HomeCrime NewsAdani court case: అమెరికా కోర్టులో అదానీపై కేసు.. మధ్యలో జగన్? వాస్తవం ఏంటి?

Adani court case: అమెరికా కోర్టులో అదానీపై కేసు.. మధ్యలో జగన్? వాస్తవం ఏంటి?

Adani court case: ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై (Goutam Adani) అమెరికాలోని న్యూయార్క్ కోర్టులో అవినీతి కేసు నమోదైంది. భారత్ లో అతిపెద్ద సోలార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో అదానీ గ్రూప్ లంచాలు ఇచ్చిందని ఆ అవినీతి ఆరోపణల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. (Adani court case)

వేర్వేరు రాష్ట్రాల ప్రభుత్వాధినేతలకు రూ.2029 కోట్ల లంచాలు ప్రొవైడ్ చేసినట్లు ఆ కేసులో పేర్కొనడం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆంధ్రప్రదేశ్ సహా తమిళనాడు, జమ్మూకశ్మీర్, ఛత్తీస్ గఢ్, ఒడిశాల్లో ఒప్పందాలకు లంచం ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. 2019-24 మధ్య అప్పటి ఏపీ ప్రభుత్వాధినేతకు రూ.1,750 కోట్ల లంచం ముట్టజెప్పినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మిగతా 4 రాష్ట్రాల్లో ఒప్పందాలకు రూ.279 కోట్ల లంచం ఇచ్చారని వార్తలు వస్తున్నాయి.

2021లో వ్యక్తిగతంగా ఆనాటి సీఎం జగన్ తో అదానీ భేటీ అయిన తర్వాత డీల్ కుదిరినట్లు బ్రూక్లిన్ కోర్టులో అభియోగాలు నమోదయ్యాయని మీడియాలో కథనాలు వస్తున్నాయి. 20 ఏళ్లలో 2 బిలియన్ డాలర్ల లాభాలే లక్ష్యంగా లంచాలు ఇచ్చి ఒప్పందాలు కుదుర్చుకున్నారని అభియోగాలు నమోదైనట్లు వార్తలు వచ్చాయి. గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్, మరో ఏడుగురిపై కేసు నమోదైనట్లు అభియోగాల్లో ఉందని వార్తలు వచ్చాయి.

తప్పుడు పద్దతుల్లో అమెరికా పెట్టుబడులు రాబట్టారని అదానీపై ఆరోపణలున్నాయని, 250 మిలియన్ డాలర్లు అధికారులకు అదానీ లంచం ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. సాగుకు 7 వేల మెగావాట్ల ఉచిత విద్యుత్ కోసమని సెకీతో వైయస్సార్ సీపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని, 2025 నుంచి విద్యుత్ ఇస్తామని ఒప్పందంలో సెకీ తెలిపిందని వార్తలు వస్తున్నాయి.

అదానీ పవర్ నుంచి కొన్న విద్యుత్ ను ఏపీకివ్వాలని సెకీ నిర్ణయం తీసుకుందని, 2021 అక్టోబరు 14న జగన్ ఇంటికి వచ్చి కలిసిన గౌతమ్ అదానీ.. ఈ భేటీ అనంతరం సెకీ ఒప్పందం కార్యరూపం దాల్చేలా చేశారని మీడియాలో కథనాలు వచ్చాయి. రూ.2.49కు యూనిట్ చొప్పున వైయస్సార్ సీపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని, 2.4 గిగావాట్ల కొనుగోలుకు 25ఏళ్లపాటు రూ.2.49 చొప్పున చెల్లించేలా ఒప్పందం కుదిరిందని వార్తలు వచ్చాయి. గుజరాత్ కు రూ.1.99కే సెకీ ద్వారా విక్రయించిన అదానీ పవర్.. 7వేల మె.వా. కొనుగోలుకు డీల్ కుదిరినట్టు ఛార్జ్ షీట్ లో ఎఫ్‌బీఐ పేర్కొన్నట్లు మీడియాలో కథనాలు వచ్చాయి.

అదానీ గ్రూప్ వివరణ
అమెరికాలో లంచం ఆరోపణలపై అదానీ గ్రూప్ బహిరంగ ప్రకటన చేసింది. యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ తమ సంస్థపై చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారం, ఖండిస్తున్నామని పేర్కొంది. తమ సంస్థ పూర్తి పారదర్శకతతో నిబంధనలు పాటిస్తుందని స్పష్టం చేసింది. వాటాదారులు, భాగస్వాములు, ఉద్యోగులు ఆందోళనచెందొద్దని భరోసా ఇచ్చింది. తాము చట్టాలకు కట్టుబడి ఉంటామని అదానీ గ్రూప్‌ స్పష్టీకరించింది. దీనిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఇంకా స్పందించాల్సి ఉంది. ఏది నిజం అన్నది వెల్లడించాల్సి ఉంది.

ఇవీ చదవండి: Adani Enterprises: అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ రికార్డు.. మార్చి త్రైమాసికంలో 137.5 శాతం లాభం
Phone Pay: ఫోన్‌ పే వాడుతున్నారా? ఈ గుడ్‌ న్యూస్‌ తెలుసా? యాక్టివేట్‌ చేసుకోండిలా!
America: అగ్రరాజ్యంలో సంపన్నులపై పన్ను ఎఫెక్ట్.. పెరగనున్న ట్యాక్స్ భారం!
Jagan longest press meet: ఆర్గనైజ్డ్‌ క్రిమినల్‌లా చంద్రబాబు వ్యవహారం.. రాష్ట్ర అప్పులు, బడ్జెట్‌పై జగన్ సంచలన వ్యాఖ్యలు

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు