Purandeswari: లడ్డూ వివాదం సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్న తరుణంలో బీజేపీ ఎంపీ, పార్టీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. లడ్డూ వివాదంలో సుప్రీం కామెంట్లపై పురంధేశ్వరి భిన్నంగా స్పందించడం ఇప్పుడు కలకలం రేపుతోంది.
ఏం జరిగిందో అదే సీఎంగా చంద్రబాబు మాట్లాడారంటూ పురంధేశ్వరి వ్యాఖ్యానించారు. సీఎం వ్యాఖ్యలపై కోర్టు కామెంట్ చేయడం సమంజసంగా లేదంటూ పురందేశ్వరి హాట్ కామెంట్లు చేశారు. సీఎం మాట్లాడకుండా ఉండాల్సింది అనడం సరికాదంటూ వ్యాఖ్యానించారు.
రాజ్యాంగ పదవిలో ఉన్నందున మాట్లాడే హక్కు ఉంటుందని పురందేశ్వరి అన్నారు. రాష్ట్రానికి సంబంధించిన ఏం అంశంపైనైనా చంద్రబాబు మాట్లాడతారని చెప్పారు. చట్టవిరుద్ధంగా ఏం మాట్లాడకూడదు కానీ లడ్డూ విషయంలో జరిగిందే చెప్పారని పురందేశ్వరి కామెంట్స్ చేశారు.
కోర్టుల వ్యాఖ్యలను సైతం తప్పు పట్టే రీతిలో పురందేశ్వరి వ్యాఖ్యానించడం ఇప్పుడు రాష్ట్రంలోనే కాదు.. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారుతోంది. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో కోర్టు తీర్పుపై ఇలాగే కామెంట్లు చేస్తే ఆ తర్వాత కోర్టు.. ఓటుకు నోటు కేసు రీఓపెన్ చేయాల్సి వస్తుందని చెప్పిన సంగతి తెలిసిందే.
దాంతో రేవంత్.. తనకు న్యాయస్థానాలపై అపారమైన నమ్మకం ఉందని, కోర్టులను తప్పుదోవ పట్టించడం తన ఉద్దేశం కాదంటూ సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు తన బావ చంద్రబాబుకు మద్దతుగా పురందేశ్వరి ఏకంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలనే తప్పుపట్టేలా మాట్లాడటంపై న్యాయ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Tirumala Laddu: తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ
YS Jagan Decleration: జగన్ తిరుమల పర్యటన రద్దు.. డిక్లరేషన్‌పై ఎందుకీ వివాదం?
Supreme court on Tirumala Laddu: సీఎం చంద్రబాబుపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Tirumala Laddu: తిరుమల లడ్డూ వివాదంపై హైకోర్టుకు వైయస్సార్ సీపీ
