HomeAndhra PradeshVizianagaram Crime: గుర్లలో డయేరియా మృతులు ఎంతమంది? ప్రభుత్వం ఏమందంటే..

Vizianagaram Crime: గుర్లలో డయేరియా మృతులు ఎంతమంది? ప్రభుత్వం ఏమందంటే..

Vizianagaram Crime: విజయనగరం జిల్లా గుర్లలో డయేరియా వ్యాప్తి చెందిన హడలెత్తిస్తోంది. ఇప్పటి వరకు 12 మంది చనిపోయారని వార్తలు వస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించి నిన్న 8 బెడ్లు ఏర్పాటు చేసింది. (Vizianagaram Crime) ప్రస్తుత పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేశారు. సీనియర్ ఐఏఎస్ విజయానంద్ తో విచారణకు ఆదేశించారు. డయేరియా బాధితులను వైద్య శాఖ ఉన్నతాధికారులు పరామర్శించారు. ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించి బాధితులను కలుసుకుని మాట్లాడారు.

అయితే, జిల్లాలో డయేరియా మరణాలపై ప్రభుత్వ అధికారులు, మంత్రులు ఒకలా, ముఖ్యమంత్రి చంద్రబాబు మరోలా స్టేట్ మెంట్లు ఇవ్వడం చర్చనీయాంశమైంది.

తొలుత గుర్లలో డయేరియా మరణాలే లేవంటూ ప్రభుత్వం కొట్టిపారేసే ప్రయత్నం చేసింది. వారం రోజుల తర్వాత డయేరియా అదుపులోకి వచ్చిందని నిన్న ప్రకటించింది. తాజాగా సీఎం చంద్రబాబుకు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు నివేదిక ఇచ్చారు. డయేరియాపై వివిధ రకాల వార్తలు వస్తున్నాయని కృష్ణబాబు అన్నారు. డయేరియాతో ఒకరే చనిపోయారని, ఏడుగురు వివిధ వ్యాధులతో మరణించారన్నారు.

అయితే, విజయనగరం జిల్లలో డయేరియా వ్యాప్తిపై సీఎం చంద్రబాబు మరోలా స్టేట్ మెంట్ ఇచ్చారు. అతిసారంతో 8 మంది చనిపోయిన ఘటనపై సమీక్షించిన సీఎం.. గుర్లలో పరిస్థితిని, బాధిత ప్రజలకు అందుతున్న వైద్య సాయాన్ని అధికారుల ద్వారా తెలుసుకున్నారని సీఎంవో వర్గాలు ప్రకటన చేశాయి.

ఇలా ప్రజలు కష్టాల్లో ఉంటే గందరగోళానికి గురి చేసేలా ప్రభుత్వ వర్గాలు ఒకలా, ముఖ్యమంత్రి మరోలా స్టేట్ మెంట్లు ఇస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

విజయనగరంలో డయేరియాపై మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అతిసార ప్రబలుతుంటే ప్రభుత్వం మొద్దునిద్రపోతోందంటూ ఆయన ఆరోపించారు. తక్షణమే వైద్య సదుపాయాలు మెరుగుపర్చి డయేరియా మరణాలను ఆపాలని ఆయన కోరారు. మీడియాలోనూ వరుస కథనాలు రావడంతో ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించి బెడ్లు ఏర్పాటు చేసింది. చికిత్సకు చర్యలు తీసుకుంది.

ఇవీ చదవండి: Diarrhea Vizianagaram: డయేరియా మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించాలి
Vizianagaram: ఆ మరణాలపై సీనియర్ ఐఎఎస్ అధికారి చేత విచారణ
Botcha Satyanarayana: ఆ 25 వర్గాలకు చంద్రబాబు ఇబ్బంది పెడుతున్నారా?
Badvel Crime: విద్యార్థిని హత్య నేపథ్యంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
AP Crime News: బద్వేలులో విద్యార్థినిపై అఘాయిత్యం అనాగరిక చర్య

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు