HomeCinemaJayam Ravi: జయం రవితో సహజీవనంపై స్పందించిన సింగర్..

Jayam Ravi: జయం రవితో సహజీవనంపై స్పందించిన సింగర్..

Jayam Ravi: ప్రముఖ నటుడు జయం రవి, ఆయన భార్య ఆర్తి ఇటీవల పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నట్లు ప్రకటలించిన సంగతి తెలిసిందే. అయితే, దీనిపై ఆర్తి మాత్రం అభ్యంతరం చెప్పింది. తన అంగీకారం లేకుండానే విడాకుల వ్యవహారం నడిచిందని ఆరోపించింది. ఈ క్రమంలో జయం రవి.. సింగర్ కెనిషా ఫ్రాన్సిస్ తో సహజీవనం చేస్తున్నట్లు గాసిప్స్ వచ్చాయి. కానీ అవి పుకార్లంటూ రవి తోసిపుచ్చారు. ఇదే విషయమై రీసెంట్ గా జయం రవి విడాకుల ఇష్యూపై సింగర్‌ కెనిషా స్పందించింది. అతని భార్యకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌ కూడా ఇచ్చింది.

సింగర్‌తో సహజీవనం?
జయం రవి కొన్నాళ్లుగా భార్య ఆర్తితో విడిగా ఉంటున్నారు. అయతే, సింగర్‌ కెనిషాతో జయం రవి ప్రేమలో ఉన్నాడని, ఆమె కారణంగానే ఆర్తికి దూరమయ్యాడంటూ కోలీవుడ్ లో గాసిప్స్ వస్తున్నాయి. ఆమెతో కలిసి ఉన్న ఫోటోలు కూడా వైరల్‌ కావడం గమనార్హం. అయితే అటు జయం రవి కానీ, ఇటు కెనిషా కానీ తమ మధ్య ఉన్న బంధాన్ని నిర్ధారించడం లేదు. తాము వృత్తిపరంగానే కలిశామంటున్నారు. అనవసరంగా తమ విడాకుల వ్యవహారంపై మూడో వ్యక్తిని లాగొద్దంటూ ఇటీవల జయం రవి కూడా అసహనం వ్యక్తం చేశారు.

సింగర్ వార్నింగ్
జయం రవి విడాకుల వ్యవహారంలో తనను ఉద్దేశపూర్వకంగా ఇన్వాల్వ్ చేస్తున్నారని సింగర్‌, థెరపిస్ట్‌ కెనిషా ఫ్రాన్సిస్‌ మండిపడింది. జయం రవి మానసిక అనారోగ్యంతో బాధపడతున్నాడని, చికిత్స కోసమే తన వద్దకు వచ్చాడని తెలిపింది. ఒక థెరపిస్ట్‌గా అతనికి చికిత్స అందించానని, అంతకు మించి మా మధ్య ఎలాంటి రిలేషన్‌ లేదని స్పష్టం చేసింది. జయం రవి భార్య ఆర్తి, ఆమె పెరెంట్స్‌ పెట్టిన టార్చర్‌ కారణంగా ఆయన మానసికంగా కుంగిపోయాడని చెప్పింది. చికిత్స కోసం జూన్ లో తన వద్దకు వచ్చాడని, ఆయనతో వృత్తిపరమైన స్నేహం తప్ప ఇంకేం లేదని తెలిపింది. తన కారణంగా విడాకులు తీసుకుంటున్నారన్నది అబద్ధమంది.

తాను ఇచ్చిన ట్రిట్‌మెంట్‌, థెరపీకి సంబంధించిన నోట్స్‌తో పాటు అన్ని సాక్ష్యాలు కోర్టుకు ఇవ్వగలనని, తనపై అనవసరంగా ఆరోపణలు చేయడం ఆపాలని వార్నింగ్ ఇచ్చింది. జయం రవి, ఆర్తి పెళ్లి 2009 జూన్‌లో అట్టహాసంగా జరిగింది. వీరికి ఇద్దరు ఇల్లలు. 15 ఏళ్లపాటు కాపురం చేసిన వీరు.. ఈనెల 9న విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

ఇవీ చదవండి: Devara Review: దేవర సినిమా రివ్యూ.. మ్యాన్ ఆఫ్ మాసెస్ మూవీ ఎలా ఉందంటే..
Nallagatla Swamydas: కొలికపూడి రాక్షసత్వం.. మీడియానూ వదలకుండా దౌర్జన్యాలా?
CM Revanth Reddy: రాష్ట్రంలో పౌరులందరికీ హెల్త్ ప్రొఫైల్.. ఫ్యామిలీ డిజిటల్ కార్డులు
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్‌కు ఇష్టమైన కథానాయిక ఎవరో తెలుసా? 
YS Jagan: వైయస్ జగన్ తిరుమల వెంకన్న దర్శనం వేళ డిక్లరేషన్ వివాదం
RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు