Crime News: భర్తకు తెలియకుండా తన స్నేహితుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న కోడలిని అత్త మందలించింది. దీంతో ఓర్వలేని ఆ కోడలు అత్తపై దాష్టీకానికి (Crime News) పాల్పడింది. ప్రియుడితో కలిసి ఘోరానికి తెరతీసింది.
బిహార్‌లోని పాట్నా జిల్లాలో ఈ సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. కోడలు వివాహేతర బంధం కొనసాగించడం గమనించిన అత్త.. మందలించింది. ప్రశ్నించింది. దీంతో ఆమె అత్తను హత్య చేసేందుకూ వెనుకాడలేదు. పాలిగంజ్‌లోని సింగోడి పోలీస్ స్టేషన్ పరిధిలోని డియోరియా గ్రామంలో ప్రియుడితో కలిసి అత్తను కోడలు హతమార్చింది. మృతురాలిని దేవరియాకు చెందిన గుడ్డి దేవిగా గుర్తించారు. ఆమెతోపాటు నిందితుడు సుందర్ యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
గుడ్డిదేవి కోడలు అదే గ్రామానికి చెందిన సుందర్ యాదవ్‌తో వివాహేతర బంధం కొనసాగిస్తున్నట్లు పాలిగంజ్ డీఎస్పీ-1 ప్రీతమ్ కుమార్ వెల్లడించారు. ఇద్దరూ కలిసి శృంగార కార్యకలాపాల్లో పాల్గొనే వారు. ఎక్కువ సమయం కలిసుండేవారు. అలాంటి పరిస్థితిలో ఒకరోజు కోడలు సుందర్‌ని ఇంటికి పిలిచి చనువుగా ఉండటాన్ని గుడ్డిదేవి గమనించింది. వీళ్ల రాసలీలలు కనిపెట్టిన అత్త.. ప్రశ్నించింది. దీంతో గుడ్డిదేవి తన కోడలుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తన కుమారుడికి కూడా చెబుతానంటూ బెదిరించింది. భయం పెట్టాలని ప్రయత్నించింది.
గుడ్డి దేవి బెదిరించడంతో కోడలు యువకుడితో మాట్లాడడం మానేసిందని ప్రీతమ్ కుమార్ తెలిపారు. సుందర్ దీనికి అస్సలు ఒప్పుకోలేదట. ఈ క్రమంలోనే నవంబర్ 14వ తేదీ రాత్రి ఇంట్లో అందరూ రాత్రి భోజనం చేసి నిద్రకు ఉపక్రమించిన సమయంలో రహస్యంగా ఇంట్లోకి ప్రవేశించి పదునైన ఆయుధంతో గుడ్డిదేవి మెడపై దాడి చేశాడు. నిందితులు మొదట పదునైన ఆయుధంతో మహిళపై దాడి చేశారని, ఆపై ఆమె నోటిలోకి తుపాకీ పెట్టి కాల్చారని పోలీసులు తెలిపారు. దీంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. గుడ్డిదేవి భర్త ఎదుటే నిందితుడు సుదర్ ఈ అఘాయిత్యం చేశాడు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ప్రియురాలితోపాటు నిందితుడు సుందర్‌ను పోలీస్ లు అదుపులోకి తీసుకున్నారు. హత్యకు వాడిన కంట్రీ మేడ్ పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు. గతంలో సుందర్ రాజస్థాన్‌లో పనిచేశాడు. అదే సమయంలో గుడ్డిదేవి కోడలు కూడా అక్కడే ఉండేది. ఆ తర్వాత ఇద్దరికీ పరిచయం ఏర్పడి ఆ తర్వాత ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. పండుగ సందర్భంగా సుందర్, మహిళ కోడలు ఇంటికి వచ్చారు. ఈ పరిస్థితుల్లో సుందర్ తరచూ తన కోడలిని కలిసేందుకు మహిళ ఇంటికి వస్తుండడంతో మహిళకు అనుమానం వచ్చింది. తర్వాత కోడల్ని నిలదీయడం, ఆ తర్వాత ఆమె కోపంతో ప్రియుడి సాయంతో హత్య చేయడం జరిగాయి.
ఇవీ చదవండి: Telangana crime news: గుండెపోటుతో 12 ఏళ్ల బాలిక మృతి.. పండుగ వేళ విషాదం
Supreme Court: వివాహేతర బంధం నిర్ధారణకు కాల్ రికార్డులు తీసుకోవచ్చా? సుప్రీంకోర్టు ఏమందంటే..
Marriage: మీకు తెలుసా? అక్కడ ప్రతి వ్యక్తీ ఇద్దరిని మనువాడాలట!
Lust Stories 2: మరోసారి తమన్నా బోల్డ్ యాక్టింగ్.. లస్ట్ స్టోరీస్ 2 ట్రైలర్‌లో విజయ్ వర్మతో రొమాన్స్!
