AP Crime News: ఏపీలో హత్యాచారాల పర్వం కొనసాగుతోంది. తాజాగా తిరుపతి, తూర్పు గోదావరి జిల్లాల్లో ఘోరాలు జరిగాయి. మూడున్నరేళ్ల చిన్నారిని చాక్లెట్ ఆశ చూపి అత్యంత పాశవికంగా లైంగిక దాడి చేసి చంపేశాడో కిరాతకుడు. (AP Crime News) తూర్పు గోదావరి జిల్లాలో నలుగురు మృగాళ్లు సామూహిక అత్యాచారం చేసి మహిళను చంపేశారు.
తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం బుర్రిలంకలో ఒడిశాకు చెందిన ఓ 43 ఏళ్ల మహిళపై నలుగురు సామూహిక అత్యాచారం చేసి, అనంతరం చంపేశారు. ఒడిశాలోని పర్లాఖెముండికి చెందిన దంపతులు చాన్నాళ్ల కిందటే కడియం మండలంలోని ఓ గ్రామానికి వచ్చి, నర్సరీల్లో కూలీ పనులు చేసుకుంటూ బతుకుతున్నారు. వీరికి ప్రత్యేక దివ్యాంగురాలైన కుమార్తె, డిగ్రీ చదివే కుమారుడు ఉన్నారు. అక్టోబర్ 15న ఆమె నర్సరీలో పనులు ముగించుకొని ఇంటికి వెళ్లే సమయంలో బుర్రిలంకకు చెందిన దేవర యేసు (26), వెలుబుడి ప్రవీణ్ (21), లోకిన జయప్రసాద్ (19), పొట్టిలంకకు చెందిన దాసరి సురేష్ (22) వెంటపడి కోరిక తీర్చమని బెదిరించారు.
బాధితురాలు ప్రతిఘటించడంతో సమీపంలోని పొలాల్లోకి లాక్కొని వెళ్లారు. గుడ్డలు నోట్లో కుక్కి, కాళ్లు, చేతులు పట్టుకుని ముక్కు మూసేయడంతో ఆమె స్పృహ కోల్పోయింది. బాధితురాలిపై మృగాళ్లు చాలా సార్లు అత్యాచారం చేశారని పోలీసుల విచారణలో తేలింది. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఆమెను సమీపంలోని కాలువలో పడేసి వెళ్లిపోయారు.
గత నెల 16న కడియం పోలీసు స్టేషన్‌లో ఈమె అదృశ్యమైందని కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరుసటి రోజు ఆలమూరు మండలం చొప్పెల్ల వద్ద కాలువలో ఆమె మృతదేహం లభ్యమైంది. నర్సరీల వద్ద హతురాలి కుమారుడి స్నేహితులకు నల్లపూసల దండ, గాజులు, రుమాలు, పిన్నులు కనిపించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. నాటి నుంచి నర్సరీల్లో పనులకు రాని వారు ఎవరన్న దానిపై పోలీసులు ఎంక్వైరీ చేశారు. దీంతో దేవర యేసు పేరు తెరపైకి వచ్చింది. అతడు తెలిపిన వివరాలతో మిగతా ముగ్గురినీ అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో మొత్తం వివరాలు వెల్లడయ్యాయి. నిందితులు నిత్యం గంజాయి, మద్యం మత్తులో ఉంటారని స్థానికులు, పోలీసులు చెప్పడం.. రాష్ట్రంలో పరిస్థితికి అద్దం పడుతోంది.
తిరుపతి జిల్లాలో మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య
తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలో మూడున్నరేళ్ల చిన్నారిపై సుశాంత్ అనే యువకుడు అత్యాచారం చేసి, హత్య చేశాడు. ఏఎం పురం ఎస్టీ కాలనీకి చెందిన మధు, మమత దంపతులకు శాన్విక అనే మూడున్నరేళ్ల పాప ఉంది. మమత తన తమ్ముడి కాలికి గాయం కావడంతో అతడిని భర్త మధుతో కలసి ఈనెల 1న సాయంత్రం పుత్తూరు రాచపాలెం శల్య వైద్యశాలకు తీసుకెళ్లింది. రాత్రి ఇంటికి వచ్చి చూడగా.. కుమార్తె కనిపించలేదు.
సాయంత్రం వారు ఆస్పత్రికి వెళ్లేటప్పుడు సుశాంత్ అనే వ్యక్తి చిన్నారితో ఆడుకుంటున్నట్టు తల్లిదండ్రులు తెలిపారు. సుశాంత్ ను పాప ఎక్కడని అడిగితే తనకు తెలియదంటూ సమాధానం ఇచ్చాడని, సాయంత్రం తాను ఐస్‌క్రీమ్ తీసిచ్చి వెళ్లిపోయానని చెప్పాడు. అతనిపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా అసలు విషయం వెలుగు చూసింది. చిన్నారిపై సుశాంత్ అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. బాలికకు చాక్లెట్లు, లేస్ ఇప్పిస్తానని చెప్పి గ్రామంలోని స్కూలు వెనుక పొలంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి ఆపై హత్య చేసినట్లు సుశాంత్ నేరం అంగీకరించాడు.
ఇవీ చదదవండి: Crime News: టీనేజ్ అమ్మాయి విశృంఖలత్వం.. 19 మందికి ఒకేసారి హెచ్ఐవీ
Guntur Crime: దాష్టీకానికి మరో అమ్మాయి బలి… తెనాలి యువతి కన్నుమూత
AP Crime News: కాశీబుగ్గలో ఇద్దరు బాలికలపై అత్యాచారం!
AP Crime News: బద్వేలులో విద్యార్థినిపై అఘాయిత్యం అనాగరిక చర్య
