HomeSportsRCB Captain: కౌన్ బనేగా ఆర్సీబీ కెప్టెన్? మెగా వేలంలో ఐదుగురిపై కన్ను!

RCB Captain: కౌన్ బనేగా ఆర్సీబీ కెప్టెన్? మెగా వేలంలో ఐదుగురిపై కన్ను!

RCB Captain: ఐపీఎల్ 2025 మెగా వేలం దగ్గరకు వచ్చేస్తోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఈసారి కీలక నిర్ణయాలు తీసుకునే వీలుంది. జట్టుకు ఇంతవరకు కెప్టెన్ ఫైనల్ కాలేదు. ఫాఫ్ డుప్లెసిస్‌ను ఆర్సీబీ (RCB Captain) ఇప్పటికే రిలీజ్ చేసేసింది. ఈ నేపథ్యంలో 2025 కొత్త సీజన్‌లో కొత్త కెప్టెన్‌ను అభిమానులు చూసే చాన్స్ ఉంది. ఐపీఎల్‌లో తొలిసారి ఛాంపియన్‌గా నిలిచే కెప్టెన్ కోసం జట్టు వేట మొదలు పెట్టింది. అన్ని జాగ్రత్తలూ తీసుకుంటోంది. కెప్టెన్ కోసం ఆర్‌సీబీ జట్టు కొందరు ఆటగాళ్లపై స్పెషల్ ఫోకస్ పెట్టిందట.

ఫాప్ డూప్లెసిస్ ను రిలీజ్ చేసిన తరుణంలో మళ్లీ విరాట్ పగ్గాలు చేపడతాడా అని చాలా మంది ఎదురు చూస్తున్నారు. గతంలో 143 మ్యాచ్‌లలో జట్టుకు నాయకత్వం వహించిన కింగ్.. ఇప్పుడు మళ్లీ కెప్టెన్సీ తీసుకుంటాడా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ సమయంలో ఆర్‌సీబీ జట్టు 66 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, 70 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. 3 మ్యాచ్‌లు టై కాగా, 4 మ్యాచ్‌ల్లో ఫలితం రాలేదు. విరాట్ చాలా కాలం పాటు జట్టుకు కెప్టెన్సీ తీసుకున్నాడు. కానీ, ఛాంపియన్‌ కల మాత్రం అలాగే మిగిలిపోయింది. (RCB Captain)

కేఎల్ రాహుల్ సారథి అవుతాడా?
లక్నో సూపర్ జెయింట్స్ (LSG) విడుదల చేసిన కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆర్సీబీ కెప్టెన్సీకి బలమైన పోటీదారుగా ఉండే చాన్స్ కనిపిస్తోంది. విరాట్ తర్వాతి స్థానంలో అతగాడే ఉన్నాడు. రాహుల్ కర్ణాటకకు చెందిన వ్యక్తి కావడం ప్లస్. ఇంతకు ముందు కూడా RCB తరపున ఆడిన అనుభవం కూడా ఉంది. పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్‌లకు కెప్టెన్‌గా చేశాడు. అతను 3 సీజన్లలో 2 సీజన్లలో లక్నోను ప్లేఆఫ్స్‌ వరకు తీసుకెళ్లగలిగాడు.

రిషభ్ పంత్
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నుంచి రిషభ్ పంత్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. చాలా జట్ల లిస్టులో హాట్ టాపిక్ అయ్యాడు. అతను RCB కొత్త కెప్టెన్‌గా మారొచ్చనే చర్చ ఉంది. పంత్ దూకుడు నాయకత్వం జట్టులో కొత్త శక్తిని ఇస్తుందంటున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్‌లో కెప్టెన్‌గా బాగానే ఆడాడు. అయితే, పంత్‌ను కొనుగోలు చేయడం RCBకి అంత ఈజీ కాదంటున్నారు. వేలంలో అతని కోసం చాలా ఫ్రాంచైజీలు పోటీ పడే చాన్స్ ఉంది. ముఖ్యంగా పంజాబ్ కింగ్స్ వద్ద రూ.110 కోట్లు ఉండటంతో గరిష్ట ధర చెల్లించి అతడిని దక్కించుకునే అవకాశం ఉంది.

శ్రేయస్ కూడా..
గత సీజన్ లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను మూడో ఐపీఎల్ టైటిల్‌కు ముందుకు నడిపించిన శ్రేయాస్ అయ్యర్ నాయకత్వ అనుభవం RCBని ఆకర్షించవచ్చు. అయ్యర్ ఒత్తిడిలో కూడా మ్యాచ్ లను గెలిపించగలడని పేరుంది. ఈసారి కెప్టెన్సీ కోసం పోటీ పడుతున్న వారిలో అయ్యర్ ఉండే చాన్స్ కనిపిస్తోంది.

ఫాఫ్ మళ్లీ పగ్గాలు చేపడతాడా?
గత సీజన్‌లో డుప్లెసిస్ జట్టును ప్లేఆఫ్స్‌కు వరకు తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఫాఫ్ చాలా లీగ్‌లలో కెప్టెన్‌గా వ్యవహరించాడు. అతను ఇటీవల కరీబియన్ ప్రీమియర్ లీగ్ (CPL)లో తన జట్టును ఛాంపియన్‌గా నిలపడంలో తిరుగులేని విజయం సాధించాడు. ఒకవేళ విరాట్ కెప్టెన్సీని నిరాకరిస్తే, ఆర్సీబీ టీమ్ పంత్, రాహుల్, అయ్యర్‌లలో ఎవరినీ కొనుగోలు చేయని పక్షంలో మళ్లీ ఫాఫ్ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నా ఆశ్చర్యం లేదంటున్నారు క్రికెట్ పండితులు.

వార్నర్ భాయ్ కూడా…?
డీసీ మాజీ ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌ కూడా ఆర్సీబీ కెప్టెన్ లిస్టులో ఉన్నాడట. వార్నర్‌కు ఐపీఎల్‌లో సుదీర్ఘకాలం కెప్టెన్సీ చేసిన ఎక్స్ పీరియన్స్ ఉంది. 2016లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను ఛాంపియన్‌గా నిలపడంలో అతనిదే కీలక పాత్ర. T20 ఫార్మాట్‌ను బాగా అర్థం చేసుకోగలడు. భారత ఆటగాళ్లతో వార్నర్ అనుబంధం బాగుంది. ఇన్నాళ్లు ఫామ్‌ లేమితో సతమతమవుతున్న డేవిడ్ భాయ్ కి చిన్నస్వామి స్టేడియం కంటే మెరుగైన మైదానం ఇంకేముంటుంది? అతను ఇక్కడ పరుగుల వరద పారిస్తాడని భావిస్తున్నారు. ఈ తరుణంలో విరాట్ తో కలిసి అద్భుతాలు చేస్తాడని భావిస్తున్నారు.

ఇవీ చదవండి: RCB: బ్యాటింగ్ కోచ్‌గా గుజరాత్ టైటాన్స్‌లోకి మాజీ RCB, CSK, MI స్టార్!
CSK vs RCB: చెపాక్‌లో సీఎస్కే బోణీ.. మొదటి మ్యాచ్‌ దేవుడికి ఇచ్చేయడం మా ఆనవాయితీ తలా..!
IPL Auction: ఐపీఎల్ ఆక్షన్.. షాక్ ఇచ్చిన ప్రీతి? పర్సులో ఎంత సొమ్ము ఉందో తెలుసా?
IPL 2025: రిటెన్షన్‌లో ఆ స్టార్ ప్లేయర్‌కు రూ.20 కోట్లు?
IPL 2025 Retention: ఆర్సీబీకి కేఎల్ రాహుల్ పునరాగమనం?

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు