HomeAndhra PradeshAnakapalli: ఉచిత ఇసుక ఇవ్వాల్సిందే.. నర్సీపట్నంలో ధర్నా

Anakapalli: ఉచిత ఇసుక ఇవ్వాల్సిందే.. నర్సీపట్నంలో ధర్నా

Anakapalli: కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇసుక ఉచితంగా ఇవ్వాల్సిందేనని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. వైయస్సార్ సీపీ ఈ మేరకు నిరసనలకు దిగింది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో (Anakapalli) మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఉచిత ఇసుక ప్రభుత్వం ఇవ్వాల్సిందేనని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని నేతలు డిమాండ్ చేశారు.

వైయస్సార్‌సీపీ ప్రభుత్వంలో నర్సీపట్నం ఇసుక యార్డ్ లో నిల్వచేసిన వేల టన్నుల ఇసుకను, లబ్ధిదారులకు ఉచితంగా ఇవ్వాలని వారి నుండి ఎటువంటి రుసుము తీసుకోకూడదని డిమాండ్ చేశారు.

ఉచిత ఇసుక ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నర్సీపట్నం అబిడ్ సెంటర్ నుంచి ఆర్టీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డిఓకు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరైన నిరసన తెలియజేశారు.

ఇసుక ఉచితం అని చెప్పి… నర్సీపట్నంలో టన్ను ఇసుకకు రూ.1,165 వసూలు చేస్తున్నారని ఉమాశంకర్ గణేష్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సీబీఎన్ ట్యాక్సా లేక అయ్యన్నపాత్రుడి ట్యాక్సా సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. సూపర్ సిక్స్ పేరుతో ఇచ్చిన హామీల అమల్లో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు.

ఇవీ చదవండి: AP Free Sand: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. గత ప్రభుత్వ ఆదేశాలను కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ
Free Sand: ఏపీలో ఉచిత ఇసుకపై దుమారం.. టన్ను కేవలం రూ.1,394 మాత్రమే!
AP Crime News: బద్వేలులో విద్యార్థినిపై అఘాయిత్యం అనాగరిక చర్య
Chandrababu: నేను హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తే చాలా మంది విమర్శించారు
AP Political News: ఇసుక మొత్తం దోచుకున్నాక సీనరేజ్‌ రద్దా?
Margani Bharat on CBN: లిక్కర్, ఇసుక ఆదాయం మొత్తం కూటమి నాయకుల జేబుల్లోకే
Andhra Crime: ఇప్పటికైనా దిశ చట్టాన్ని అమలు చేయాలి
Jagan on Badvel murder: మహిళలకు, బాలికలకు రక్షణ కూడా ఇవ్వలేకపోతున్నారు.. ఇదేమి రాజ్యం?

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు