HomeAndhra PradeshTirumala news: తిరుమలలో అధికారుల నిర్లక్ష్యం.. ఈవో సంచలన వ్యాఖ్యలు

Tirumala news: తిరుమలలో అధికారుల నిర్లక్ష్యం.. ఈవో సంచలన వ్యాఖ్యలు

Tirumala news: తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో తుడ రూపొందించిన మాస్టర్ ప్లాన్ అమలు చేయాలని 2019లోనే రెడీ అయిందన్న ఈవో, టిటిడిలో ఒక ప్లాన్ ప్రకారం నిర్మాణాలు జరగడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. (Tirumala news)

‘‘తిరుమలలో టిటిడి అధికారులు ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారు. టిటిడి తిరుమలకు ఒక కన్సల్టెన్సీ పిలిచే ఆలోచన విజన్ డాక్యుమెంట్. గతంలో మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి జరగలేదు. తిరుమల పవిత్రతను ప్రతిభింబించేలా అధునాతన ఆర్కిటెక్చర్ తో రూపొందిస్తాం. తిరుమలలో డోనార్ అథిది గృహాలకు టిటిడి సూచించిన పేర్లు మాత్రమే పెట్టాలి.

తిరుమలలో బిల్డింగ్ లు ఇష్టారాజ్యంగా నిర్మించారు. ప్రస్తుతం నిబంధనలు పాటించలేదు. అవి చూసుకునే వ్యవస్థ కూడా లేదు. తిరుమలలో అర్బన్ డిజైనింగ్ అండ్ టౌన్ ప్లానింగ్ విభాగం ఏర్పాటు చేస్తాం. రాబోయే 25 సంవత్సరాలకు సరిపడేలా విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తున్నాం. ప్రత్యేక కన్సల్టెన్సీ పిలిచే ఆలోచన లో ఉన్నాం. భక్తులకు ఇబ్బంది లేకుండా తిరుమల మోడల్ టౌన్ లా తీర్చిదిద్దుతాం.

గెస్ట్ హౌస్ లు నిర్మాణాలు చేస్తున్నారు. పార్కింగ్ సౌకర్యం లేకుండా అనుమతులు ఇస్తున్నారు. అండర్ పాస్ లు, ఫుట్ పాత్ లు విస్తృతంగా ఏర్పాటు చేయాల్సి ఉంది. తిరుమల పార్కింగ్ సమస్య ఎక్కువగా ఉంది. తిరుమలలో మల్టి లెవల్ పార్కింగ్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నాం. తిరుమలలో వేస్ట్ రీసైక్లింగ్ కు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నాం

తిరుమలలో ఒక మఠం లీజ్ కండిషన్స్ ఉల్లంగించించి, అందుకే పాలకమండలి రద్దు నిర్ణయం తీసుకుంది, మిగిలిన మఠాలు పై విజిలెన్స్ నిఘా పెట్టాం. కల్తీ నెయ్యి వివాదంపై సుప్రీం కోర్టు నియమించిన సీబీఐ సిట్ బృందం విచారణకు సంబంధించి ఇంకా ఎలాంటి భవనం కేటాయించలేదు.’’ అని ఈవో శ్యామలరావు వ్యాఖ్యానించారు.

ఇవీ చదవండి: TTD: బీఆర్ నాయుడు చైర్మన్‌గా తొలి భేటీ.. టీటీడీ కీలక నిర్ణయాలు!
TTD Board: టీటీడీ బోర్డులో ఏపీ నుంచి ఒక్క బ్రాహ్మణుడికీ దక్కని చోటు
TTD Chairman: లోకేష్ మార్క్.. టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడు.. ఆర్కే పరిస్థితి?
TTD Big News: టీటీడీ కీలక నిర్ణయాలు.. 15 ఏళ్లలోపు చిన్నారులకు నడక దారిలో రిస్ట్రిక్షన్స్‌.. బైక్‌లకు రాత్రిపూట నో ఎంట్రీ!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు