Rohit Sharma Ritika: భారత కెప్టెన్ రోహిత్ శర్మ వారసుడు వచ్చాడు. అతని భార్య రితికా సజ్దే మగబిడ్డకు జన్మనిచ్చినట్లు రిపోర్టులు వచ్చాయి. ఈ వార్తను ప్రకటిస్తూ శుక్రవారం రాత్రి అభిమానులు పలు సోషల్ మీడియా వేదికల్లో సంబరాలు చేసుకున్నారు. (Rohit Sharma ritika)
అయితే, విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం, ఈ వార్త ఇప్పుడు ధృవీకరణ అయ్యింది. రోహిత్, రితిక దంపతులకు ఇప్పటికే కుమార్తె సమైరా మొదటి సంతానం. సమైరాకు డిసెంబర్ 30 నాటికి ఆరు సంవత్సరాలు నిండుతున్నాయి. అయితే, ఇప్పుడు కుమారుడు జన్మించిన కచ్చితమైన సమయం ఇంకా ప్రకటించలేదు. ఈ జంట త్వరలో ప్రకటన చేసి అభిమానులతో వార్తలను పంచుకునే అవకాశం ఉంది.
ఆస్ట్రేలియాతో జరగనున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టెస్టు కోసం రోహిత్ భారత జట్టుతో కలిసి పెర్త్‌కు వెళ్లలేదు. తొలి టెస్టుల్లో అతను సారథ్యం వహించగలడా లేదా అనే దానిపై చాలా ఊహాగానాలు వచ్చాయి. ఆస్ట్రేలియాతో జరగనున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లో తొలి టెస్టు నవంబర్ 22న పెర్త్‌లో ప్రారంభం కానుంది. విలేకరుల సమావేశంలో, భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ రోహిత్ గైర్హాజరీపై ఇంకా అధికారిక ధృవీకరణ లేదని పేర్కొన్నాడు.
“ప్రస్తుతం ఎటువంటి నిర్ధారణ లేదు. అతను అందుబాటులో ఉంటాడని ఆశిస్తున్నాను. మేము మీకు తెలియజేస్తాము,” అని గంభీర్ ప్రెస్‌తో అన్నారు. ఒకవేళ రోహిత్ తొలి మ్యాచ్‌కు దూరమైతే, వైస్ కెప్టెన్, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్ బాధ్యత స్వీకరిస్తాడని ప్రధాన కోచ్ పేర్కొన్నాడు.
కెప్టెన్సీ మాత్రమే కాదు, రోహిత్ లేకపోవడం జట్టులో కొత్త ఓపెనర్‌కు అవకాశం దొరుకుతుంది. ఆ పాత్ర గురించి గంభీర్ మాట్లాడుతూ, “రోహిత్ అందుబాటులో లేకుంటే, ఆస్ట్రేలియాలో మాకు అభిమన్యు ఈశ్వరన్, కేఎల్ రాహుల్ ఉన్నారు. మేము ఛాయిస్ తీసుకుంటాం.” అని పేర్కొన్నాడు.
ఇవీ చదవండి: Dhoni Rohit Sharma: హిట్ మ్యాన్‌పై మహీ పొగడ్తలు.. ఏమన్నాడంటే
Rohit Sharma: కివీస్‌తో టెస్తు సిరీస్.. హిట్ మ్యాన్‌కు ఎందుకు కీలకం అంటే..
Rohit sharma: ఫిట్ నెస్ పై రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు
Rohit Sharma: హిట్ మ్యాన్ వేలంలోకి వస్తే బాక్సులు బద్దలే!
