Sameera Reddy: సమీరారెడ్డి తన బాల్యంలో ఎదుర్కొన్న కష్టాల గురించి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది. చిన్నప్పుడు తనకు నత్తి (stammering) సమస్య ఉండేదని, దాని వల్ల చాలా మంది తనను వెక్కిరించేవారని తెలిపింది. నత్తి సమస్య కారణంగా తనలో ఆత్మవిశ్వాసం తగ్గిపోయిందని, దాన్ని అధిగమించడానికి సంవత్సరాల పాటు థెరపీ తీసుకోవాల్సి వచ్చిందని సమీరా చెప్పింది. ఇప్పటికీ ఎవరైనా దానిపై సెటైర్లు వేస్తే బాధ కలుగుతుందని వెల్లడించింది.
చిన్నప్పుడు వినే మాటలు జీవితంపై ప్రభావం
పిల్లలను “స్లో, వీక్” అని పదేపదే పిలిస్తే వారు అదే నిజమని నమ్మే ప్రమాదం ఉందని ఆమె పేర్కొంది. ఇలాంటి వ్యాఖ్యలు పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని తగ్గించి కొత్త విషయాలు ప్రయత్నించకుండా చేస్తాయి అని సమీరా వివరించింది.
పిల్లలతో ఓపెన్ కమ్యూనికేషన్ అవసరం
తన పిల్లలకు ఏ సమస్య వచ్చినా తనతో చెప్పాలని చెప్పుతానని సమీరా తెలిపింది. అలాగే ఎవరినీ కించపరచకూడదని, పరస్పరం గౌరవించుకోవాలని పిల్లలకు నేర్పుతానని వెల్లడించింది.
కుటుంబం, గురువుల మద్దతు కీలకం
తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్నేహితులు కలిసి పిల్లలకు ప్రోత్సాహం ఇస్తే వారు జీవితంలోని సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోగలరని ఆమె అభిప్రాయపడింది. సమీరా 2014లో Akshai Vardeను వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లిగా జీవిస్తోంది.
ఇవీ చదవండి: Sameera Reddy : జిమ్ కు వెళ్లకుండానే బరువు తగ్గిన స్టార్ హీరోయిన్
Sunny Deol : ఓటీటీలో సన్నీ డియోల్ జాట్ సంచలనం.. టాప్ 5లోకి!
OTT Movies: వీకెండ్ OTT ఫుల్ జోష్.. ఒక్కరోజే 26 రిలీజ్‌లు! ఏ ప్లాట్‌ఫామ్‌లో ఏం చూడాలి?
OTT Movies: థియేటర్లలో యావరేజ్.. ఓటీటీలోనూ అంతగా కాదు! ‘ది డిప్లొమాట్’ సినిమా గురించి ఆసక్తికర విషయాలు
