శుక్రవారం, 18 సెప్టెంబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Andhra Pradesh

Vijayawada Floods: విజయవాడ వరద బాధితులకు వైయస్సార్ సీపీ ప్రజా ప్రతినిధుల విరాళం

Keerthanaa News Deskప్రచురణ తేదీ: శనివారం, 7 సెప్టెంబర్ 2024

Vijayawada Floods: వరదలతో అతలాకుతలమైన విజయవాడ బాధితులను ఆదుకోవడానికి స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి సహాయనిధికి సినీ తారలు సైతం విరాళాలు ఇచ్చారు. అలాగే ఉద్యోగ సంఘాల నాయకులు సైతం ముందుకొచ్చి బాధితులను ఆదుకోవడానికి విరాళం ప్రకటించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ రూ.కోటి సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు కూడా సాయానికి ముందుకొచ్చారు.

వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు, లోక్‌సభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక నెల జీతాన్ని విరాళంగా ఇవ్వనున్నారు. పార్టీ చేపట్టనున్న వరద బాధిత సహాయ కార్యక్రమాలకు ఈ విరాళాన్ని వినియోగించనున్నారు. వైయస్ జగన్ ప్రకటిలంచిన సాయాన్ని వినియోగించి వరద బాధితుల కోసం పాల ప్యాకెట్లు, వాటర్‌ బాటిళ్లు పెద్ద ఎత్తున పంపిణీ చేశారు. ఇంకా బాధితుల అవసరాలు గుర్తించి, సరుకులు పంపిణీ చేస్తామని పార్టీ ప్రకటించింది. ఆ సహాయ కార్యక్రమాలకు తోడు, ఇప్పుడు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రటించిన విరాళం అదనం కానుంది.

ఇవీ చదవండి: YS Jagan: విజయవాడ మునగడానికి కారణం చంద్రబాబే.. మరోసారి జగన్ ఫైర్
YS Jagan: ఇవి మ్యాన్ మేడ్ ఫ్లడ్స్.. ఇంత నిర్లక్ష్యమా? : వైయస్ జగన్
YS Jagan: వక్ఫ్ బిల్లుకు మేం వ్యతిరేకం.. వైయస్ జగన్ క్లారిటీ
YS Jagan: మరో మూడు నెలల్లోనే చంద్రబాబు…. వైయస్ జగన్ కీలక వ్యాఖ్యలు

ట్యాగ్స్: , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading