Mahesh Babu: రెమ్యునరేషన్ విషయంలో మహేష్ బాబు సంచలన నిర్ణయం.. వచ్చే సినిమా నుంచే!

Mahesh Babu: సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ డైరెక్షన్‌లో సినిమా చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు తర్వాత దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో మహేష్‌బాబు నటించనున్న సంగతి తెలిసిందే. సూప‌ర్ స్టార్ మ‌హేశ్‌బాబుతో (Mahesh Babu) సినిమా చేస్తుండడంతో రాజ‌మౌళి ప్రిపరేషన్‌కు కాస్త ఎక్కువ సమయమే తీసుకుంటున్నారట. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని టాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీతో బంపర్‌ హిట్‌ కొట్టాడు డైరెక్టర్‌ రాజమౌళి (SS Rajamouli). రామ్‌చరణ్‌ (Ram Charan), జూనియర్‌ ఎన్టీఆర్‌ (Jr NTR) ఈ చిత్రంలో తమ నటనా కౌశలాన్ని ప్రదర్శించారు. పాన్‌ ఇండియా రేంజ్‌లో వచ్చిన ఈ సినిమా రికార్డులు బద్ధలు కొట్టింది.

The Economic Times

అంతర్జాతీయంగానూ ట్రిపుల్‌ ఆర్‌ సినిమా అనేక సెన్సేషన్లు క్రియేట్‌ చేసిన సంగతి తెలిసిందే. జపాన్‌లో కూడా ఈ సినిమాని విడుదల చేశారు. అక్కడ మంచి రెస్పాన్స్‌ వచ్చింది. అనేక అవార్డులు కూడా ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాన్ని వరించాయి. న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్స్ 2022లో ఉత్తమ దర్శకుడిగా అవార్డు గెలుచుకున్నారు రాజమౌళి. ఇక తదుపరి ప్రాజెక్టు మహేష్‌బాబుతో కావడంతో జక్కన్న స్క్రిప్ట్‌ వర్క్‌లో నిమగ్నం అయ్యాడని టాలీవుడ్‌ సర్కిళ్లలో చర్చ జరుగుతోంది. అయితే, ఇటీవల రాజమౌళి సెల్‌ఫోన్‌ యాడ్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

SS Rajamouli Latest Oppo 10 Series Ad | Rajamouli First ad | IndiaGlitz  Telugu - YouTube

ఈ నేపథ్యంలోనే కాస్త ఇంట్రస్టింగ్‌ టాపిక్‌ ఒకటి ఫిల్మ్‌ సర్కిళ్లలో తిరుగుతోంది. వీరిద్దరి కాంబోలో వస్తున్న మొదటి చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మూవీపై ఏ చిన్న అప్‌డేట్‌ వచ్చినా వెంటనే వైరల్‌ అవుతోంది. సాధారణంగా సినిమాల్లో నటించినందుకు యాక్టర్లు రెమ్యునరేషన్ తీసుకుంటూ ఉంటారు. కానీ కొంత మంది వచ్చిన కలెక్షన్ లో వాటాల వైపు మొగ్గు చూపుతుంటారు. ఇప్పటికే చాలా మంది ఆ విధానాన్ని అనుసరిస్తున్నారు.

 

మహేష్‌బాబు సైతం ఇదే విధానాన్ని అనుసరించాలని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. తన అభిప్రాయాన్ని దర్శక ధీరుడు రాజమౌళి, చిత్ర ప్రొడక్షన్‌ హౌస్‌కు తెలియజేశాడట మహేష్‌ బాబు. ఈ చిత్రానికి స్వయంగా రాజమౌళి తన ప్రొడక్షన్‌ హౌస్‌ పేరును జత చేశారు. తద్వారా నిర్మాతగా మారినట్లయింది. రాజమౌళి సైతం సినిమాకు వచ్చే కలెక్షన్స్‌ ఆధారంగా రెమ్యునరేషన్‌ తీసుకుంటారు. అయితే, మహేష్‌బాబు నటించబోయే ఈ ప్రాజెక్టులో హాలీవుడ్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ ఉండటంతో ఈ డీల్‌ అంత సులభం కాకపోవచ్చని చెబుతున్నారు.

జక్కన్నకు అరుదైన గౌరవం..

డైరెక్టర్‌ రాజమౌళికి ఇటీవల అరుదైన గౌరవం దక్కింది. ఐఎస్‌బీసీ సంస్థ తమ ఆర్గనైజేషన్ గౌరవ అధ్యక్షుడిగా రాజమౌళిని ఎంపిక చేసుకుంది. ఐఎస్‌బీసీ సంస్థ గ్రామీణ స్థాయి నుంచి క్రికెటర్లలో ప్రతిభను ప్రోత్సహించేందుకు రూపొందించారు. త్వరలోనే ఐఎస్‌బీసీ (ISBC) చైర్మన్‌గా బాధ్యతలను రాజమౌళి స్వీకరించనున్నట్లు తెలుస్తోంది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి ప్రతిష్టాత్మక చిత్రాలతో వలర్డ్‌ వైడ్‌గా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి.. ఈ క్రమంలో ఎన్నో ప్రతిష్టాత్మకమైన అవార్డులను కైవసం చేసుకున్నాడు. తాజాగా ఐఎస్‌బీసీ చైర్మన్‌గా గౌరవం దక్కడం విశేషం.

Director SS Rajamouli : దర్శకధీరుడు జక్కన్నకు అరుదైన గౌరవం

ఇప్పటికే ఐఎస్‌బీసీకి జాయింట్ సెక్రెటరీగా రాజమౌళి కుమారుడు కార్తికేయ వ్యవహరిస్తున్నారు. ఈ సంస్థకు చీఫ్‌ ప్యాట్రన్‌గా బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌ ఉన్నారు. వెటరన్‌ క్రికెటర్‌ దిలీప్‌ వెంగ్‌సర్కార్ ప్రధాన సలహాదారుగా వ్యవహరిస్తున్నారు.

Read Also : NTR: క్లాస్‌ అండ్‌ మాస్.. దంచి కొడుతున్న ఎన్టీఆర్..!

keerthanaanews
keerthanaanewshttps://keerthanaanews.com
Best Telugu news. we are providing best telugu articles and special stories.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles