HomeAndhra PradeshKurnool: కర్నూలులో బార్ అసోసియేషన్ వద్ద న్యాయవాదుల నిరసన

Kurnool: కర్నూలులో బార్ అసోసియేషన్ వద్ద న్యాయవాదుల నిరసన

Kurnool: కర్నూలు జిల్లా కోర్టు లోని న్యాయవాదుల బార్ అసోసియేషన్ కార్యాలయం వద్ద న్యాయవాదులు కూటమి ప్రభుత్వం పై నిరసన తెలిపారు. చంద్రబాబు కర్నూలు లో (Kurnool) హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని, నారా లోకేష్ మాత్రం ఉత్తరాంధ్ర ప్రాంతం లో బెంచ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని వారు గుర్తు చేస్తున్నారు.

కూటమి నాయకుల మధ్య స్పష్టత లేదని న్యాయవాదులు మండిపడ్డారు. కర్నూలు కు హైకోర్టు బెంచ్ రావాల్సి ఉందన్నారు. శ్రీ బాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలు లో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. శ్రీ బాగ్ ఒప్పందాన్ని కూటమి ప్రభుత్వం తుంగలో తొక్కి ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని న్యాయవాదులు ఆవేదన వ్యక్తం చేశారు.

కర్నూలు లో హైకోర్ట్ ను ఏర్పాటు చెయ్యాలని, లేదంటే ప్రత్యేక రాయలసీమ రాష్ట్రంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్స్ తీరేదాకా ఉద్యమించడానికి సిద్దంగా ఉన్నామని న్యాయవాదులు ఈ సందర్భంగా వెల్లడించారు.

గత ప్రభుత్వంలో మూడు రాజధానులంటూ వైయస్ జగన్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కర్నూలులో న్యాయ విశ్వవిద్యాలయం, హైకోర్టు ఏర్పాటు చేయాలని సంకల్పించారు. అమరావతిలో శాసన రాజధాని కొనసాగుతుందని, విశాఖపట్నం పరిపాలన రాజధానిగా చేస్తామని నాటి సీఎం వైయస్ జగన్ చెబుతూ వచ్చారు. అయితే, ఎన్నికల ఫలితాల అనంతరం ఆ ప్రక్రియ ముగిసిపోయింది. అమరావతే ఏకైక రాజధాని అని సీఎం చంద్రబాబు ప్రకటించారు. బీజేపీ, జనసేన పార్టీలు సైతం ఇదే స్టాండ్ పై ఉన్నాయి. తాజాగా కర్నూలుకు కేటాయించిన లా యూనివర్సిటీని అమరావతికి తరలిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే కర్నూలులో న్యాయవాదులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాల్సిందేనని, న్యాయ విశ్వవిద్యాలయాన్ని ఇక్కడే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇవీ చదవండి: Heart care: గుండె ఆరోగ్యానికి ఎలాంటి యోగా ఆసనాలు చేయాలి?
Andhra Pradesh: సీమపై ఎందుకీ కక్ష? లా యూనివర్సిటీ, కొప్పర్తి అమరావతికి షిఫ్టింగ్! 
Law University Kurnool: నేషనల్ లా యూనివర్సిటీకి శంకుస్థాపన.. న్యాయ రాజధానికి మరో మకుటం!
Healthy Village: శ్రీపద్మావతి మహిళా యూనివర్సిటీలో హెల్తీ విలేజ్‌పై జాతీయ వర్క్‌షాప్‌

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు