SSMB 28: మహేష్ బాబు (Mahesh Babu) 28వ సినిమా (SSMB 28) టైటిల్‌ను త్వరలో ప్రకటించనున్నారు. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ (Super Star Krishna) జయంతి సందర్భంగా మహేష్ బాబు మూవీ ఫస్ట్ గ్లిమ్స్‌ను (First Glimps) రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. దాంతోపాటు సినిమా పేరును కూడా ప్రకటించనున్నారని తెలుస్తోంది. తాజాగా మహేష్‌బాబు సినిమా పోస్టర్ (Cinema Poster) ఒకటి రిలీజ్ చేసింది చిత్ర బృందం. మే 231న మాస్ స్ట్రైక్‌కు (Mass Strike) (#SSMB28) సిద్ధంగా ఉండాలని అందులో ఉండటంతో అభిమానులకు జాతర మొదలైంది.
ఇక సినిమా విడుదల తేదీని కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మహేష్‌బాబు సినిమా కొన్ని కారణాల వల్ల షూటింగ్ ఆలస్యమవుతోంది. దీంతో విడుదల తేదీలో మార్పు చోటుచేసుకొనే చాన్స్ ఉందని తెలుస్తోంది. అయితే, అనుమానాలను పక్కనపెట్టేసి రెడీగా ఉండాలంటూ అభిమానులకు కొందరు చిత్ర యూనిట్ సభ్యులు సూచిస్తున్నారట. సినిమా టైటిల్ విషయంలో ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు టాక్ వస్తోంది. కొన్ని టైటిల్స్‌ను పరిశీలించిన తర్వాత మహేష్‌బాబుకు సూట్ అయ్యే మాస్ టైటిల్‌ను ఫైనలైజ్ చేసినట్లు తెలుస్తోంది.
అయితే, సినిమా టైటిల్ ను ఖరారు చేసిన తర్వాత ఆ టైటిల్ ముందే మరో నిర్మాత రిజిస్ట్రర్ చేయించారని తెలిసిందట. దాంతో వెంటనే ఆ నిర్మాత వద్ద నుంచి టైటిల్ ను కొనుగోలు చేశారని ఫిల్మ్ నగర్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమా కథకు ఆ టైటిల్ సరిగ్గా మ్యాచ్ అవుతుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది.
టైటిల్ ను ఈనెల 31వ తారీకున రివీల్ చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి టైటిల్ విషయంలో అంతా సస్పెన్స్ కనిపిస్తోంది. ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడీగా పూజా హెగ్డే, శ్రీలీల కథానాయికలుగా నటిస్తున్నారు. అతడు, ఖలేజా సినిమా తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న సినిమా ఇదే కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం త్రివిక్రమ్ తన సెంటిమెంట్‌తో పాటు తనను తాను కూడా పూర్తిగా మార్చుకున్నాడట. అంతేకాదు మహేష్ సినిమా క్ోసం మాటల మాంత్రికుడు తన వర్కింగ్ స్టైల్‌తో పాటు సెంటిమెంట్‌ను కూడా పక్కన పెట్టేశాడని టాక్ వస్తోంది.
గతంలో మహేష్ బాబుతో త్రివిక్రమ్ చేసిన అతడు, ఖలేజా సినిమాల విషయంలో కథ ఓకే అయినా.. పూర్తి బ్రౌండెడ్ స్క్రిప్ట్ లేదట. దీంతో ఆయా ప్రాజెక్ట్స్ ఏళ్ల తరబడి సాగిందట. చివరకు క్యాస్ట్ ఫెయిల్యూర్స్‌గా నిలిచాయని చెబుతున్నారు. అయితే, ఈసారి మాత్రం అలాంటి పొరపాట్లు చేయలేదని తెలుస్తోంది.
మహేష్ బాబు కూడా త్రివిక్రమ్‌తో చేయబోయే చిత్రానికి కొన్ని షరతులు విధించినట్లు తెలుస్తోంది. ముందుగా సినిమాకు సంబంధించిన బౌండెడ్ స్క్రిప్ట్ సిద్దంగా ఉంచుకోవాలని కండిషన్ పెట్టాడట. త్రివిక్రమ్ కూడా తన కెరీర్‌లో తొలిసారి పూర్తి బౌండెడ్ స్క్రిప్టును దగ్గర ఉంచుకొని మరీ మహేష్ బాబుతోమూవీని తెరకెక్కిస్తున్నాడట. అందుకే ఈసారి హిట్‌పై నమ్మకంగా ఉన్నారు.
Read Also : NTR: క్లాస్ అండ్ మాస్.. దంచి కొడుతున్న ఎన్టీఆర్..!