Bhagyashri Borse: రామ్ పోతినేని సరసన భాగ్యశ్రీ బోర్స్ నటించనుంది. ఈ సినిమా త్వరలో ప్రారంభం కానుంది. భాగ్యశ్రీ బోర్స్ (Bhagyashri Borse) మరో తెలుగు చిత్రానికి సైన్ చేసింది. పి.మహేష్ బాబు దర్శకత్వం వహించే అతని తదుపరి చిత్రంలో ఈ ముద్దుగుమ్మ.. రామ్ పోతినేని సరసన జతకట్టింది.
మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రీసెంట్ గా ఈ సంస్థ తమ సోషల్ మీడియా హ్యాండిల్‌లో ఆమె కాస్టింగ్‌ను అధికారికంగా ప్రకటించింది. “ఇటీవలి సంచలనం భాగ్యశ్రీబోర్స్ #RAPO22లో జాయిన్ అయ్యింది. అందమైన ప్రయాణానికి తన అంగీకారాన్ని తెలిపింది. పూజా కార్యక్రమంతో ప్రయాణం ప్రారంభమవుతుంది. చూస్తూనే ఉండండి” అని ప్రొడక్షన్ హౌస్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
రవితేజ నటించిన ‘మిస్టర్ బచ్చన్’ మూవీతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన భాగ్యశ్రీ బోర్స్.. అనంతరం మరో ద్విభాషా (తెలుగు మరియు తమిళం) చిత్రం ‘కాంత’కు సైన్ చేసింది. భాగ్యశ్రీ మరో తెలుగు చిత్రానికి సంతకం చేసిందని తెలుస్తోంది. పి.మహేష్ బాబు దర్శకత్వం వహించే అతని తదుపరి చిత్రంలో భాగ్యశ్రీ రామ్ సరసన యాక్ట్ చేయనుంది.
అధికారిక ప్రకటన..
ఇంతకుముందు కొంతమంది నటీమణుల పేర్లు ప్రచారంలోకి వచ్చినప్పటికీ, దర్శకుడు పి.మహేష్ చివరికి భాగ్యశ్రీ బోర్స్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఆమె ఫోటోలు, లుక్ టెస్ట్ చూసిన తర్వాత ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. రామ్ పోతినేని, మహేష్‌లతో కలిసి నటించడంపై ఈ అమ్మడు థ్రిల్లింగ్ ఫీల్ అవుతోందట.
ఇది భాగ్యశ్రీ మూడో మూవీ
హీరో రామ్ పల్లెటూరి వాతావరణంలో పెరిగే నేపథ్యం ఈ మూవీలో కొనసాగుతుందని తెలుస్తోంది. ఈ తరహా కథల్లో రామ్ నటించి చాలా కాలమైంది. స్థానిక కథను ఎంపిక చేసుకోవడానికి ఇదే కారణం అని చెబుతున్నారు. రామ్ సరసన నటిస్తున్న ఈ చిత్రం భాగ్యశ్రీకి మూడోది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ సినిమా కోసం కూడా ఆమె షూటింగ్ చేస్తోంది. షూటింగ్ శరవేగంగా సాగుతోంది. నటి దాదాపు తన భాగాన్ని పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి: Meenakshi Chaudhary: నడుము అందాలతో కవ్విస్తున్న మీనాక్షి చౌదరి.. ఫొటోలు
Nargis Fakhri: నర్గీస్ ఫక్రీ ట్రెండీ లుక్స్.. రెడ్ డ్రెస్ హాట్ బ్యూటీ ఫొటో గ్యాలరీ
Rakul preet: న్యూ లుక్‌లో రకుల్ ప్రీత్ సింగ్.. ఫొటో గ్యాలరీ
Zarashatavari: హీరోయిన్లూ అసూయ పడే అందం.. ఏఐ భామ హాట్ ఫొటోలు
