Sony 85 Inches TV: ఇంట్లోనే థియేటర్ ఫీలింగ్ కలగాలంటే పే….ద్ద టీవీ ఉండాలి. బాగా డబ్బున్న వారు ఈ కోవలో ఇంట్లోనే పెద్ద టీవీ తెచ్చుకుని ఎంజాయ్ చేస్తుంటారు. పెద్ద టీవీపై మూవీ చూస్తే ఆ ఫీలింగ్ వేరే లెవల్ ఉంటుందనడంలో ఆశ్చర్యం లేదు.
ఆ అనుభవాన్ని ఇంటి దగ్గరే సొంతం చేసుకునే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత 4కే ఓఎల్‌ఈడీ టెలివిజన్లను జపాన్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సోనీ సంస్థ ఆవిష్కరణ చేసింది. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రోగ్రామ్ లో సోనీ బ్రావియా 7 (75/65/55 ఇంచులు, ధర రూ.1,82,000 నుంచి మొదలు), బ్రావియా 8 (65/55 ఇంచులు, ధర రూ.2,19,900 నుంచి), బ్రావియా 9 (85/75 ఇంచులు, ధర రూ.4,49,990 నుంచి మొదలు) స్మార్ట్ టీవీలను రిలీజ్ చేశారు. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఈ కార్యక్రమానికి హాజరై స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.
రాజమౌళితో పాటు సోనీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ నయ్యర్‌తో కలిసి ఇండియన్ మార్కెట్ లోకి వీటిని విడుదల చేశారు. సోనీ టీవీలకు రాజమౌళి ప్రచారకర్తగా వ్యవహరిస్తారు. టీవీలతో పాటు థియేటర్ బార్ సిరీస్ 8, 9లనూ సోనీ రిలీజ్ చేసింది.
Read also: Mahesh Babu: రెమ్యునరేషన్ విషయంలో మహేష్ బాబు సంచలన నిర్ణయం.. వచ్చే సినిమా నుంచే!
USA: అమెరికా వెళ్లే వారికి గుడ్ న్యూస్..
Game Changer: గేమ్ ఛేంజర్ అప్ డేట్.. రెండో సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే..
Ananya Panday: దక్షిణాదిపై అనన్య ఫోకస్.. ఉపాసన కీ కామెంట్స్
