YS Jagan Decleration: మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారు. ఈ సందర్భంగా డిక్లరేషన్ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. గతంలో ఎన్నోసార్లు దీనిపై చర్చలు, కోర్టుల్లో కేసులు నడిచాయి. శ్రీవేంకటేశ్వర స్వామి వారిపై విశ్వాసం, నమ్మకం ఉన్నాయని సంతకం పెట్టాలని అటు బీజేపీ, టీడీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
ఇటీవల లడ్డూ తయారీకి వాడే నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందన్న ఆరోపణల నేపథ్యంలో వైయస్సార్ సీపీ కూడా తన వర్షన్ బలంగా వినిపించింది. కల్తీ జరగలేదని, అనుమానం ఉన్న ట్యాంకర్లను వెనక్కి పంపినా టీడీపీ చీఫ్, సీఎం చంద్రబాబు నారా రభస చేస్తున్నారని ధ్వజమెత్తింది. ఈ క్రమంలో తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని జగన్ నిర్ణయించగా.. ఆయనపై దాడి చేసే అవకాశం ఉందన్న సమాచారంతో పర్యటన రద్దు చేసుకున్నట్లు వైయస్సార్ సీపీ వర్గాలు వెల్లడించాయి. ఇదే సందర్భంలో డిక్లరేషన్ ఇవ్వాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది.
గతంలోనూ చాలా సార్లు జగన్ అటు ప్రతిపక్ష నేతగా, ఇటు సీఎంగా ఉండగా తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. అయితే, అప్పుడు లేని డిక్లరేషన్ వివాదం ఇప్పుడెందుకంటూ వైయస్సార్ సీపీ ప్రశ్నిస్తోంది. స్వామిపై నమ్మకం ఉంటేనే దర్శనం చేసుకుంటారు కదా, లేకపోతే దర్శనం చేసుకోరు కదా అని గుర్తు చేస్తున్నారు.
ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి వర్గం.. వైయస్ జగన్ డిక్లరేషన్ అంశాన్ని, ఆయన క్రిస్టియన్ అనే నినాదాన్ని బలంగా చెప్పాలని ప్రయత్నిస్తున్నట్లు స్పష్టం అవుతోంది. చంద్రబాబుకు అనుకూలంగా ఉండే రాష్ట్ర బీజేపీ నేతలు, టీడీపీ నేతలు చాలా మంది ఒకే రకమైన వాదన వినిపించడం.. మత రాజకీయాలకు తెరలేపుతున్నారన్న వాదనకు బలం చేకూరుస్తోంది.
వైయస్ జగన్ మోహన్ రెడ్డి సీఎంగా ఉండగా తిరుమల వెళ్లే క్రమంలో డిక్లరేషన్ అంశంపై హైకోర్టులో చంద్రబాబు మనుషుల చేత పిటిషన్ వేయించారని వైయస్సార్ సీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. అయితే, ముఖ్యమంత్రి హోదాలో ప్రోటోకాల్ ప్రకారం జగన్ వెళ్లొచ్చంటూ హైకోర్టు ఆ పిటిషన్ ను డిస్మిస్ చేసందని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు లడ్డూ వివాదం వేళ జగన్ కు కనీసం ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కకపోవడంతో సీఎం చంద్రబాబు మరింత కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జగన్ మోహన్ రెడ్డి తిరుమల ఆలయానికి వెళ్లడం ఇది కొత్త కాదు, తొలిసారి అంతకన్నా కాదని, తన తాత, తండ్రితో కూడా జగన్ చిన్న తనం నుంచి పలుమార్లు ఆలయానికి వచ్చారని వైయస్సార్ సీపీ గుర్తు చేస్తోంది. అదే కుటుంబం నుంచి వచ్చి ప్రతిపక్ష నేతగా, ముఖ్యమంత్రిగా చేసిన వైయస్ రాజశేఖరరెడ్డి కూడా అనేక పర్యాయాలు తిరుమల ఆలయానికి వెళ్లారని, ఎప్పుడూ డిక్లరేషన్ వ్యవహారం ప్రస్తావన లేదంటున్నారు.
రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ ఉన్న వైయస్సార్ కుటుంబాన్ని టార్గెట్ చేసి మత రాజకీయాలకు తెరతీయడం శోచనీయమంటున్నాయి వైయస్సార్ సీపీ వర్గాలు. చంద్రబాబు అనేక కుట్రలు చేసినా ఫలించకపోవడంతో ఇప్పుడు ఆయన తరఫున పురందేశ్వరి ఈ కుట్రలు చేస్తోందని మండిపడుతున్నాయి. భగవంతుడి మీద నమ్మకం, విశ్వాసం ఉన్న వారే ఆలయాలకు, ప్రార్థనా మందిరాలకు వెళ్తారని, అలా వెళ్తున్న వారిని ఎవరినైనా రాజకీయం చేస్తే అది ధార్మికత అనిపించుకుంటుందా? అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Nallagatla Swamydas: కొలికపూడి రాక్షసత్వం.. మీడియానూ వదలకుండా దౌర్జన్యాలా?
CM Revanth Reddy: రాష్ట్రంలో పౌరులందరికీ హెల్త్ ప్రొఫైల్.. ఫ్యామిలీ డిజిటల్ కార్డులు
YS Jagan: వైయస్ జగన్ తిరుమల వెంకన్న దర్శనం వేళ డిక్లరేషన్ వివాదం
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్‌కు ఇష్టమైన కథానాయిక ఎవరో తెలుసా?
