HomeAndhra PradeshIndrakeeladri: ఇంద్రకీలాద్రిపై పెరిగిన భక్తుల రద్దీ.. కిక్కిరిసిన వీఐపీ మార్గం

Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై పెరిగిన భక్తుల రద్దీ.. కిక్కిరిసిన వీఐపీ మార్గం

Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్ధీ కొనసాగుతోంది. వీఐపీ భక్తుల రాకపోకలపై గందరగోళం ఏర్పడింది. దర్శనానికి వచ్చిన దారిలోనే బయటికి వెళ్తుండటంతో వీఐపీ మార్గం కిక్కిరిసిపోయింది. రద్దీ సమయంలోనే దర్శనాలకు (Indrakeeladri) పోలీసులు క్యూకట్టడం గమనార్హం.

పోలీస్ కమిషనర్ చెప్పినా కొంతమంది పోలీసు సిబ్బంది వైఖరి మారడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. పోలీసు యూనిఫామ్ లో వీఐపీ క్యూ లైన్ ల్లో అమ్మవారి దర్శనానికి పోలీసులు వెళ్తున్నారు. యూనిఫామ్ లో ఏ ఒక్క పోలీసు సిబ్బంది దర్శనానికి వెళ్లడానికి వీల్లేదని ముందుగానే కమిషనర్ హెచ్చరించారు.

పోలీస్ కమిషనర్ ఆదేశాలను కొంతమంది సిబ్బంది పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఫిర్యాదులు రావడంతో కొండపైకి పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర్ బాబు చేరుకున్నారు. సిబ్బందిని పోలీస్ కమిషనర్ హెచ్చరించారు. పరిస్థితి చక్క దిద్దేందుకు చర్యలు తీసుకున్నారు. వీఐపీలకు ఎంట్రీ, ఎగ్జిట్ వేరువేరుగా పెట్టాలని దుర్గగుడి ఈవో కె.ఎస్.రామారావుకు పోలీస్ కమిషనర్ సూచనలు చేశారు.

ఇలా ఉండగా దసరా మహోత్సవాల్లో భాగంగా రెండవ రోజు వైభవంగా నగరోత్సవం నిర్వహించారు. నగరోత్సవంలో భాగంగా పల్లకీలో శ్రీ గంగా ,పార్వతీ సమేత మల్లేశ్వరస్వామివారు ఊరేగారు. కనకదుర్గానగర్, ఘాట్ రోడ్డు మీదుగా ఆలయం వరకూ నగరోత్సవం సాగింది.

మేళతాళాలు, కేరళ వాయిద్యాలు, కోలాటాల నడుమ కన్నుల పండువగా నగరోత్సవం సాగింది. నగరోత్సవంలో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర్ బాబు పాల్గొన్నారు. అశేష సంఖ్యలో భక్తజనం పాల్గొని వీనులవిందు అయ్యారు. స్వామి, అమ్మవార్లను తిలకించి పరవశించిపోయారు.

శ్రీక్రోధి నామసంవత్సరం ఇంద్రకీలాద్రి కొండపై నిర్వహిస్తున్న దేవీ శరన్నవరాత్రుల్లో రెండవ రోజు అశ్వయుజశుద్ధ విదియ శుక్రవారం అమ్మవారు గాయత్రీ దేవి అలకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. గాయత్రీ దేవి అలంకారంలో ఉన్న అమ్మ వారి దర్శనార్థం ఎక్కడెక్కడి నుంచో భక్తులు ఇంద్రకీలాద్రికి వచ్చారు.

ఇవీ చదవండి: Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తజనం.. దుర్గమ్మకు సీఎం జగన్‌ పట్టు వస్త్రాలు
Vijayawada Floods: విజయవాడ వరద బాధితులకు వైయస్సార్ సీపీ ప్రజా ప్రతినిధుల విరాళం
CEC Press meet: ఏపీలో ఎన్నికల నిర్వహణపై సిద్ధమవుతున్నాం.. విజయవాడలో సీఈసీ కీలక ప్రెస్‌మీట్‌
Pothina Mahesh: దుర్గమ్మ ఆలయ ఆదాయం టీడీపీ నేత జేబుల్లోకి.. మూడు నెలల్లో రూ.4 కోట్ల అవినీతి!
Goddess Durga: సూర్యభగవానుని, దుర్గమ్మను ఎలా పూజించాలి?
Maha Yagnam: రూ.225 కోట్లతో మారనున్న దుర్గగుడి రూపురేఖలు

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు