Nora Fatehi: మట్కా (Matka) చిత్రం వచ్చే నెల 14న రిలీజ్ కాబోతోంది. వరుణ్‌తేజ్ (Varun Tej) హీరోగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. నోరా ఫతేహి (Nora Fatehi) మీనాక్షి చౌదరి (Meenakshi Choudary) హీరోయిన్లుగా నటిస్తున్నారు. కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.
విజేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పబ్లిసిటీ కార్యక్రమాల్లో భాగంగా తాజాగా ఈ మూవీలో ఓ సాంగ్ ను రిలీజ్ చేశారు. ‘లే లే రాజా… లేత లేత రోజా… ఖోలో ఖోలో ఆజా అందాలా దర్వాజా…’ అంటూ ఈ పాట మొదలైంది. ఈ సాంగ్ రిలీజ్ సందర్భంగా సోఫియా హల్ చల్ చేసింది.
‘ఓరగా చూడగా… కాక రేగదా ప్రతివాడికీ… సన్నగా నవ్వగా… మంటలే కదా మగజాతికీ…’ అంటూ కవ్వింపులతో సోఫియా సందడి మొదలు పెట్టింది. ఈమె కథ ఏంటో తెలుసుకోవాలంటే మట్కా మూవీని చూడాల్సిందేనంటున్నారు.
జి.వి.ప్రకాష్ కుమార్ స్వరకల్పనలోని సాగిన ఈ సాంగ్ కు భాస్కరభట్ల సాహిత్యం సమకూర్చారు. నీతి మోహన్ సాంగ్ ను పాడారు. నోరా ఫతేహి, వరుణ్ తేజ్‌లపై ఈ సాంగ్ తెరకెక్కించారు. 1970, 80 దశకాల్ని గుర్తుకు తెచ్చే ఈ పాటలో నోరా ఫతేహి… సోఫియా అనే గ్లామర్ క్వీన్ పాత్రలో నటించి అలరిస్తోంది. వరుణ్‌తేజ్ భిన్న గెటప్‌ల్లో ఈ మూవీలో కనిపిస్తారట. నవీన్‌చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిశోర్, రవీంద్ర విజయ్, పి.రవిశంకర్ తదితరులు ఈ మూవీలో కీ రోల్స్ పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఎ.కిశోర్‌కుమార్ అందిస్తున్నారు.
ఇవీ చదవండి: Raja Saab: రాజా సాబ్ అప్ డేట్స్.. నిర్మాత ఏమన్నారంటే..
Vishwambhara: విశ్వంభర టీజర్‌పై ట్రోలింగ్.. లోపాలేంటి?
Vettaiyan: వేట్టయన్ కు తెలుగు టైటిల్ ఎందుకు పెట్టలేకపోయామంటే..
Kanguva: 8 భాషల్లో కంగువా రిలీజ్.. ఏఐతో డబ్బింగ్!
Rakul Preet singh: రకుల్ ప్రీత్ సింగ్‌కు ప్రగ్యా బర్త్ డే విశెష్.. అందాల భామల హాట్ పోజులు
