Pulivendula: మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పులివెందులలో పర్యటిస్తున్నారు. పులివెందులలోని (Pulivendula) భాకరాపురంలో ఉన్న క్యాంపు కార్యాలయంలో వైయస్ జగన్… కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయ్యారు.
అందరినీ పేరుపేరునా పలకరించి వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, మాజీ నేతలతో కూడా చర్చించారు. కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్యపడవద్దు, పార్టీ అండగా ఉంటుందని, అందరం కలిసి కట్టుగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని వివరించారు. రానున్న రోజుల్లో ప్రతీ కార్యకర్తకు తనతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుందని వైయస్ జగన్ భరోసానిచ్చారు.
ఈ సందర్భంగా పులివెందులలోని క్యాంపు కార్యాలయం కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, ప్రజలతో కిక్కిరిసిపోయింది. కష్టకాలంలో పార్టీ కార్యకర్తలకు నేతలు అండగా నిలబడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు వైయస్ జగన్ సూచించారు.
అంతకుముందు పులివెందులలో దారిపొడవునా తన కోసం ఎదురుచూస్తున్న కార్యకర్తలు, అభిమానులు, ప్రజలకు అభివాదం చేస్తూ, ఆగి పలకరిస్తూ, వారి వినతులు స్వీకరిస్తూ క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు.

ఇవీ చదవండి: Jagan and Sharmila: కుటుంబ తగాదాలు రాజకీయం చేయొద్దు
YS Jagan Clarity: ఫ్యామిలీ ఆస్తుల గొడవపై స్పష్టత ఇచ్చిన జగన్!
CBN on Jagan Family issue: జగన్ ఫ్యామిలీ ఇష్యూపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Jagan in Gurla: ఘర్ ఘర్ కీ కహానీలే.. ఆస్తుల వివాదంపై జగన్ హాట్ కామెంట్స్!
YS Jagan bail: జగన్ బెయిల్ రద్దు ప్రమాదం!
Jagan vs Sharmila: జగన్ వర్సెస్ షర్మిల.. ఆస్తుల గొడవల్లో అసలేం జరిగింది?
Jagan on Badvel murder: మహిళలకు, బాలికలకు రక్షణ కూడా ఇవ్వలేకపోతున్నారు.. ఇదేమి రాజ్యం?
Jagan Press Meet: మారిన జగన్.. ఇకపై రెగ్యులర్ గా ప్రెస్ మీట్లు? సర్కారుపై ఏమన్నారంటే..
Jagan: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు తప్పవు.. నన్ను 16 నెలలు జైల్లో పెట్టారు
YS Jagan on Mopidevi: మోపిదేవి పార్టీ వీడటంపై జగన్ కీలక వ్యాఖ్యలు
