HomeAndhra PradeshAmbati Rambabu: దేవుడి దర్శనానికి వెళ్తామంటే ఎందుకీ అనైతిక చర్యలు: అంబటి

Ambati Rambabu: దేవుడి దర్శనానికి వెళ్తామంటే ఎందుకీ అనైతిక చర్యలు: అంబటి

Ambati Rambabu: వైయస్ జగన్‌ తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తామంటే ప్రభుత్వం, కూటమి పార్టీలు డిక్లరేషన్‌ పేరుతో నానా రాద్దాంతం చేస్తున్నారని, ఆయన పర్యటన అడ్డుకోవాలని చూస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. తమ పార్టీ రాయలసీమ నాయకులెవ్వరూ తిరుపతి వైపు రావద్దంటూ పోలీసులు నోటీసులు జారీ చేస్తూ, వారిని హౌజ్‌ అరెస్టు చేశారన్నారు.

ఇదెక్కడి విడ్డూరం అంటూ ఆయన ప్రశ్నలు గుప్పించారు. మాజీ ముఖ్యమంత్రి దేవుడి దర్శనానికి వెళ్ళడానికి పోలీసుల అనుమతి కావాలా? అని నిలదీశారు. చరిత్రలో ఎప్పుడైనా ఇలా జరిగిందా? అని ప్రస్తావించారు.

వైయస్ జగన్‌ తిరుపతి వెళ్లడం ఇది తొలిసారి కాదని, గతంలో ఆయన చాలాసార్లు స్వామివారిని దర్శించుకున్నారని, సీఎం హోదాలో వరసగా 5 ఏళ్లు బ్రహ్మోత్సవాల్లో పాల్గొని, స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారని గుర్తు చేశారు.

రాజకీయాలు చేయాలనుకుంటే అనేక విషయాలు వేరే ఉన్నాయని, వాటిపై ఆలోచన చేయాలని సూచించారు. ప్రభుత్వ తీరు, కూటమి పార్టీల వైఖరిపై ప్రజలు నిరసన వ్యక్తం చేయాలని, ప్రజాస్వామ్యవాదులు, లౌకికవాదులు, హిందూత్వవాదులు ఖండించాలని పిలుపునిచ్చారు.

Read also: Bhumana Karunakar Reddy: సనాతన ధర్మం తెలిసిన వారెవరూ ఇలా అడ్డు చెప్పరు
YS Jagan: నేను భారతీయుడిని.. నా మతం మానవత్వం: వైయస్ జగన్
YS Jagan Decleration: జగన్ తిరుమల పర్యటన రద్దు.. డిక్లరేషన్‌పై ఎందుకీ వివాదం? 
Jayam Ravi: జయం రవితో సహజీవనంపై స్పందించిన సింగర్..
Devara Review: దేవర సినిమా రివ్యూ.. మ్యాన్ ఆఫ్ మాసెస్ మూవీ ఎలా ఉందంటే..

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు