CPM Baburao: తిరుపతి లడ్డూపై పెట్టిన శ్రద్ధ.. వరద బాదితులను ఆదుకోవడంపై పెట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు (CPM Baburao) డిమాండ్ చేశారు. ప్రకృతి వైపరీత్యంతో పాటు గత, నేటి పాలకుల వైఫల్యం వరద కష్టాలకు కారణం అన్నారు. కేంద్రం నుంచి రావలసిన వరద సహాయంపై తెలుగుదేశం, జనసేన, వైసీపీ నోరు మెదపడం లేదన్నారు. 35 రోజులు గడిచినా, ఇంకా వేలాదిమందికి వరద సహాయం అందలేదన్నారు.
’’వరదల వల్ల రాష్ట్రంలో 11.5 లక్షల మంది ఇబ్బందులు పడ్డారు. ప్రకృతి వైపరీత్యం తో పాటు మానవ తప్పిదం అని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పారు. ఈ విపత్తు లో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత ఉంది, గత పాలకుల వైఫల్యమూ ఉంది. చివరి బాధితుడి కి పరిహారం ఇస్తామని సీఎం చెప్పారు.. ఆ హామీని నిలబెట్టుకోవాలని అడుగుతున్నాం. గత నెల 13వ తేదీ కి వరద బాధితులను ఎన్యుమరేట్ చేస్తామని సిసోడియా ప్రకటించారు.
కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.7,500 కోట్ల నష్టం లో బాధితుల నష్టం లేదు. రూ.5,000 కోట్లు బాధితుల నష్టమే ఉంటుంది. తిరుపతి లడ్డుపై చూపించిన ఆసక్తి, శ్రద్ధ వరద బాదితులపై పెడితే బాగుండేది. అనవసర విషయాలపై దీక్షలు కాదు.. వరద సహాయంపై కేంద్రంతో మాట్లాడండి, నిలదీయండి..
వరద సహాయం పెంచాలి.. అందరికి ఇవ్వాలి. పేదల పునరావాస కాలనీలు వరద లో ఎక్కువ ముంపుకు గురైనాయి. పి 4 వరద బాధితులకు సహాయం అందించడంలో చూపించాలి. రూ.500 కోట్లు దాతలు సహాయం అందించారు. కేంద్ర సహాయం అంశంలో టిడిపి, జనసేన, వైసిపి నేతలు మాట్లాడడం లేదు.
వరద బాధితుల సమస్యలపై ఆందోళనకు సిద్ధం అవుతున్నాం. అప్లికేషన్ పెట్టుకొన్న వారితో పాటు , ప్రతి ఇంటికి ఎన్యుమరేషన్ చేయాలి. విజయవాడ లోని కూటమి ప్రజా ప్రతినిధులు ఘోర వైఫల్యం చెందారు.. కోటి 50 లక్షల మందికి భోజనాలు, అల్పాహారం కొరకు 368కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పారు.. 26 కోట్ల 86లక్షలు వాటర్ బాటిల్స్ అగ్గి పెట్టెలు, కొవ్వొత్తుల, జనరేటర్ ఇతర సామాన్లు 23 కోట్ల 7లక్షల రూపాయిలు..
ఈ ఖర్చు ద్వారా చేసిన సహాయం దిగువ స్థాయిలో బాధితులకు పూర్తిగా అందలేదు.. 534కోట్ల 49లక్షలు ఖర్చు చేసారని అధికారిక లెక్కలు.. డ్రోన్స్ ద్వారా మందులు , మంచినీరు కోసం 2 కోట్లుపైనే ఖర్చులు.. హెలికాప్టర్ కి 76 లక్షలు, పడవల అద్దెలు 93 లక్షలు, రక్షణ సిబ్బంది భోజనాలు 58 లక్షలు, ఈతగాళ్ళకు 15 లక్షలు ఖర్చు చేశారు. బాధితులకు న్యాయం జరగాలని కోరుతున్నాం. దెబ్బ తిన్న ఇళ్ల పునర్నిర్మాణానికి 5లక్షల ఇవ్వాలి..
వరదల్లో ఉన్న వారికి కరెంట్ బిల్లు కట్టాలని చెపుతున్నారు.. రెండు నెలల కరెంటు బిల్లు, సంవత్సరం ఇంటి పన్ను, మంచినీరు, డ్రైనేజీ చార్జీలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.. వరద తగ్గింది.. జ్వరాలు పెరుగుతున్నాయి.. మెడికల్ క్యాంప్ లు ఏర్పాటు చేయాలి. ఎన్యుమరేషన్ కోసం మళ్ళీ అధికారులను, మంత్రులను కేటాయించి సర్వే చేయాలి. బాధితులకు న్యాయం చేయడంలో మీనమేషాలు లెక్కిస్తుంది.. ఇతర ఖర్చులకు ఉదారత గా ఖర్చు చేసింది..
ఓట్లకు అర్హులు అయిన బాధితులు నష్ట పరిహారం ఇవ్వడానికి ఎందుకు కారు. నష్ట పరిహారం 50వేలకు పెంచాలి. తక్షణ చర్యలతో పాటు శాశ్వత చర్యపై దృష్టి పెట్టాలి.’’ అని బాబూరావు డిమాండ్ చేశారు.
Read also: Vijayawada Floods: విజయవాడ వరద బాధితులకు వైయస్సార్ సీపీ ప్రజా ప్రతినిధుల విరాళం
Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై పెరిగిన భక్తుల రద్దీ.. కిక్కిరిసిన వీఐపీ మార్గం
Vijayasai Reddy on CBN: బాబు కనిపెట్టిన వాటికి కేంద్రం పేటెంట్ హక్కులు కోరాలి: సైరా సెటైర్లు
CM Jagan at flood affected areas: పబ్లిసిటీకి దూరంగా, సాయానికి దగ్గరగా.. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ టూర్ సక్సెస్
