HomeAndhra PradeshVolunteers: వాలంటీర్లపై మాట మారుస్తున్నది ఎవరు? అసలు ఉద్యోగాల్లో లేరా?

Volunteers: వాలంటీర్లపై మాట మారుస్తున్నది ఎవరు? అసలు ఉద్యోగాల్లో లేరా?

Volunteers: వాలంటీర్లను రద్దు చేయడానికి వాళ్లు అధికారికంగా లేరని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. గత ప్రభుత్వం వాళ్లను మోసం చేసి పెట్టుకుందన్న ఆయన.. అదే బాగా కన్ఫ్యూజ్ గా ఉందని వ్యాఖ్యానించారు. వాలంటీర్లకు (Volunteers) తమ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు జీతాలు పెంచుదామని చూస్తున్నప్పటికీ ఎక్కడా జీవోల్లో వారి గురించి ప్రస్తావన లేదన్నారు. వాలంటీర్లను వైసీపీ చాలా అన్యాయంగా మోసం చేసిందన్నారు. వాళ్లు ఉద్యోగాల్లో ఉంటే రద్దు చేయవచ్చన్నారు. రద్దులో ఉన్నారా లేదా కన్ఫ్యూజన్ గా ఉందన్నారు.

కూటమి పార్టీలు అధికారంలోకి రాక ముందు ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీలను ప్రజలు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. వాలంటీర్ల వ్యవస్థపై ఎన్నిసార్లు మాటలు మార్చారన్న దానిపై ఇప్పుడు చర్చ ఊపందుకుంది. గతంలో ఇదే పవన్ కల్యాణ్ వాలంటీర్లు హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. చంద్రబాబు అయితే, గోనె సంచులు మోసే ఉద్యోగాలని, ఇంట్లో మగవాళ్లు లేనప్పుడు వీళ్లు పోయి తలుపులు తడుతారంటూ కామెంట్స్ చేశారు.

మరోసారి వీళ్లే స్పందిస్తూ వాలంటీర్ల వ్యవస్థ మంచిదేనని, వైయస్సార్ సీపీకి అనుకూలంగా పని చేయకుండా తమ ప్రభుత్వం వచ్చాక ప్రజా సేవకు ఉపయోగిస్తామని వ్యాఖ్యానించారు. అలాగే, వాలంటీర్లు అందరూ చెడ్డవారని అనడం లేదని చెప్పారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి మేనిఫెస్టోలో సైతం వాలంటీర్ల గురించి ప్రస్తావిస్తూ వారి జీతాన్ని రూ.10 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చి 5 నెలలు కావస్తున్నా కూటమి సర్కార్ వాలంటీర్లను విధుల్లోకి తీసుకోకపోవడం గమనార్హం.

వాలంటీర్లు అధికారికంగా లేరన్న డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై మేధావులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేస్తూ అధికారికంగా ఉత్తర్వులిచ్చిన విషయాన్ని ఆధారాలతో సహా గుర్తు చేస్తున్నారు.

* 2019 జూన్ 22న రాష్ట్రంలోని ప్రతి 50 ఇళ్లకో గ్రామ వాలంటీర్‌ను నియమిస్తూ పంచాయతీరాజ్, రూరల్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ జీవో నంబర్ 104 విడుదల చేసింది.
* మరుసటి రోజే అంటే 2019 జూన్ 23న ప్రతి 100 ఇళ్లకో వార్డు వాలంటీర్‌ను నియమిస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ జీవో నంబర్ 201 విడుదల చేసింది.
* 2019 సెప్టెంబర్ 9న మళ్లీ ప్రతి 100 ఇళ్లకో వార్డు వాలంటీర్‌ను నియమిస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ జీవో నంబర్ 254 విడుదల చేసింది.

* 2019 అక్టోబర్ 25న రాష్ట్రంలోని పలు గ్రామాల్లో ప్రతి 50 ఇళ్లకో వాలంటీర్‌ను నియమిస్తూ పంచాయతీరాజ్, రూరల్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ జీవో నంబర్ 165 రిలీజ్ చేసింది.
* 2019 అక్టోబర్ 29వ తేదీన మరోసారి వార్డు వాలంటీర్లను నియమిస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ జీవో నంబర్ 279 విడుదల చేసింది.
* 2020 ఏప్రిల్ 4న డిపార్ట్‌మెంట్ ఆఫ్ గ్రామ వాలంటీర్లు/వార్డు వాలంటీర్లు, విలేజ్ సెక్రటరీలు/వార్డు సెక్రటరీల పేరుతో కొత్త శాఖలోకి వీరిని చేరుస్తూ సాధారణ పరిపాలన శాఖ జీవోఎంఎస్ నంబర్ 33ను విడుదల చేసింది.
* జగన్ సర్కారు ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల యాక్ట్ 2023ని ప్రవేశపెట్టింది. ఈ మేరకు 2024 ఏప్రిల్ 29న మరోసారి ఉత్తర్వులిస్తూ అప్ డేట్ చేసింది.

తాను చూస్తున్న పంచాయతీరాజ్ శాఖలో వచ్చిన జీవోలపై కూడా ఉపముఖ్యమంత్రి పవన్ కు అవగాహన లేకపోతే ఎలా అంటూ మేధావులు ప్రశ్నలు వేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాలు, పౌర సేవలు నాడు జగన్ మోహన్ రెడ్డి హయాంలో ప్రతి గడప వద్దకూ చేరాయని, పెన్షన్, రేషన్, సర్టిఫికెట్లు, ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ క్లినిక్ పేరుతో వైద్యం పౌరులకు చేరువ చేయడంలో వాలంటీర్లు కీలక పాత్ర పోషించారని మేధావులు గుర్తు చేస్తున్నారు. కరోనా సమయంలో చాలా మంది ప్రాణాలను కాపాడారని కొనియాడుతున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలోనూ వాలంటీర్లు భాగమయ్యేవారని గుర్తు చేస్తున్నారు. వాలంటీర్ల వ్యవస్థపై సందిగ్ధం నెలకొనడంతో ఇప్పుడు డోర్ డెలివరీ వ్యవస్థ లేకుండా పోయిందన్న వాదన వినిపిస్తోంది.

Read also: Chandrababu on Volunteers: వాలంటీర్ వ్యవస్థపై పూటకోమాట.. రూ.10 వేలిస్తామంటున్న చంద్రబాబును నమ్మేదెవరు?
Sajjala on CBN: వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు కుట్రపూరితంగా మాట్లాడుతున్నారు : సజ్జల రామకృష్ణారెడ్డి
Perni Nani: వాలంటీర్ల సేవల నిలిపివేతకు కుట్ర చేసింది బాబే: పేర్ని నాని
Volunteers Meeting: జన్మభూమి కమిటీలు, మన వాలంటీర్లు.. తేడా గమనించండి.. : సీఎం జగన్‌
Phirangipuram CM jagan: ప్రజలకు అలసిపోకుండా సేవ చేశాం.. నా వాలంటీర్ల సైన్యం అంటూ సీఎం జగన్‌ భావోద్వేగం

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు