NTR Statue: అట్లాంటా సమీపంలోని కుమ్మింగ్‌లో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ (NTR Statue) విగ్రహాన్ని ఏపీ మంత్రి నారా లోకేష్ ఆవిష్కరించారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన.. పలువురు ప్రముఖులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానిస్తున్నారు.
అట్లాంటా వెళ్లిన లోకేష్ కు ఈ సందర్భంగా హెలికాప్టర్ పై నుంచి పూలవర్షం కురిపించి ఎన్ఆర్ఐ టీడీపీ కార్యకర్తలు అభిమానం చాటుకున్నారు. సభలో లోకేష్ మాట్లాడుతూ.. “ప్రపంచవ్యాప్తంగా తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ ఆశయ సాధనకు తెలుగుదేశం పార్టీ కృషి చేస్తోంది. గత ప్రభుత్వంలో చేయని తప్పునకు బాబుగారిని జైలులో బంధించారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారంతా… ఎన్ఆర్ఐలతో సహా రోడ్డెక్కి ఆందోళనలు చేశారు. ఆ సమయంలో మీరు ఇచ్చిన మద్దతు మాకు కొండంత బలాన్నిచ్చింది.
వారం రోజుల అమెరికా పర్యటనలో రాష్ట్రాన్ని ప్రమోట్ చెయ్యడానికి అవిశ్రాంతంగా ఇన్వెస్టర్స్ ని కలిసాను. కానీ ఈ రోజు మిమ్మల్ని చూసిన తరువాత నాకు కిక్ వచ్చింది. అందరూ మిమ్మల్ని ఎన్.ఆర్.ఐ లు అంటారు, కానీ నేను మాత్రం ఎప్పుడూ మిమ్మల్ని ఎం.ఆర్.ఐ. అంటాను. ఎం.ఆర్.ఐ అంటే మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్. మీ జోష్, ఎనర్జీ చూస్తుంటే నేను అట్లాంటాలో ఉన్నానా, అమలాపురంలో ఉన్నానా అనే డౌట్ వస్తోంది. మీరు దేశాన్ని, రాష్ట్రాన్ని ప్రేమిస్తారు. ఇటీవల ఎన్నికల్లో కూటమి ఘన విజయానికి మీ కృషి మరువలేనిది. ఎన్ఆర్ఐలు కూడా సైకో జగన్ బాధితులే.
రెడ్ బుక్‌లో ఒక చాప్టర్ అయిపోయింది, రెండోది ఓపెన్ అయింది, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సహకారంతో త్వరలో మూడో చాప్టర్ తెరవబోతున్నా. అతి పెద్ద వ్యవస్థలో కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి, మా దృష్టికి తెస్తే సరిచేసుకుంటాం. మీకు ఉన్న సమస్యలు కొన్ని నా దృష్టికి తీసుకొచ్చారు. వాటిని వీలైనంత త్వరగా పరిష్కరిస్తా. తెలుగువారు ప్రపంచాన్ని శాసించేస్థాయికి ఎదగాలన్నది బాబుగారి ఆశయం. ఎన్ఆర్ఐలు ఎపిలో పెట్టుబడి పెట్టండి, మీకు అండగా నిలిచే బాధ్యత నాది. అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెడ్ల బండిలా ముందుకు తీసుకెళ్తాం.” అని లోకేష్ తెలిపారు.
ఇవీ చదవండి: Nara Lokesh with Satya Nadella: సత్య నాదెళ్లతో నారా లోకేష్ భేటీ.. ఏం మాట్లాడారంటే
Nara Lokesh in USA: ఏవియేషన్, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో పెట్టుబడుల ఆహ్వానం
Nara Lokesh: ఏఐ చాన్సుల వినియోగం.. వేగంగా ఏపీ అభివృద్ధి
Nara Lokesh: వైకాపా వాళ్లు నన్ను చూసి ఇన్‌స్పైర్ అవుతున్నారు: లోకేష్
