HomeSportsHardik Pandya: యాట్యిట్యూడ్ స్టార్.. హార్దిక్ స్టైలిష్ ఆటపై భిన్నాభిప్రాయాలు!

Hardik Pandya: యాట్యిట్యూడ్ స్టార్.. హార్దిక్ స్టైలిష్ ఆటపై భిన్నాభిప్రాయాలు!

Hardik Pandya: టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య ఆటతీరు భిన్నంగా ఉంటుంది. అందరి క్రికెటర్ల కంటే కాస్త వెరైటీగా ఆడుతుంటాడు హార్దిక్. ఇటీవల తన వ్యక్తిగత జీవితంలో విడాకుల అంశంపై వార్తల్లో నిలిచిన హార్దిక్.. తాజాగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న టీ20 మ్యాచ్ లో స్టైలిష్ ఆట తీరుతో మరోసారి నెట్టింట హాట్ టాపిక్ గా నిలిచాడు. అద్భుతమైన షాట్స్ తో అభిమానులను అలరించాడు. క్రికెట్ పండితుల మన్ననలు అందుకున్నాడు. అయితే, మొదటి నుంచి ఆట్యిట్యూడ్ స్టార్ గా ముద్ర వేసుకునే ప్రయత్నం చేస్తున్న హార్దిక్.. తన పంథా ఏ మాత్రం మార్చుకోకుండా కొనసాగిస్తున్నాడు.

విమర్శలు వచ్చిన ప్రతి సారీ నిలదొక్కుకుంటూ వస్తున్నాడు. గతంలో కేఎల్ రాహుల్ తో కలిసి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన హార్దిక్.. కండోమ్స్ విషయంలో చేసిన కామెంట్లు, నచ్చిన అమ్మాయితో ఎంజాయ్ చేస్తానంటూ మాట్లాడిన మాటలతో.. అమ్మాయిలను ఆటబొమ్మలా చూశాడంటూ విమర్శలు వచ్చాయి. కేఎల్ రాహుల్ పైనా విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, వాటిని పట్టించుకోకుండా ఆటపై ఇద్దరూ ఫోకస్ చేసి అటు టీమిండియాలోనూ, ఇటు ఐపీఎల్ లోనూ రాణిస్తున్నారు.

ముంబై ఇండియన్స్ జట్టు నుంచి పక్కకు వచ్చేసి గుజరాత్ టైటాన్స్ జట్టుకు హార్దిక్ సారథ్యం వహించాడు. బాధ్యతలు తీసుకున్న తొలి సీజన్ లోనే ఐపీఎల్ కప్పు కొట్టి విమర్శకుల నోళ్లు మూయించాడు హార్దిక్. అలాగే నటాషాతో విడిపోవడం, విడాకుల అంశంలోనూ హార్దిక్ పై తీవ్ర విమర్శలే వచ్చాయి. కానీ, అటు తర్వాత టీ20 ప్రపంచ కప్ టీమిండియా వశం కావడంలో హార్దిక్ కీలక భూమిక పోషించాడనడంలో సందేహం లేదు. ఇలా తనపై విమర్శలు వచ్చిన ప్రతి సారీ ఆటతో జవాబు చెబుతున్నాడు.

కానీ పెద్దలకు గౌరవం ఇవ్వాలని, సీనియర్ ఆటగాళ్లకు వ్యాల్యూ ఇవ్వాలని కొందరు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. నీ ఆట్యిట్యూడ్ మాత్రమే నిన్ను కాపాడలేదని, ఆటపై కూడా ఫోకస్ పెట్టి తోటి ఆటగాళ్లతో పాటు ప్రవర్తన ఉండాలని కొందరు చెబుతున్నారు. ఒక్కోసారి తన ప్రవర్తన, ఆటలో పేలవ ప్రదర్శన కారణంగా తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తోందని గుర్తు చేస్తున్నారు. గత ఐపీఎల్ సీజన్ లో పేలవమైన ఆటతో ముంబై ఇండియన్స్ కప్పు కొట్టలేకపోయిందని, ఓ మ్యాచ్ ఆడితే 10 మ్యాచ్ లు చేతులెత్తేస్తున్నాడన్న విమర్శలు హార్దిక్ పై వచ్చాయి. ఇలాంటివన్నీ సరిదిద్దుకుని ముందుకెళ్లాలని సూచిస్తున్నారు సీనియర్లు.

అయితే, హార్దిక్ ఆట తీరు చాలా మంది అభిమానులను కట్టిపడేస్తోంది. సూర్యకుమార్ యాదవ్ ఆట తీరు కూడా అందరూ మెచ్చేలా ఉంటుందని, కానీ హార్దిక్ ఆటతీరుతోపాటు ఆట్యిట్యూడ్ ఉంటుందని గుర్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి: Pooran: నికోలస్ పూరన్ విధ్వంసం.. అరుదైన రికార్డు సొంతం
IPL: టీమిండియా క్రికెటర్లకు మరో గుడ్ న్యూస్.. 
PBKS vs LSG : రికార్డులు బద్దలయ్యాయి.. లక్నో, పంజాబ్‌ మ్యాచ్‌లో విశేషాలివీ..
Virat Kohli: కోహ్లీ ప్రపంచ రికార్డు.. టెస్టు చరిత్రలో సంచలనం
MS Dhoni Jersey: ధోనికి బీసీసీఐ గౌరవం.. నంబర్ 7 జెర్సీకి వీడ్కోలు

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు