HomeCinemaThe Raja Saab: ప్రభాస్ సినిమాలో ఐకానిక్ సాంగ్‌కి రీమేక్!

The Raja Saab: ప్రభాస్ సినిమాలో ఐకానిక్ సాంగ్‌కి రీమేక్!

The Raja Saab: ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్. రాబోయే చిత్రం ‘‘ది రాజా సాబ్‌’’కి సంబంధించిన కొత్త అప్‌డేట్‌ వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ తెలిపిన ప్రకారం, ఈ చిత్రంలో ఆరు ఎలక్ట్రిఫైయింగ్ సాంగ్స్ ఉన్నాయట. వాటిలో ఒకటి పాపులర్ ట్రాక్‌కి రీమేక్. (The Raja Saab)

జనవరిలో అన్ని ట్రాక్‌లను రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మారుతీ దాసరి దర్శకత్వం వహించిన ది రాజా సాబ్ చిత్రం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మితమవుతోంది. ఎస్ థమన్ ఒక ఈవెంట్‌లో వివరాలను పంచుకున్నారు.

“రాజా సాబ్‌లో ఒక రీమేక్ పాటతో సహా ఆరు పాటలు ఉంటాయి. కమర్షియల్ సినిమాకు తగ్గట్టుగానే సాంగ్స్ ఉంటాయి. జనవరిలో పాటలు విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం, ”అని ఎస్ థమన్ (Thaman S) చెప్పారు.

ఈ సంవత్సరం ప్రభాస్ 45వ పుట్టినరోజు సందర్భంగా, మేకర్స్ ఈ చిత్రం నుంచి ప్రత్యేక మోషన్ పోస్టర్‌ను ఎక్స్ లో ఆవిష్కరించారు. చిత్రంలో రెబల్ స్టార్ బ్లాక్ సూట్ ధరించి సింహాసనంపై కూర్చున్నాడు. పెప్పర్ సాల్ట్ జుట్టుతో ప్రభాస్ కనిపించి భయపెట్టాడు. నోట్లో సిగార్‌తో ప్రభాస్ కనిపించాడు. రాజా సాబ్ ఒక హారర్ కామెడీ అని సూచిస్తూ పోస్టర్‌లో “హారర్ ఈజ్ ది న్యూ కామెడీ” అని పేర్కొన్నారు.

గతంలో మారుతీ దాసరి ప్రభాస్‌తో (Prabhas) కలిసి పనిచేయడపై ఉత్సాహంగా ఉన్నానని తెలిపారు. అది తనకెంతో గౌరవంగా ఉంటుందన్నాడు. ఆయన మాట్లాడుతూ.. ”నా అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌లలో రాజా సాబ్‌ ఒకటి. ప్రభాస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి పనిచేయడం ఒక ఫిల్మ్ మేకర్‌గా నాకు గౌరవం, ఉత్తేజకరమైనది. మా ప్రేక్షకులకు గొప్ప భయానక అనుభవాన్ని అందించడానికి మేం సిద్ధంగా ఉన్నాం. ప్రభాస్‌ను బోర్డులో ఉంచడం చాలా ప్రత్యేకమైనది. మా హారర్ కథనంతో అతని ఎలక్ట్రిఫైయింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది.’’ అన్నారు.

రాజా సాబ్‌లో మాళవిక మోహనన్, సంజయ్ దత్, అనుపమ్ ఖేర్, వరలక్ష్మి శరత్‌కుమార్, యోగిబాబు, జిషు సేన్‌గుప్తా కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 10, 2025న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజై ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవీ చదవండి: Raja Saab: రాజా సాబ్ అప్ డేట్స్.. నిర్మాత ఏమన్నారంటే..
The Raja Saab: రాజా సాబ్ గ్లింప్స్.. డార్లింగ్ ప్రభాస్ లుక్ అదిరిందిగా..!
Kanguva Review: కంగువా మూవీ ట్విట్టర్ రివ్యూ.. ఎలా చేశారంటే
HBD Prabhas: 45 టర్న్ అయిన ప్రభాస్.. చిరు, రామ్ చరణ్ సహా ప్రముఖల గ్రీటింగ్స్

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు