HomeInternationalNew Zealand MP: న్యూజిలాండ్ యువ ఎంపీ, 22 ఏళ్ల అమ్మడు.. మళ్లీ వైరలైపోయింది

New Zealand MP: న్యూజిలాండ్ యువ ఎంపీ, 22 ఏళ్ల అమ్మడు.. మళ్లీ వైరలైపోయింది

New Zealand MP: న్యూజిలాండ్ పార్లమెంటులో యువ ఎంపీ తీరు ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఆ దేశ పార్లమెంటులో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. దేశ ప్రభుత్వం పార్లమెంటులో (New Zealand Parliament) ప్రవేశ పెట్టిన ఓ బిల్లును వ్యతిరేకిస్తూ 22 ఏళ్ల అమ్మడు ఎంపీ హన-రాహితి ‘హక’ (MP Hana rahithi) వినూత్న రీతిలో నిరసన ప్రదర్శన చేసింది.

దీంతో ఈ దృశ్యాలు అందర్నీ ఆకర్షించాయి. నెట్టింట ఈ అమ్మడి వీడియో తెగ వైరల్ అవుతోంది. పార్లమెంట్లో బిల్లు పేపర్లను (Bill paper) చించేస్తూ యువ ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు.. సాంగ్ పాడుతూ ఆగ్రహం వ్యక్తం చేయడం ఆకర్షించేలా ఉంది. ఇందుకు సంబంధించిన సోషల్ మీడియాలో మరోసారి వైరల్ గా మారిపోయింది.

ఇక న్యూజిలాండ్‌లో అత్యంత పిన్న వయస్కురాలైన ఎంపీగా హన-రాహితి రికార్డ్ సృష్టించిన సంగతి తెలిసిందే. ఆమె పార్లమెంట్‌ సభ్యురాలిగా ఎన్నికైన తర్వాత తమ మావోరి కమ్యూనిటీ ఉన్న వివక్షను ప్రస్తావిస్తూ పార్లమెంట్‌లో గతంలో శివతాండవం చేసింది.ఆ వీడియో అప్పట్లో సంచలనం సృష్టించింది.

తమ జాతి కోసం యువ ఎంపీ పార్లమెంట్‌ లో చేసిన ప్రసంగం ప్రపంచాన్ని ఆకర్షించింది. గిరిజన సంప్రదాయ పద్దతిలో హక చేస్తూ నిరసన వ్యక్తం చేసింది. అయితే తాజాగా మరోసారి హన-రాహితి ఇలానే నిరసన తెలిపింది. పార్లమెంట్‌లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును చించి ఆగ్రహంతో పాట పాడుతూ నిరసన తెలిపింది. దీనికి తన సహచర ఎంపీలు కూడా సపోర్ట్ చేశారు. గ్యాలరీలో ఉన్నవారు కూడా ఆమెతో కలిసి గళం విప్పారు. పార్లమెంట్‌లో గందరగోళ పరిస్థితి నెలకొనడంతో ఆ దేశ స్పీకర్‌ సభను వాయిదా వేయాల్సి వచ్చింది.

ఇవీ చదవండి: Viral Video: పబ్లిసిటీ స్టంటా? లవ్ రెడ్డి విలన్‌పై థియేటర్లో చేయి చేసుకున్న మహిళ
Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం భారత్.. పాకిస్థాన్‌కు వెళ్లదు
Donald Trump: ఓడించిన చోటే జెండా పాతాడు.. రెండోసారి అగ్రపీఠంపై ట్రంప్
Olympics: 2036లో ఇండియాలో ఒలింపిక్స్?
Software Employees: రోజుకు 16 గంటల పని.. సాఫ్ట్ వేర్ పిల్లల నడుములు వంగిపోతున్నాయ్..

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు