి వరకు స్పెషల్ సాంగ్ చిత్రీకరణలో బిజీగా ఉన్న టీమ్.. ఇప్పుడు ట్రైలర్ లాంచ్ ఏర్పాట్లలో నిమగ్నమైందట.

పుష్ప 2 ట్రైలర్ ను ఈనెల 17న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారని ఇదివరకు అధికారికంగా ప్రకటించారు. అయితే, ఆ తర్వాత వెంటనే స్పెషల్ సాంగ్ సైతం రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని టాక్ నడుస్తోంది. ఇక దేశంలోని ముఖ్య నగరాల్లో భారీ ఈవెంట్స్ నిర్వహించాలని మేకర్లు నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. ఇంటర్వ్యూలు, టాక్ షోలతో బన్నీ సందడి చేయనున్నాడు. అలాగే చిత్ర బృందం పాల్గొననుంది.

తాజాగా ట్రైలర్ లాంచ్ టైమ్ ఫిక్స్ చేశారు చిత్ర బృందం. లేటెస్ట్ సమాచారం మేరకరు నవంబర్ 17న పాట్నా నగరంలోని గాంధీ మైదాన్ లో సాయంత్రం 5 గంటల నుంచి ఈ గ్రాండ్ ఈవెంట్ నిర్వహిస్తారని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా పేర్కొనలేదు. ఈ వేడుకకు భారీ సంఖ్యలో ఫ్యాన్స్ హాజరుకానున్నట్లు తెలుస్తోంది. నార్త్ లోనూ బన్నీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఈ మధ్యకాలంలో భారీగా పెరిగిన సంగతి తెలిపిందే.

ఇవీ చదవండి: Pushpa 2: పుష్ప 2 ది రూల్ అడ్వాన్స్ బుకింగ్స్.. యూఎస్‌లో ఆ రికార్డు బద్దలు!
Pushpa2TheRule: ఒకటి తక్కువైంది.. ముందే పుష్పరాజ్ ఆగమనం!
Allu Arjun: అల్లు అర్జున్ డ్రైవర్ జీతం ఎంతో తెలుసా?
Pushpa 2 Update: పుష్ప 2పై కీలక అప్ డేట్ ఇచ్చిన టీమ్.. అంచనాలను మించి..

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు