HomeAstrologyMithuna Rasi 2025: మిథున రాశి 2025 ఫలితాలు.. మూడేళ్ల కష్టాలకు చెల్లు చీటీ!

Mithuna Rasi 2025: మిథున రాశి 2025 ఫలితాలు.. మూడేళ్ల కష్టాలకు చెల్లు చీటీ!

Mithuna Rasi 2025: ద్వాదశ రాశుల్లో మూడోదైన మిథున రాశి వారికి 2025 సంవత్సరం రాశి (Miyhuna Rasi 2025) ఫలాలు అన్ని విధాలా అనుకూలంగా ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. గత మూడు సంవత్సరాలుగా పడుతున్న ఇబ్బందులు ఈ సంవత్సరం తీరిపోతాయని, ఈ ఏడాది చాలా అనుకూలమైన ఫలితాలు చవిచూస్తారని ఆస్ట్రాలిజిస్టులు స్పష్టం చేస్తున్నారు. ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి (Venu Swamy) చెప్పిన మిథున రాశి 2025 ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి.

మిథున రాశి 2025 ఫలితాలు

మృగశిర 3, 4 పాదాలు
ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు
పునర్వసు 1, 2, 3 పాదాలు

ఈ సంవత్సరం మిధున రాశి జాతకులకు
ఆదాయం 14
వ్యయం 2
రాజపూజ్యం 4
అవమానం 3

గురువు వ్యయంలో నుంచి లగ్నం లోకి వస్తున్నాడు. రాహువు కూడా అనుకూలంగా ఉన్నాడు. శనిఅనుకూలంగా ఉన్నాడు. కాబట్టి చాలా చాలా అనుకూలంగా ఉండబోతోంది. ఈ సంవత్సరం రాజకీయ నాయకులకు విశేషించి మిధున రాశి వారికి యోగకాలం.

గత రెండున్నర మూడేళ్ల నుంచి మీరు పడుతున్న కష్టాలు తొలగిపోతాయి. జనాల్లో విపరీతమైన క్రేజ్ వస్తుంది. ఎన్నికల్లో పోటీ చేస్తే గెలుస్తారు. జనాల నుంచి విపరీతమైన ప్రేమను పొందుతారు. పార్టీ పెద్దల అనుమతితో, సంకల్పంతో, ప్రేమతో ఏదైనా పదవిని పొందే అవకాశాశాలు కనిపిస్తున్నాయి.

విద్యార్థులకు పూర్తి స్థాయిలో అనుకూలతలు ఏర్పడుతున్నాయి. కాకపోతే జూన్ వరకు బాగానే ఉంటుంది. ఓవర్ కాన్ఫిడెన్స్, చెడు స్నేహాల వల్ల సెకండాఫ్ లో ర్యాంకులు తగ్గే అవకాశం ఉంది. ఉత్తీర్ణత శాతం, మార్కులు తగ్గుతాయి. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.

విదేశాల్లో ఉన్న వారికి పేపర్స్ మిస్సింగ్ వల్ల వీసా రిలేటెడ్, డాక్యుమెంట్ మిస్సింగ్ వల్ల సమస్యలు ఎదుర్కొంటారు. కాబట్టి డాక్యుమెంట్లను జాగ్రత్తగా చూసుకోవాలి. పేపర్ వర్కులో జాగ్రత్తగా ఉండాలి.

ఉద్యోగులకు అనుకూలంగా ఉంది. ట్రాన్స్ ఫర్లు, ప్రమోషన్లు, మ్యూచువల్ ప్రమోషన్లు అనుకూలం. పై అధికారుల మన్ననలు పొందుతారు. న్యాయవాద వృత్తిలో ఉన్న వారికి అనుకూలం. హాస్పిటళ్లు ఉన్న వారికి విపరీతమైన లాభాలు వస్తాయి.

రైతులకు సంబంధించి ఫస్ట్ పంట చాలా ఎక్కువగా వచ్చినా సెకండ్ పంట తక్కువ దిగుబడి ఇచ్చే ఆస్కారం ఉంది. రెండో పంట విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మొదటి పంట అనుకూలంగా ఉన్నా రెండో పంట విషయంలో ఏ పంట వేయాలి, వర్షాభావ పరిస్థితులు ఆలోచన చేసుకుని జాగ్రత్తలు తీసుకోవాలి.

ఈ సంవత్సరం స్త్రీలకు అవివాహితులకు వివాహ యోగ సూచనలు గోచరిస్తున్నాయి. సంతానం లేని వారికి సంతానయోగ సూచనలు. చాలా అనుకూలంగా ఉండబోతోంది.

ఓవరాల్ గా ఈ సంవత్సరం ఏవైనా చెడు అలవాట్లు, చెడు స్నేహితుల వల్ల సమస్యయలు ఏర్పడు అవకాశం ఉంది తప్ప.. ఇతరత్రా జాతకపరంగా పూర్తిగా అనుకూలంగా ఉంది.

Read also: Vrushabha rasi: వృషభరాశి 2025 ఫలితాలు.. పట్టిందల్లా బంగారమే!
2025 Mesha Rasi: 2025 మేష రాశి ఫలాలు.. 98 శాతం అనుకూలం?
2025 Rasi Phalalu: విశ్వావసు నామ సంవత్సరం 2025 రాశి ఫలాలు

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు