IPL Auction: మెగా ఈవెంట్ ఐపీఎల్ వేలం (IPL Auction) ఈనెలాఖరులోగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో గురువారం అక్టోబర్ 31 నాటికి అన్ని జట్లూ తాము రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల వివరాలను వెల్లడించాయి. అయితే ఈ రిటెన్షన్లో అన్ని జట్లతో పొల్చితే పంజాబ్ కింగ్స్ రిటెన్షన్ లిస్టు అందర్ని ఆశ్చర్యానికి గురిచేస్తూ కేవలం ఇద్దరు ఆటగాళ్లను మాత్రమే అట్టిపెట్టుకోవడం గమనార్హం.
పంజాబ్ జట్టు రిటైన్ చేసుకున్న వాళ్లు కూడా అన్‌క్యాప్డ్ ప్లేయర్లే కావడం మరో విచిత్రం. దీంతో ఆ జట్ట వద్ద పర్సులో ఎక్కువ అమౌంట్ ఉంది. అయితే పంజాబ్ కింగ్స్ ఐపీఎల్‌లో ఇప్పటిదాకా ఒక్క ట్రోఫీ కూడా దక్కించుకోలేదు. ప్రతీ సీజన్‌లో మ్యాచ్‌లు ఓడిపోవడం పాయింట్ల పట్టికలో చివరి స్థానాల్లో ఉండడంతో సరిపెడుతున్న పంజాబ్.. ఈసారి ఎలాంటి స్ట్రాటజీ ఉపయోగిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
కానీ ఈసారి పంజాబ్ కింగ్స్ రూట్ మార్చినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2025 సీజన్‌కు ప్రణాళికతో రిటెన్షన్ లిస్ట్ రిలీజ్ చేసింది. ఇందులో శశాంక్ సింగ్ రూ.5.5 కోట్లు, ప్రభుసిమ్రాన్ సింగ్ రూ.4 కోట్లుతో రిటైన్ లిస్టులో ఉన్నారు. పంజాబ్ కొత్త హెడ్ కోచ్‌గా వచ్చిన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్‌తో ప్రీతిజింటా సీరియస్ గా చర్చించినట్లు సమాచారం. టీమ్ ను పూర్తిగా ప్రక్షాళన చేయాలని నడుం బిగించిందట. పంజాబ్ వద్ద పర్సులో రూ.110.5 కోట్లు అమౌంట్ మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ఎవరిని కొని జట్టును ముందుకు నడిపిస్తారన్న దానిపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. సోషల్ మీడియాలో అప్పుడే నెటిజన్లు పలు రకాలకామెంట్లు పెడుతున్నారు. సరదా సరదాకే ఆమె అందర్నీ కొనేస్తుందని చెబుతారు.. ఇంక ముందుంది మెగా వేలం.. చూసుకో మళ్ళా..! అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
ఐపీఎల్ జట్ల పర్సు అమౌంట్ ఇలా ఉంది..
* పంజాబ్ కింగ్స్ – రూ. 110.5 కోట్లు
* రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – రూ. 83 కోట్లు
* ఢిల్లీ క్యాపిటల్స్ – రూ. 73 కోటి
* గుజరాత్ టైటాన్స్ – రూ. 69 కోట్లు
* లక్నో సూపర్ జెయింట్స్ – రూ. 69 కోట్లు
* చెన్నై సూపర్ కింగ్స్ – రూ. 55 కోట్లు
* కోల్ కతా నైట్ రైడర్స్ – రూ. 51 కోట్లు
* ముంబై ఇండియన్స్ – రూ. 45 కోట్లు
* సన్ రైజర్స్ హైదరాబాద్ – రూ. 45 కోట్లు
* రాజస్థాన్ రాయల్స్ – రూ. 41 కోట్లు
Read also: IPL 2025: రిటెన్షన్‌లో ఆ స్టార్ ప్లేయర్‌కు రూ.20 కోట్లు?
IPL 2025 Retention: ఆర్సీబీకి కేఎల్ రాహుల్ పునరాగమనం?
Indian Premier League: ఐపీఎల్ 2025 రిటెన్షన్ ఫైనల్ లిస్టు ఇదే
IPL: టీమిండియా క్రికెటర్లకు మరో గుడ్ న్యూస్..
IPL Final 2023: తిరుగులేని మహేంద్రుడు.. ఐదో టైటిల్ విశేషాలు ఇవే..
