Vijay Devarakonda dating: టాలీవుడ్ స్టార్ హీరో, అర్జున్ రెడ్డి ఫేమ్.. విజయ్ దేవరకొండ ఎట్టకేలకు తన రిలేషన్ షిప్ స్టేటస్ గురించి ఓపెన్ గా చెప్పాడు. తాను సింగిల్ గా లేనని క్లారిటీ ఇచ్చాడు. విజయ్ దేవరకొండ (Vijay devarakonda dating) రష్మిక మందన్నతో (Rashmika madanna) డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వచ్చిన సంగతి తెలిసిందే.
అభిమానులు తరచుగా వారి జర్నీ ఆల్బమ్‌లలో సారూప్యతలను గుర్తించారు. ఈ ఏడాది దీపావళిని విజయ్ దేవరకొండ, అతని కుటుంబంతో కలిసి రష్మిక జరుపుకుంది. ఇటీవల, విజయ్ దేవరకొండ ప్రేమ, సంబంధాలపై తన ఆలోచనలను పంచుకున్నాడు.
విజయ్ దేవరకొండ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “ప్రేమించడం ఎలా ఉంటుందో నాకు తెలుసు. ప్రేమించడం అంటే ఏమిటో నాకు తెలుసు. నాకు షరతులు లేని ప్రేమ తెలియదు. ఎందుకంటే నా ప్రేమ అంచనాలతో వస్తుంది. షరతులు లేని ప్రేమను ఆశించడం కూడా నాకు తెలియదు.” అని పేర్కొన్నాడు. “నేను నా సహ నటితో డేటింగ్ చేశాను.” అని పేర్కొన్నాడు.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో కలిసి పనిచేశారు. మాల్దీవులలో టూర్ లో వారిపై పుకార్లు షికార్లు చేశాయి. జనవరి 2023లో డేటింగ్ పుకార్లు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి.
“నేను డేట్స్‌కి వెళ్లను. ఎవరితోనైనా పరిచయం ఏర్పడిన తర్వాత, స్నేహాన్ని పెంచుకున్న తర్వాత మాత్రమే నేను బయటకు వెళ్తాను.” అని ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ పేర్కొన్నాడు.
పెళ్లిపై తన ఆలోచనలను పంచుకుంటూ, విజయ్ దేవరకొండ, “పెళ్లి అనేది ఒకరి కెరీర్‌కు మధ్య రావాల్సిన అవసరం లేదు. వివాహం అనేది మహిళలకు కష్టం. ఇది మీరు చేస్తున్న వృత్తిపై కూడా ఆధారపడి ఉంటుంది” అని చెప్పాడు.
ఇంతకుముందు, రష్మిక మందన్న ఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండతో తన ఈక్వేషన్ గురించి మాట్లాడారు. “విజూ, నేను కలిసి పెరిగాం. కాబట్టి నేను ప్రస్తుతం నా జీవితంలో ఏ పని చేసినా దానికి అతని సహకారం ఉంటుంది. నేను చేసే ప్రతి పనిలో అతని సలహా తీసుకుంటాను. నాకు అతని అభిప్రాయం అవసరం. అతను నా జీవితంలో అందరికంటే ఎక్కువగా నాకు సపోర్టుగా నిలిచాడు.’’అని రష్మిక పేర్కొంది.
ఇవీ చదవండి: Vijay Devarakonda: బ్రహ్మాస్త్ర పార్ట్2లో కీ రోల్ చేయనున్న విజయ దేవరకొండ!
TRP Rating: టీఆర్పీ రేటింగ్‌లో దుమ్మురేపిన సినిమాలు ఇవే..
Family Star Movie Review: ‘ఫ్యామిలీ స్టార్’తో దేవరకొండ మెప్పించాడా? సినిమా రివ్యూ..
Family Star: ఫ్యామిలీ స్టార్ టీజర్ రిలీజ్.. మృణాల్, విజయ్ దేవరకొండ హిట్ గ్యారెంటీనా?
Vijay Deverakonda on marriage: పెళ్లయ్యాక నా భార్యతో ఇలా ఉండాలనుకుంటున్నా.. విజయ్ దేవరకొండ కామెంట్స్
