AP Education Volunteers: ఏపీలో విద్యావాలంటీర్ల నియామకాన్ని పునరుద్ధరించేందుకు ఎన్డీయే ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఈ మేరకు కథనాలు వెలువడ్డాయి. ఉపాధ్యాయుల కొరత ఉన్న చోట విద్యావాలంటీర్లను (AP Education Volunteers) నియమించేందుకు ఏపీ రాష్ట్ర విద్యాశాఖ ఆలోచిస్తోందని సమాచారం. 2030 నాటికి అన్ని బడులకూ నాలుగు స్టార్ల రేటింగ్ సాధించేలా చర్యలు తీసుకోవడంలో భాగంగా ఈ మేరకు టీచర్ల కొరత లేకుండా చూడాలని విద్యాశాఖ యోచిస్తోందట.
అయితే, దీనిపై డీఎస్సీ అభ్యర్థులు ఆలోచనలో పడ్డారు. ఇప్పటికే మెగా డీఎస్సీ అని ప్రకటించిన ప్రభుత్వం.. నోటిఫికేషన్ వాయిదా వేసింది. అదే సమయంలో వచ్చే అకడమిక్ ఇయర్ జూన్ 12 నాటికి పోస్టులు భర్తీ చేస్తామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మంత్రి నారా లోకేష్ ఇదే విషయం అసెంబ్లీలో, వెలుపల కూడా చెప్పారు. అయితే 16,347 పోస్టులతో డీఎస్సీ ప్రక్రియ భర్తీ తర్వాత ఉపాధ్యాయుల కొరత ఉంటే విద్యావాలంటీర్లను నియమించుకోవాలని విద్యాశాఖ ఆలోచన చేయడం అనేది ఇప్పుడు టీచర్ ఉద్యోగార్థులను ఆలోచింపజేస్తోంది. ఖాళీలు ఉంటే మొత్తం డీఎస్సీ ద్వారానే భర్తీ చేయొచ్చు కదా.. మళ్లీ వాలంటీర్లు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియమించనుందని తెలుస్తోంది. మొదట ఉపాధ్యాయులను సర్దుబాటు అంటే ట్రాన్స్ ఫర్లు చేసి, పదోన్నతులు పూర్తి చేసిన తర్వాత డీఎస్సీ 2024 ద్వారా 16,347 పోస్టుల భర్తీ చేస్తారని సమాచారం. అప్పటికీ ఎక్కడైనా కొరత ఉంటే విద్యావాలంటీర్లను నియమిస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ గురించి రోజుకో అప్ డేట్ వస్తుండడంతో నిరుద్యోగుల్లో ఆశలు పెరుగుతున్నాయి. త్వరగా నోటిఫికేషన్ వస్తే తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటామంటున్నారు అభ్యర్థులు.
ఇవీ చదవండి: AP DSC – 2024: ఏపీ డీఎస్సీ లేటెస్ట్ అప్‌డేట్.. ఫిబ్రవరిలో నోటిఫికేషన్!
Andhra Pradesh Mega DSC: విద్యావాలంటీర్ల నియామకమేనా? 16,347 పోస్టుల డీఎస్సీ ఎప్పుడు?
AP Mega DSC: మెగా డీఎస్సీ ద్వారా ఆరు నెలల్లో టీచర్ పోస్టుల భర్తీ: లోకేష్
Mega DSC: ఆర్ఆర్ మిశ్రా కమిటీ నివేదిక ఎప్పుడు? ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ అప్ డేట్!
