Meal: అరిటాకులో భోజనం వడ్డించడం పలు హోటళ్లలో చూస్తుంటాం. అలాగే ఫంక్షన్లలోనూ అనేక కార్యక్రమాల్లోనూ అరటి ఆకులో భోజనం (Meal) వడ్డిస్తుంటారు. ఇలా అరిటాకులో ఆహారం తినడం వల్ల రుచి, వాసన పెరుగుతుంది. అరటి ఆకు వంటకు మనకు తెలియని సూక్ష్మమైన రుచిని కలిగిస్తుంది.
అరటి ఆకులలో కొన్ని యాంటీఆక్సిడెంట్ ప్రయోజనాలు ఉంటాయి. సహజ యాంటీమైక్రోబయల్ లక్షణాలు అరిటాకుల్లో ఉంటాయి. ఇవి ఆహారంలో ఉండే హానికరమైన బ్యాక్టీరియాను నాశనం చేసేందుకు దోహదం చేస్తాయి. అరటి ఆకులో తినే ఆహారం అనేక అనారోగ్యాలను దరి చేరకుండా చేస్తుంది.
ఆ సమస్య దూరం
అరిటాకుల్లో పాలీఫెనాల్స్, విటమిన్ ఏ, విటమిన్ సీ వంటి ముఖ్యమైన పోషకాలున్నాయి. అరటి ఆకుపై ఆహారాన్ని ఉంచినప్పుడు, ఈ పోషకాలలో కొన్ని ఫుడ్ లోకి బదిలీ అవుతాయి. దాని పోషక విలువను మెరుగుపరుస్తాయి. అరటి ఆకులు పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించకుండా సులభంగా భూమిలో కలిసిపోతాయి.
మిగిలిపోయిన ఆహారాన్ని అరటి ఆకులో చుట్టి నిల్వచేయటం వల్ల పాడవకుండా ఉంటుందని పెద్దలు చెబుతారు. అరటి ఆకులో తినడం జుట్టుకు కూడా మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అరటి ఆకుల్లో అప్పుడప్పుడూ భోజనం చేసేవారిలో తెల్ల జుట్టు సమస్య తగ్గుతుందంటున్నారు నిపుణులు.
కొన్ని సమస్యల నుంచి ఉపశమనం
అరటి ఆకుల్లో బోజనం చేయడం వల్ల జీర్ణశక్తి బాగుపడుతుంది. అరటి ఆకుల్లో యాంటీ బ్యాక్టిరియల్ లక్షణాలు ఉండటం వల్ల వీటిపై భోజనం చేస్తే ఎలాంటి క్రిములు ఆహారం ద్వారా మనకు సంక్రమించవు. ఈ నేపథ్యంలోనే పూర్వీకు లనుంచి అరిటాకుల్లో తినడం అలవాటైందని చెబుతున్నారు. అరటి ఆకు కాలిన గాయాల చికిత్సలో కూడా ఉపయోగిస్తారు. అరటి ఆకుపై అల్లం నూనెను చిలకరించి, శరీరం కాలిన భాగంలో పై నుంచి కిందికి చుట్టాలి. ఇది వేడి, వాపు నుంచి మంచి ఉపశమనం కలిగిస్తుంది. ఎందుకంటే అరటి ఆకుల్లో ఎపిగాల్లోకాటెచిన్ గాలెట్, ఇజిసిజి వంటి పాలీఫెనాల్స్ అధికంగా ఉంటాయి.
మొటిమలు, మచ్చలకు చికిత్స
అరిటాకులను క్రమం తప్పకుండా వినియోగించడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. రేచీకటి వంటి వ్యాధుల నుంచి రక్షించుకోవచ్చు. అరటి ఆకుల్లో ఆహారం తీసుకోవడం వల్ల చర్మానికి మంచిది. సాధారణంగా చర్మంపై అల్సర్లు, మొటిమలు, మచ్చలు ఉండే వారు అరిటాకుల్లో తింటే తగ్గుతాయి. అరటి ఆకుపై కొబ్బరి నూనె రాసి దీన్ని చర్మానికి అప్లై చేయడం వల్ల ఇలాంటి సమస్యల నుంచి త్వరితగతిన ఉపశమనం దొరుకుతంది.
ఇవీ చదవండి: Tea: భోజనం తినడానికి ముందు, ఆ తర్వాత టీ తాగుతున్నారా?
Meals Plan: మధ్యాహ్నం ఎలాంటి భోజనం తినాలి? పోషకాహారం అందాలంటే ఇలా చేయండి
Betel Leaves: భోజనం తిన్నాక తాంబూలం వేసుకోవచ్చా?
Mediterranean food: మధ్యస్త ఆహారం.. ఏం తినాలి? ఎలా ప్రారంభించాలి?
Sleep: ఏ వయసు వారికి ఎంత నిద్ర ఉండాలో తెలుసా?
