HomeAndhra PradeshGuntur Crime: దాష్టీకానికి మరో అమ్మాయి బలి... తెనాలి యువతి కన్నుమూత

Guntur Crime: దాష్టీకానికి మరో అమ్మాయి బలి… తెనాలి యువతి కన్నుమూత

Guntur Crime: గుంటూరు జిల్లా తెనాలిలో టీడీపీ కార్యకర్త రాగి నవీన్ చేతిలో దాష్టీకానికి (Guntur Crime) గురై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన యువతి.. చనిపోయింది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న యువతి ఈరోజు కన్నుమూసింది. తెలుగుదేశం రౌడీషీటర్ నవీన్ ఆ యువతి తలను డాష్ బోర్డు కు గట్టిగా గుద్దటంతో బ్రెయిన్ డెడ్ అయినట్లు తెలుస్తోంది.

మూడు రోజుల నుంచి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై యువతికి డాక్టర్లు వైద్యం అందించారు. ఈరోజు ఆమె తుది శ్వాస విడిచింది. యువతిపై దాడి కేసులో తెలుగుదేశం పార్టీ రౌడీషీటర్ నవీన్ ను పోలీసులు అరెస్టు చేశారు. తెనాలి టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో రౌడీ షీటర్ నవీన్ ను మీడియా ముందు పోలీసులు ప్రవేశపెట్టారు.

ఈ సందర్భంగా తెనాలి డీఎస్పీ జనార్దన్ రావు మాట్లాడారు. యువతితో రౌడీ షీటర్ నవీన్ కు ఆరేళ్లుగా పరిచయం ఉందన్నారు. వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారని తెలిపారు. పెద్దవాళ్లు వారి పెళ్లిని వ్యతిరేకించారని, సహన రౌడీ షీటర్ నవీన్ కు మూడు లక్షల రూపాయల డబ్బులు ఇచ్చిందని వెల్లడించారు.

ఈ డబ్బుల్లో రూ.1,50,000 నగదును నవీన్ సహనకు తిరిగి ఇచ్చేశాడని తెలిపారు. సహన మిగిలిన డబ్బు అడిగిందని, దీంతో కోపంతో సహనను కారు డాష్ బోర్డుకి వేసి గట్టిగా కొట్టాడని తెలిపారు. తనకు తలనొప్పిగా ఉందని, వెంటనే ఆస్పత్రికి తీసుకు వెళ్లాలని సహన స్పృహ కోల్పోయే ముందు నిందితుడితో చెప్పిందని తెలిపారు.

ఇవీ చదవండి: Tenali Crime News: తెనాలిలో బాధిత యువతి పరిస్థితి విషమం
Andhra Political News: యాసిడ్‌ బాధితురాలికీ పరిహారం ఇవ్వని చంద్రబాబు
Pawan in Vizianagaram: గుర్లలో చనిపోయిన ప్రతి ఒక్క కుటుంబానికీ రూ.1లక్ష
AP Crime News: కాశీబుగ్గలో ఇద్దరు బాలికలపై అత్యాచారం!
AP Crime News: బద్వేలులో విద్యార్థినిపై అఘాయిత్యం అనాగరిక చర్య
AP Politics: గాడి తప్పిన పరిపాలన.. మహిళలు, బాలికలకు రక్షణ కరువు

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు