Lokesh Red Book: రెడ్ బుక్ లో రెండు చాప్టర్లు ఓపెన్ అయ్యాయని, మూడోది త్వరలోనే ఓపెన్ చేస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన.. ఇవాళ ఎన్ఆర్ఐ టీడీపీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా రెడ్ బుక్ (Lokesh Red Book) గురించి లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. లోకేష్ ఏమన్నారంటే..
‘‘రెడ్ బుక్ లో ఒక చాప్టర్ ఓపెన్ అయింది, రెండోది ఓపెన్ అయింది, మూడో చాప్టర్ గురించి రాము, వెంకట్రావుని అడగండి. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు త్వరలో మూడో చాప్టర్ తెరవబోతున్నా. చట్టాన్ని ఉల్లంఘించి ప్రవర్తించిన ప్రతి ఒక్కరికీ, చట్ట ప్రకారం ట్రీట్మెంట్ ఉంటుంది.
మన వాళ్ళు అందరూ మంచి పని చేస్తే బాగా పొగుడుతారు. ఏదైనా చిన్న తప్పు కనిపిస్తే, ఉతికి ఆరేస్తారు. మేం కూడా మనుషులమే. విశాలమైన వ్యవస్థలో కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి, అంతమాత్రాన అలగవద్దు. మా దృష్టికి తెస్తే సరిచేసుకుంటాం. మీకు ఉన్న సమస్యలు కొన్ని నా దృష్టికి తీసుకొచ్చారు. వాటిని వీలైనంత త్వరగా పరిష్కరిస్తా.
ఎన్నికల్లో ప్రజలే వారి కుర్చీలు మడతపెట్టారు. బాబు గారు తలుచుకుంటే వాళ్లను లోపల వేయడం 2 నిమిషాల పని. చేయని తప్పుకు 53 రోజులు జైలుశిక్ష అనుభవించిన ఆయనకు బాధ ఉండదా ? ప్రజలు మనకు అఖండ విజయాన్ని ఇచ్చినందుకు హుందాతనంగా, గౌరవంగా ఉండి ప్రజల కోసం పనిచేయాలి. గాడి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాల్సిన గురుతర బాధ్యత మాపై ఉంది. పద్ధతి ప్రకారం రెడ్ బుక్ కూడా అమలుచేస్తాం. అది నాకు వదిలేయండి.
ఇటీవల ఎన్నికల సమయంలో 2 లక్షలు ఖర్చుపెట్టి టిక్కెట్ కొనుక్కొని వచ్చి మరీ ఓటేశారు. కొందరు ఏడాదిపాటు ఎపిలోనే ఉండి సేవలందించారు. ఎన్నికల్లో 175కి 175 అన్నవారి ముఖాలు మాడిమసైపోయాయి. ప్రపంచంలో ఉన్న తెలువారందరిదీ ఈ గెలుపు.
అందరూ మిమ్మల్ని ఎన్.ఆర్.ఐ లు అంటారు, కానీ నేను మాత్రం ఎప్పుడూ మిమ్మల్ని ఎం.ఆర్.ఐ లు అనే అనుకుంటా. ఎం.ఆర్.ఐ అంటే మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్. మీ జోష్, ఎనర్జీ చూస్తుంటే నేను అట్లాంటాలో ఉన్నానా, అమలాపురంలో ఉన్నానా అనే డౌట్ వస్తోంది. మీరు దేశాన్ని, రాష్ట్రాన్ని ప్రేమిస్తారు. అమెరికాలో ఉన్నా మీ మనసంతా రాష్ట్రం వైపే ఉంటుంది. రాష్ట్రం బాగుండాలి, అభివృద్ధి చెందాలి అని కోరుకుంటారు. అందుకే మీరు మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్. సంపాదించిన రూపాయిలో 10పైసలు సొంతగడ్డకు ఖర్చు.’’ అని లోకేష్ కామెంట్స్ చేశారు.
ఇవీ చదవండి: Nara Lokesh with Satya Nadella: సత్య నాదెళ్లతో నారా లోకేష్ భేటీ.. ఏం మాట్లాడారంటే
NTR Statue: అట్లాంటాలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ
Nara Lokesh in USA: ఏవియేషన్, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో పెట్టుబడుల ఆహ్వానం
Nara Lokesh: ఏఐ చాన్సుల వినియోగం.. వేగంగా ఏపీ అభివృద్ధి
Nara Lokesh: 43వ రోజు ప్రజా దర్బార్.. మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
