HomeCinemaRakul Preet singh: రకుల్ ప్రీత్ సింగ్‌కు ప్రగ్యా బర్త్ డే విశెష్.. అందాల భామల...

Rakul Preet singh: రకుల్ ప్రీత్ సింగ్‌కు ప్రగ్యా బర్త్ డే విశెష్.. అందాల భామల హాట్ పోజులు

Rakul Preet singh: స్టార్ హీరోయిన రకుల్ ప్రీత్ సింగ్ కు సినీ తారలంతా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అక్టోబర్ 10న ఇవాళ అందాల ముద్దుగుమ్మ రకుల్ (Rakul Preet singh) బర్త్ డే వేడుకలు చేసుకుంది. రకుల్ బర్త్ డే సందర్భంగా మరో హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ (Pragya Jaiswal) సందడి చేసింది. రకుల్ ను కలిసి హాట్ పోజులిచ్చి బర్త్ డే విశెష్ చెప్పింది. ఈ మేరకు ఇన్ స్టాలో ఈ ముద్దుగుమ్మలు హాట్ పోజులతో ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.

Happy happy birthday sunshine @rakulpreet ❤️❤️
You are the light of our lives..Wishing you ALL the love, endless laughter, great food, beautiful travels, terrific work & some super fun times with us 😛💃🥳
Love you to the moon & back everyone’s favvv అంటూ ప్రగ్యా జైశ్వాల్ పోస్ట్ కు జత చేసింది.

సౌత్ ఇండియన్ సినిమా, బాలీవుడ్ మధ్య సినిమాలు చేస్తూ రకుల్ బిజీగా గడుపుతోంది. సినీ పరిశ్రమలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. తన సినిమాలు, సార్టోరియల్ ఎంపికలతో తరచుగా వార్తల్లో నిలిచే ఈ అమ్మడికి ఈ రోజు 34 సంవత్సరాలు నిండాయి. రకుల్ ప్రీత్ సింగ్ ఎప్పుడూ నటి కావాలని కలలు కనేదట. 18 సంవత్సరాల వయస్సులోనే మోడలింగ్ చేయడం ప్రారంభించింది.

15 సంవత్సరాల తన నటనా జీవితంలో, ఆమె అజయ్ దేవగన్, నాగ చైతన్య, అల్లు అర్జున్, రవితేజ, రామ్ చరణ్ వంటి స్టార్లతో సినిమాల్లో నటించి మంచి మార్కులు కొట్టేసింది. ఆమె 19 సంవత్సరాల వయస్సులో తన మొదటి పాత్రను పోషించింది. అదనపు పాకెట్ మనీ సంపాదించడానికి ఈ చిత్రానికి సైన్ అప్ చేసినట్లు రకుల్ ప్రీత్ సింగ్ ఓ సారి ఇంటర్వ్యూలో వెల్లడించింది.

రకుల్ ప్రీత్ సింగ్ 2009లో సెల్వర్గహవన్ 7G రెయిన్‌బో కాలనీకి రీమేక్ అయిన గిల్లి అనే కన్నడ చిత్రంతో తెరంగేట్రం చేసింది. కొంచెం అదనపు పాకెట్ మనీ సంపాదించడానికి ఈ ఆఫర్‌ను అంగీకరించినట్లు ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది.

సౌత్ ఇండియన్ సినిమాలు ఎంత పెద్దవిగా ఉంటాయో తర్వాతి కాలంలో రకుల్ తెలుసుకుంది. గిల్లి మూవీకి రాఘవ దర్శకత్వం వహించారు. ఇందులో గురురాజ్, యెతిరాజ్, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో రకుల్ తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దీని తర్వాత, ఆమె ఫెమినా మిస్ ఇండియా పేజెంట్ 2011లో పాల్గొంది.

ఇవీ చదవండి: Mouni Roy: దసరా నవరాత్రి సెలబ్రేషన్స్‌లో మౌని రాయ్.. ఫొటో గ్యాలరీ
Shriya Kontham: అందాలతో మతి పోగొడుతున్న బ్యూటీ.. శ్రియా కొణతం ఫొటోలు
Rashi Singh: రాశి సింగ్‌ హాట్‌ ఫొటో గ్యాలరీ.. భూతద్దం భాస్కర్‌ నారాయణ బ్యూటీ కలర్‌ఫుల్‌ పిక్స్‌!!
Mrunal Thakur: మృణాల్‌ ఠాకూర్‌ ఫొటో గ్యాలరీ
Kavya Thapar: టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. గ్లామర్‌ షో.. సోషల్‌ మీడియాలో హాట్‌ ఫొటోలు వైరల్‌

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు