HomeCinemaSrinu Vaitla: ఆగడు మూవీ చేయాల్సింది కాదు: దర్శకుడు శ్రీనువైట్ల

Srinu Vaitla: ఆగడు మూవీ చేయాల్సింది కాదు: దర్శకుడు శ్రీనువైట్ల

Srinu Vaitla: మహేష్ బాబు హీరోగా వచ్చిన ఆగడు మూవీ చేయకుండా ఉండాల్సిందంటూ దర్శకుడు శ్రీనువైట్ల అన్నారు. ఆ మూవీ తీసినందుకు లైఫ్ లాంగ్ బాధపడుతుంటానని వ్యాఖ్యానించాడు. దానికి ఓ కారణం ఉందన్నాడు. ‘దూకుడు’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత మహేశ్ బాబుతో భారీ బడ్జెట్ సినిమా చేయాలని భావించానని, అప్పుడు ‘ఆగడు’ సినిమా చేయాలనే ఆలోచనే లేదన్నాడు.

భారీ యాక్షన్ కథ మహేష్ బాబుకు చెప్పానని, వెంటనే చేసేద్దామని ఆయన బదులిచ్చాడన్నాడు. 14 రీల్స్ సంస్థ ప్రొడ్యూసర్ల కూడా కథ నచ్చిందని శ్రీనువైట్ల అన్నాడు. అయితే వాళ్లు అంత బడ్జెట్ పెట్టలేమని తెలిపారన‍్నాడు. అప్పట్లో వాళ్లకు ఆర్థిక సమస్యలుండేవని, దీంతో ఆ కథని పక్కనబెట్టి ‘ఆగడు’ చేసినట్లు వెల్లడించాడు. అయితే అది చేయకుండా ఉండాల్సిందని ఇప్పటికీ బాధపడుతుంటానంటూ శ్రీనువైట్ల వ్యాఖ్యానించాడు.

గోపీచంద్ కథానాయకుడిగా నటించిన విశ్వం సినిమా అక్టోబర్ 11న దసరా కానుకగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్లలో శ్రీనువైట్ల బిజీగా గడుపుతున్నాడు. పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నాడు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలు పంచుకున్నాడు. మహేశ్ బాబు ‘ఆగడు’ ఫ్లాప్‌పై శ్రీనువైట్ల కారణాలు వెల్లడించాడు.

శ్రీను వైట్ల దర్శకత్వంలో ఢీ, రెడీ, దూకుడు లాంటి అద్భుతమైన సినిమాలు వచ్చాయి. కామెడీ విషయంలో సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన ఘనత శ్రీనువైట్లదే.

Read also: Mahesh Babu: రెమ్యునరేషన్ విషయంలో మహేష్ బాబు సంచలన నిర్ణయం.. వచ్చే సినిమా నుంచే!
Sony 85 Inches TV: సోనీ 85 అంగుళాల టీవీ.. ధర రూ.4,49,990 నుంచి ప్రారంభం
SSMB 28: గెట్‌ రెడీ టు మాస్‌ స్ట్రైక్.. మహేష్‌బాబు అభిమానులకు జాతరే!
Pooja Hegde: విజయ్‌ సరసన పూజాహెగ్డే కన్ఫం?
Bigg Boss 8: బిగ్ బాస్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరంటే..

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు