YS Jagan : జమ్మూకశ్మీర్‌లో వీరమరణం చెందిన జవాన్ మురళీనాయక్ కుటుంబాన్ని మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించనున్నారు. అందుకోసం ఈనెల 13న ఆయన శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం, గడ్డంతండా పంచాయతీ పరిధిలోని కల్లితండా వెళ్తారు. 2022లో అగ్నివీర్ జవాన్‌గా సైన్యంలో చేరిన మురళీనాయక్ జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో శుక్రవారం ఉదయం వీరమరణం చెందారు.
శుక్రవారం మధ్యాహ్నం మురళీనాయక్ కుటుంబ సభ్యులను ఫోన్‌లో పరామర్శించిన వైయస్ జగన్, వారికి ఓదార్పునిచ్చారు. మురళీనాయక్ తల్లిదండ్రులు జ్యోతిబాయి, శ్రీరామ్‌నాయక్‌తో ఫోన్‌లో మాట్లాడి వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మురళీనాయక్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. కాగా, వ్యక్తిగతంగా కూడా వారిని పరామర్శించడానికి ఈనెల 13న జగన్ కల్లితండా వెళ్తున్నారు.
ఇవీ చదవండి: Jagan Meeting : ముఖ్యనేతలతో జగన్.. వచ్చేది మనమేనంటూ కీలక వ్యాఖ్యలు!
YS Jagan Meeting : తెగువ ఎలా ఉంటుందో చాటి చెప్పారు : వైయస్ జగన్
