Vrushabha rasi: ద్వాదశ రాశుల్లో రెండోదైన వృషభ రాశి వారికి 2025 సంవత్సరం ఎలా ఉండబోతోంది? గత ఆరేడు సంవత్సరాలుగా పడుతున్న కష్టాలకు (Vrushabha rasi) ఈ ఏడాది విముక్తి లభించబోతోందా? పట్టిందల్లా బంగారంగా మారబోతోందా? ఏయే వర్గాల వారికి ఎలా ఉండబోతోంది? ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఈ రాశి వారికి 2025 సంవత్సరంలో అంతా బాగుందంటున్నారు. ఆయన చెప్పిన మేరకు ఈ రాశి వారికి ఫలితాలు ఇలా ఉన్నాయి..
వృషభరాశి
కృత్తిక 2, 3, 4 పాదాలు
రోహిణి 1, 2, 3, 4 పాదాలు
మృగశిర 1, 2 పాదాలు
ఈ సంవత్సరం వృషభరాశి జాతకులకు
ఆదాయం 11
వ్యయం 5
రాజపూజ్యం 1
అవమానం 3
అన్ని రాశుల్లోకి చాలా అనుకూలమైన రాశి వృషభరాశి. ఈ సంవత్సరం గురు, శని బలం చాలా అనుకూలంగా ఉంది. రాహువు బలం అనుకూలంగా ఉంది. కేతువు బలం అనుకూలంగా ఉంది. ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. గత ఆరేడు సంవత్సరాల నుంచి మీరు పడుతున్న కష్టాలన్నీ తొలగిపోతాయి. స్త్రీ పురుషులు ఇద్దరికీ ఈ సంవత్సరం అనుకూలంగా ఉండబోతోంది. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం సిద్ధిస్తుంది. ట్రాన్స్ ఫర్లు వస్తాయి. ప్రమోషన్లు వస్తాయి. కోరుకున్న చోటకు బదిలీలు పొందవచ్చు. ఇంక్రిమెంట్లు లభిస్తాయి.
విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. కాంపిటీటివ్ పరీక్షలు, ట్రిపుల్ ఐటీ, ఇతరత్రా పరీక్షలకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. మార్కులు ఎక్కువ వస్తాయి. పర్సెంటేజీ పెరుగుతుంది. అనుకున్న కాలేజీలో ప్లేస్ మెంట్లు దొరుకుతాయి. ఉద్యోగాలు దక్కుతాయి. ఇతర దేశాలకు వెళ్లడానికి అనుకూలంగా ఉంది. ఇతర దేశాల్లో ఉన్న విద్యార్థులకు ఉద్యోగాలు సిద్ధిస్తాయి. ఇతర దేశాల్లో ఉండే విద్యార్థులు వ్యాపారం చేయాలన్నా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు 100కు 100 శాతం ఈ సంవత్సరం అనుకూలంగా ఉండబోతోంది.
ఉద్యోగులకు పరిపూర్ణంగా అనుకూలంగా ఉంటుంది. ప్రమోషన్లు, ట్రాన్స్ ఫర్లు లభిస్తాయి. పై అధికారుల మన్ననలు పొందుతారు. సంఘంలో మంచి పేరు లభిస్తుంది.
రైతులకు ఈ సంవత్సరం రెండు పంటలు పూర్తి దిగుబడి ఎక్కువగా వస్తుంది. రాబడి పెరుగుతుంది. అప్పులు తీరుస్తారు. శుభకార్యాలు నెరవేరుస్తారు. గృహం కొనడం, భూమి కొనడం జరుగుతుంది.
కళాకారులకు అనుకూలం. విదేశాల్లో ప్రోగ్రాములు చేసే వారికి విశేషించి యోగ కాలం. సమాజంలో పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అవార్డులు, రివార్డులు వెతుక్కుంటూ వస్తాయి.
క్రీడాకారులకు సంబంధించి ఈ సంవత్సరం మంచి ప్లేస్ మెంట్లు కనిపిస్తున్నాయి. స్టేట్ లెవల్, జిల్లా లెవల్, నేషనల్ లెవల్లో ఆడే వారికి ఈ సంవత్సరం ప్లేస్ మెంట్స్ కనిపిస్తున్నాయి. మంచి అవకాశాలు ప్రాధాన్యంతో దక్కించుకుంటారు. అవార్డులు, రివార్డులు పొందుతారు.
ఓవరాల్ గా ఈ సంవత్సరం వృషభరాశి జాతకులకు విశ్లేషిస్తే అన్ని రంగాల వారికీ విద్యార్థులకు, ఉద్యోగులు, రైతులు, స్త్రీలు, పురుషులకు అందరికీ అనుకూలంగా ఉంది. అయితే, ఓవర్ కాన్ఫిడెన్స్ ద్వారా ఏమైనా సమస్యలు తెచ్చుకునే అవకాశం ఉంది. ఎలాంటి సమస్యలు లేవు. పూర్తిగా అనుకూలంగా ఉండే జాతకంగా భావించాలి.
ఇవీ చదవండి: 2025 Mesha Rasi: 2025 మేష రాశి ఫలాలు.. 98 శాతం అనుకూలం?
2025 Rasi Phalalu: విశ్వావసు నామ సంవత్సరం 2025 రాశి ఫలాలు
Rasi Phalalu 2024 Venu swamy: వేణు స్వామి చెప్పిన సంచలనాలు.. 2024లో ఏ రాశి వారికి ఎలా ఉందంటే..!
