Vantalakka: తెలుగు వారికి వంటలక్కగా పరిచయం అయిన ప్రేమి విశ్వనాథ్.. కేరళకు చెందిన వారని తెలిసిందే. కార్తీక దీపం సీరియల్ తో తెలుగులో బాగా ఫేమ్ సంపాదించుకుంది. ఆ సీరియల్ తో వచ్చిన పాపులారిటీతో ఆమెకు తాజాగా ఆఫర్స్ క్యూ కడుతున్నాయట.
అటు సీరియళ్లు.. ఇటు ప్రకటనలతో పాటు యువ కథానాయకుడుక నాగచైతన్య హీరోగా వచ్చిన ‘కస్టడీ’ సినిమాలో కూడా వంటలక్క కీ రోల్ లో నటించింది. కాగా, ప్రేమి విశ్వనాథ్ ఆస్తుల విషయంపై తాజాగా ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.
వంటలక్క ఆస్తులు సుమారు రూ. 40 కోట్లు ఉండచ్చు అంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఆమెకు కేరళలో రెండు స్టూడియోలు ఉన్నాయట. వంటలక్క కార్తీకదీపం సీరియల్‌లో నటిస్తూనే ఫ్లవర్స్ టీవీలో ఓ కార్యక్రమానికి హోస్ట్ గా చేస్తోందట.
మరోవైపు ప్రేమి విశ్వనాథ్ భర్త వినీత్ భట్ ఆస్ట్రాలజర్‌గా రాణిస్తున్నారు. ప్రస్తుతం తమిళంలో ‘సాల్మన్ 3D’ అనే మూవీలో నటిస్తోంది వంటలక్క. ఇక మలయాళంలోనూ అకమే.. అనే షార్ట్ ఫిలింలో యాక్ట్ చేయడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరించింది.
Read also: Ananya Panday: దక్షిణాదిపై అనన్య ఫోకస్.. ఉపాసన కీ కామెంట్స్
Bigg Boss 8 Telugu: గర్ల్ ఫ్రెండ్ ను ఇంట్రడ్యూస్ చేసిన బిగ్ బాస్ ఫేమ్ నబీల్
OTT Hot Movie: బాబోయ్.. ఇవేం బోల్డ్ సీన్లు.. ఓన్లీ సింగిల్స్ చూడాల్సిన మూవీ
Citroen C3: టాటా పంచ్‌కు పోటీ ఫీచర్స్‌తో సిట్రోయెన్ సీ3.. ఫీచర్స్ ఇవీ
Janhvi Kapoor: ఆ హీరోను యాంగ్రీ యంగ్ మ్యాన్‌తో పోల్చిన జాన్వీ
