Jacqueliene Fernandez: బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు చాలా మంది అగ్ర హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ అందుకుంటూ దూసుకెళ్తున్నారు. కెరీర్ మంచి పీక్ లో ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకుంటున్నారు. స్టార్ హీరోయిన్లుగా రాణించడంతో పాటు తమ నటనతో సత్తా చాటుతున్నారు. ఇందులో భాగంగా ఆస్తిపాస్తులు బాగా కూడబెట్టుకుంటున్నారు. ఖరీదైన విల్లాలు, ప్లాట్స్, కాస్ట్ లీ కార్లు కొనుగోలు చేస్తున్నారు. తాజాగా ఓ భామ ఐల్యాండ్ నే (Jacqueliene Fernandez) కొనేసిందట.

బాలీవుడ్ తారలు చాలా మంది కీర్తి, డబ్బు, లగ్జరీ లైఫ్ కోసం చాలా కష్టపడుతుంటారు. కోట్లాది రూపాయల బ్యాంకు బ్యాలెన్స్‌లు, విలాసవంతమైన లైఫ్ స్టైల్, ఫ్యాషన్ గా ఉండాలని ప్రతి హీరోయిన్ కాంక్షిస్తుంది. యాడ్స్, బిజినెస్‌లు, మూవీల ద్వారా కోట్లు సంపాదిస్తున్న కథానాయికలు అదే స్థాయిలో ఖర్చు కూడాచేస్తుంటారు.

బాగా ఆర్జించిన డబ్బుతో ఒక్కొక్కరు ఒక్కోలా ఖర్చు పెడుతుంటారు. చాలా మంది ఇప్పటికే భారతదేశంలో, విదేశాలలో లగ్జరీ కార్లు, బంగ్లాలను కొన్నారు. శ్రీలంకలో పుట్టి, బాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన జాక్వెలిజ్ ఫెర్నాండెజ్.. ఏకంగా శ్రీలంకలో ఓ దీవిని సొంతం చేసుకుందట.

ఐ ల్యాండ్ ను కొనుగోలు చేసిందన్న వార్త వినగానే.. మన స్టార్లు దీపికా పదుకొనే, ఐశ్వర్యరాయ్, కత్రినా కైఫ్, ఆలియా భట్ లలో ఒకరు ఉంటారని చాలా మంది అనుకుంటారు. కానీ ఊహించని విధంగా జాక్వెలిన్ వార్తల్లోకెక్కింది.

ఈ ముద్దుగుమ్మ ఓ దీవిని కొనేసింది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తండ్రి శ్రీలంక, తల్లి మలేషియాకు చెందిన వారు. 2012లో, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ శ్రీలంకలో రూ.3.5 కోట్ల విలువైన ప్రైవేట్ ఐలాండ్‌ను కొనిందని సమాచారం. ఈ నాలుగు ఎకరాల ద్వీపం శ్రీలంక దక్షిణ తీరంలో ఉంటుందట.

శ్రీలంక క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కుమార సంగక్కరకు చెందిన ప్రైవేట్ ద్వీపానికి సమీపంలో ఇది ఉందట. ఇక్కడ విల్లా నిర్మించాలనేది జాక్వెలిన్ స్వప్నం అని సమాచారం. ముంబైలో జాక్వెలిన్‌కు 5 బీహెచ్‌కే అపార్ట్‌మెంట్ కూడా ఉందని బాలీవుడ్ లో గుస గుసలు వినిపిస్తున్నాయి. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ 2009లో అల్లాదీన్ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. హౌస్‌ఫుల్, మర్డర్ 2, కిక్, రేస్ 2తో సహా 30కి పైగా చిత్రాల్లో నటించి రాణించింది. డ్రగ్స్ కేసులోనూ వార్తల్లో నిలిచింది.
ఇవీ చదవండి: Rakul preet: న్యూ లుక్‌లో రకుల్ ప్రీత్ సింగ్.. ఫొటో గ్యాలరీ
Zarashatavari: హీరోయిన్లూ అసూయ పడే అందం.. ఏఐ భామ హాట్ ఫొటోలు
Mrunal Thakur hot: బాత్ టబ్బులో మృణాల్ హాట్ పోజులు.. విషయం అదా?
Shriya Kontham: అందాలతో మతి పోగొడుతున్న బ్యూటీ.. శ్రియా కొణతం ఫొటోలు
Kavya Thapar: టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. గ్లామర్ షో.. సోషల్ మీడియాలో హాట్ ఫొటోలు వైరల్
