CBN Reaction : మీడియా సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పుష్ప సినిమా డైలాగ్ తో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో యోగాంధ్రపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యోగాంధ్ర సన్నాహాలపై వివరించిన అనంతరం మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానాలు ఇస్తూ వైయస్ జగన్ పర్యటనలపైనా (CBN Reaction) మాట్లాడారు.
యోగాంధ్ర ఏర్పాట్లపై సమీక్షించిన చంద్రబాబు.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. యోగా మన జీవితంలో ఒక భాగం కావాలన్నారు. యోగాంధ్రకు భారీ స్పందన వస్తోందన్నారు. 2.39 కోట్ల మంది యోగాంధ్ర కోసం నమోదు చేసుకున్నారని తెలిపారు. గ్రామస్థాయిలో 14,947 యోగా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. 27లక్షల మందికి యోగా సర్టిఫికెట్లు ఇచ్చామన్నారు. యోగాడేను ఘనంగా నిర్వహించుకోవాలని చెప్పారు. యోగా మత సంబంధమైంది కాదని, యోగా సైన్స్ అన్నారు. యోగాంధ్ర కార్యక్రమానికి విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నాం..పెట్టుకున్న అన్ని టార్గెట్లు చేరుకున్నామన్నారు.
‘‘ప్రజల్లో యోగాపై ఇంట్రెస్ట్ వచ్చింది. 1,29,249 ప్రాంతాల్లో ఏపీలో యోగా చేయబోతున్నారు. దేశమంతా 8 లక్షల ప్రాంతాల్లో యోగా చేయబోతున్నారు. ఇది చరిత్రలో జరగలేదు. ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు 26 కిలోమీటర్ల మేర యోగా కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ మూడున్నర లక్షల మంది పాల్గొంటారు. వంద మందికి ఒక టాయిలెట్ ఏర్పాటు చేస్తున్నాం. ఐదు లక్షల మందికి టీషర్టులు ఇస్తున్నాం. ఒక్కో కంపార్ట్‌మెంట్‌కు ఒక టీమ్‌ను పెట్టాం. చాలా స్టార్టప్స్ వస్తున్నాయి.. AIతో కొత్త యాప్స్ వస్తున్నాయి. 9వ తరగతి నుంచి విద్యార్థులు యోగా చేయాలి.
భవిష్యత్తులో ఆఫ్ లైన్, ఆన్ లైన్ శిక్షణ, కోర్సులు నిర్వహణ. గత నెల 21 నుంచి ఈ నెల 21 వరకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. 3.50 లక్షల మందితో సూర్య నమస్కారాల కార్యక్రమం. రేపు 108 నిమిషాల పాటు సూర్య నమస్కారాల కార్యక్రమం. ఏజెన్సీ ప్రాంతాల నుంచి 25వేల మంది విద్యార్థులు వస్తారు.’’ అని చంద్రబాబు వెల్లడించారు.
రప్పా రప్పా అంటున్నారు..
‘‘ఒకవైపు యోగా జరుగుతుంటే మరికొందరు రప్పా రప్పా అంటున్నారు. ఒకప్పుడు ఊళ్లలో గ్రామ దేవతలకు పొట్టేళ్లను బలి ఇచ్చేటప్పుడు రప్పా రప్పా అనేవారు. పర్యటన అనుమతులను జగన్ ఉల్లంఘించారు. హింసను ప్రోత్సహించి పోలీసులపై నిందలు మోపారు. రాష్ట్రంలో ఎప్పుడైనా ఇలాంటి పోకడలు చూశారా? చంపండంటూ ప్లకార్డుల ప్రదర్శనతో ఆనందిస్తున్నారు. ఇష్టానుసారంగా టెర్రరిజం క్రియేట్ చేస్తూ ఊరుకోం. వెదవ పనుల వల్లే వైయస్ఆర్సీపీకి 11 సీట్లు వచ్చాయి.
ఒకప్పుడు నేరస్తులతో దూరంగా ఉండేవాళ్లం. నేరస్థులతో రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవరైనా నేరాలను ప్రోత్సహిస్తారా? చంపండి, నరకండి అని ఎవరైనా మాట్లాడతారా? ఇరుకు సందుల్లో మీటింగ్ లు పెట్టి ప్రజలను ఇబ్బందిపెడతారా? నాయకులకు హుందాతనం ఉండాలి. మేం ఎవరినీ టార్గెట్ చేయడం లేదు..చట్టం తన పని తాను చేసుకోపోతుంది. గంజాయి, బెట్టింగ్ బ్యాచ్, రౌడీలకు విగ్రహాలు పెడుతున్నారు. సమాజంలో ఇలాంటి పోకడలు చాలా ప్రమాదకరం.
రౌడీయిజం చేసేవాళ్లు, చట్టాన్ని ఉల్లంఘించే వాళ్లను వదిలేయాలా? అలాంటి వారిని హీరోలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి ఉన్మాదులుగా మారితే వారిని మార్చగలమా? రాజకీయ ముసుగులో ఉండే కమ్యూనల్ ఎలిమెంట్స్ ను కూడా డీల్ చేశాం. భవిష్యత్తును తీర్చిదిద్దే నాయకుల గురించి ప్రజలు ఆలోచించాలి. గత ప్రభుత్వంలో జరిగిన అరాచకాలపై విచారణ చేయొద్దా? మేం ప్రజలకు సమాధానం చెబుతాం..కానీ వైయస్ఆర్సీపీ వాళ్లను తాటతీస్తాం.
ఏడాది ముందు చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించడం ఏంటి? రౌడీలను, బెట్టింగ్ లో చనిపోయిన వాళ్లను మాత్రమే పరామర్శిస్తారా? మీ వాహనం గుద్ది చనిపోయిన వ్యక్తిని కూడా పట్టించుకోరా? పోలీసులు అనుమతి ఇవ్వకపోతే దౌర్జన్యం చేస్తారా? చట్టాన్ని ఉల్లంఘించే వారిని ఏమనాలి? తిరుపతి, విశాఖలో నన్ను ఆపారు, నేను సైలెంట్ గా వచ్చేశాం. 40 వేల మందిని మార్కెట్ యార్డ్ కు ఎందుకు తీసుకెళ్లావ్? శాంతిభద్రతల సమస్య సృష్టించాలనే కుట్రే కదా?
వైయస్ఆర్సీపీ నాయకులు సమాజానికే పెద్ద సమస్యగా మారిపోయారు. అన్ని నేరాల్లో వైయస్ఆర్సీపీ వాళ్లే ఉంటున్నారు..మళ్లీ రాజకీయం చేస్తున్నారు. నేనేం చేసినా అదే చట్టం అంటే ఎలా? మీరు మారాలి..లేకపోతే ప్రజలు మార్చాలి. మీరు మారండి.. మారితే సమాజం అంగీకరిస్తుంది. తప్పుడు పనులతో అతలాకుతలం చేస్తామంటే సరికాదు. రౌడీయిజం చేయాలని అందరికీ మార్గదర్శనం చేస్తున్నారు. ఇసుక, లిక్కర్ లో ఏం జరిగిందో అందరికి తెలియదా? సినిమాల్లో చంపినట్టు చంపితే తప్పేంటని అనే స్థాయికి చేరుకున్నారు. గొడవలు జరుగుతుంటే పెట్టుబడిదారులు రాష్ట్రానికి వస్తారా? రాష్ట్రం అభివృద్ధి చెందకూడదనే ఇలా చేస్తున్నారు. ఏ రాష్ట్రంలో ఇలా లేదు. (CBN Reation)
నేనెప్పుడైనా గొడవ పడ్డానా?
గోదావరిలో నీళ్లను ఇరు రాష్ట్రాలు వాడుతున్నాయి. పోలవరం తప్ప మిగతావి అనుమతి రాని ప్రాజెక్టులే. విభజన చట్టంలో భాగంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం. ఇక్కడికి వచ్చిన నీటిని మరో బేసిన్ కు తరలిస్తున్నాం. గతంలో కృష్ణా బ్యారేజ్ పై ఇరు రాష్ట్రాల సిబ్బంది గొడవపడ్డారు. గవర్నర్ వద్ద కూర్చుని గతంలో సమస్య పరిష్కరించుకున్నాం. కృష్ణాలో తక్కువ ఉన్న నీటిపై గొడవ పడితే లాభం లేదు. ప్రాజెక్టుల వారీగా చేసిన కేటాయింపులను అలాగే కొనసాగిద్ధాం. కొత్త ట్రైబ్యునల్ వచ్చాక కేటాయింపుల మేరకు ముందుకెళ్లాలి. ఉమ్మడి ఏపీలో నేనే చాలా ప్రాజెక్టులు మొదలుపెట్టా. దేవాదుల, కల్వకుర్తి ప్రాజెక్టులు నేనే మొదలుపెట్టాను. (CBN Reaction)
ఎల్లంపల్లి ప్రాజెక్టుపై వివాదం వస్తే అసెంబ్లీలో పోరాడాం. కాళేశ్వరం గురించి ఎప్పుడూ నేను అభ్యంతరం చెప్పలేదు. పైనుంచి నీళ్లు వాడుకోకపోతే కిందకు వస్తాయి. ఇరు రాష్ట్రాలు తెలుగు సమాజం..ఎందుకు సమస్యలు? సముద్రంలో కలిసే నీటి వాడకంపై చట్టబద్ధత కావాలంటే కేంద్రంతో చర్చిద్దాం. సముద్రంలో కలిసే నీటి వాడకంపై సమస్య సృష్టించడం ఎంతవరకు సమంజసం? తెలంగాణతో నేను ఎప్పుడైనా గొడవపడ్డానా? నేను ఎవరితో గొడవ పెట్టుకోను. రాష్ట్రం హితం కోసం ఎవరితోనైనా పోరాడుతాను. తెలంగాణ, ఏపీ రెండు అభివృద్ధి కావాలి. 3000 టీఎంసీలు సముద్రంలోకి పోతున్నాయి. గోదావరిలో మిగిలిన నీటిని వాడుకుంటాము. సముద్రంలోకి పోయే నీటిని ఇచ్చుపచ్చుకునే ధోరణిలో వాడుకుందాం. కొందరు రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. పార్టీల గురించి నేను మాట్లాడను.’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ఇవీ చదవండి: YS Jagan at Rentapalla : చంద్రబాబూ.. కమ్మవారిపై ఎందుకింత కక్ష? రెంటపాళ్లలో జగన్!
YS Jagan Pushpa Dialogue : రప్పా.. రప్పా.. జగన్ నోటి వెంట పుష్ప డైలాగ్ వైరల్
