HomeNationalUP Journalist: ప్రభుత్వాలు జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు పెట్టడం మానుకోవాలి: సుప్రీంకోర్టు

UP Journalist: ప్రభుత్వాలు జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు పెట్టడం మానుకోవాలి: సుప్రీంకోర్టు

UP Journalist: ప్రభుత్వాలు జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు పెట్టడం మానుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రభుత్వాలను విమర్శించడం జర్నలిస్టుల హక్కు అని, విమర్శించినంత మాత్రాన కేసులు పెట్టడం తప్పు అని స్పష్టం చేసింది. అభిషేక్ ఉపాధ్యాయ్ అనే జర్నలిస్ట్‌పై యూపీ పోలీసులు నమోదు చేసిన FIRను పరిశీలిస్తూ సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

‘ప్రభుత్వాన్ని విమర్శించినందుకు జర్నలిస్టుపై క్రిమినల్ కేసులు పెట్టలేం’ అని సుప్రీం పేర్కొంది. ఈ మేరకు యూపీ జర్నలిస్టుకు మధ్యంతర రక్షణ కల్పిస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది.

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పరిపాలనలో కుల గతిపై ఆయన రాసిన కథనానికి సంబంధించి జర్నలిస్టు అభిషేక్ ఉపాధ్యాయ్‌పై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోరాదని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు ఈరోజు ఆయనకు మధ్యంతర రక్షణను కల్పించింది.

తన పాత్రికేయ పాత్రపై యుపీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని కోరుతూ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తులు జస్టిస్ హృషికేష్ రాయ్, ఎస్‌.వి.ఎన్. భట్టిలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసు జారీ చేస్తూ, ధర్మాసనం నవంబర్ 5కు కేసును వాయిదా వేసింది.

“ప్రజాస్వామ్య దేశాలలో, ఒకరి అభిప్రాయాలను వ్యక్తీకరించే స్వేచ్ఛను గౌరవిస్తారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 (1) (ఎ) ప్రకారం జర్నలిస్టుల హక్కులు రక్షించాలి. కేవలం ఒక జర్నలిస్ట్ రాతలు, ప్రభుత్వంపై విమర్శలు, నేరపూరితమైనవిగా భావిస్తున్నారు. రైటర్లపై కేసులు పెట్టకూడదు’’ అని సుప్రీంకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఉపాధ్యాయ్ ”యాదవ్ రాజ్ వర్సెస్ ఠాకూర్ రాజ్ (లేదా సింగ్ రాజ్)” అనే ఆర్టికల్ ను రాశాడు. దాని ప్రకారం, సెక్షన్ 353(2),197(1)(సి) కింద శిక్షార్హమైన నేరాలకు సంబంధించి అతనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. BNS చట్టంలోని 302, 356(2) మరియు IT (సవరణ) చట్టం, 2008లోని సెక్షన్ 66 ప్రకారం అతనిపై కేసులుపెట్టారు.

యూపీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను, అలాగే ఇతర ప్రదేశాలలో జరిగిన సంఘటనకు సంబంధించి దాఖలు చేసిన ఇతర ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేయాలని ఉపాధ్యాయ్ తన అభ్యర్థనలో కోరాడు.

మాజీ ముఖ్యమంత్రి మరియు ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు అఖిలేష్ యాదవ్ ‘X’ పోస్ట్‌లో ప్రశంసించడంతో తన విషయం చర్చనీయాంశంగా మారిందని పిటిషనర్ పేర్కొన్నాడు. ఆ తర్వాత ఆన్‌లైన్‌లో బెదిరింపులు వచ్చాయన్నాడు. అలాంటి బెదిరింపులకు వ్యతిరేకంగా, అతను యూపీ డీజీపీకి ఒక ఇమెయిల్ రాసి తన ‘X’ హ్యాండిల్‌లో పోస్ట్ చేశాడు. యూపీ పోలీసు అధికారిక హ్యాండిల్ అతనికి ‘X’లో సమాధానమిచ్చింది. “మీరు పుకార్లు లేదా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయవద్దని హెచ్చరిస్తున్నాం. సమాజంలో గందరగోళం మరియు అస్థిరతకు దారితీసే ఇటువంటి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు చేస్తే మీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.’’ అని హెచ్చరించారు.

ఇవీ చదవండి: Tirumala Laddu row: లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో వాడీవేడి వాదనలు
Tirumala Laddu: తిరుమల లడ్డూ వివాదంపై స్వతంత్ర దర్యాప్తు : సుప్రీం కోర్టు తీర్పు
Bhumana: సుప్రీంకోర్టును సైతం హెచ్చరించేలా పనవ్ విమర్శలు: భూమన
Purandeswari: చంద్రబాబుపై సుప్రీంకోర్టు కామెంట్లు సమంజసం కాదు: పురందేశ్వరి

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు