మంగళవారం, 20 అక్టోబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Andhra Pradesh

Nallagatla Swamydas: కొలికపూడి రాక్షసత్వం.. మీడియానూ వదలకుండా దౌర్జన్యాలా?

Keerthanaa News Deskప్రచురణ తేదీ: శుక్రవారం, 27 సెప్టెంబర్ 2024

Nallagatla Swamydas: ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచే తిరువూరు ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు రాక్షసంగా వ్యవహరిస్తున్నారని, దౌర్జన్యం చేస్తున్నారని తిరువూరు వైయస్సార్‌సీపీ సమన్వయకర్త నల్లగట్ల స్వామిదాస్‌ మండిపడ్డారు. యథేచ్ఛగా దాడులు, ఆస్తుల విధ్వంసం చేస్తూ, వైయస్సార్‌సీపీ నాయకులు లక్ష్యంగా వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. ఏకంగా పొక్లెయిన్లతోనే ఇళ్లపై దాడులు చేస్తున్న కొలికపూడి.. చివరకు మీడియా ప్రతినిధులనూ వదలకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు.

కూటమి 100 రోజుల పాలనపై, తమది మంచి ప్రభుత్వం అంటూ.. తిరువూరులో ఇంటింటా స్టిక్కర్లు వేస్తున్నారన్న స్వామిదాస్, అసలు ఇన్ని రోజుల్లో ఏ మంచి చేశారో చెప్పాలని, సూపర్‌ సిక్స్‌ హామీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా అమలు చేశారా? అని నిలదీసిన ఆయన, ధైర్యం ఉంటే చెప్పాలన్నారు. చంద్రబాబు గురించి తనకు బాగా తెలుసని, ఆయన ఏనాడూ మాట నిలబెట్టుకోడని తెలిపారు.

తిరువూరు నియోజకవర్గ చరిత్రలో కొలికపూడి శ్రీనివాసరావు లాంటి ఎమ్మెల్యే ఎవరూ లేరన్న స్వామిదాస్, ఆయన దాడులు, దౌర్జన్యాలు మితిమీరాయని, మీడియానూ బెదిరిస్తున్నారని వెల్లడించారు. ‘బట్టలూడదీసి ఇంటికొచ్చి కొడతాను’ అంటూ మీడియా ప్రతినిధులను బెదిరిస్తున్నాడని గుర్తు చేసిన ఆయన, ఇకనైనా ఎమ్మెల్యే తన భాష మార్చుకోవాలని, ఇలాంటి సంస్కృతి మంచిది కాదని హితవు చెప్పారు.

అలాగే అధికారులు కూడా ఎమ్మెల్యే చెప్పినట్లు చేస్తే, వారు భవిష్యత్తులో ఇబ్బందుల్లో పడతారన్న స్వామిదాస్, చట్టవిరుద్దంగా వ్యవహరించే వారికి వత్తాసు పలకొద్దని సూచించారు.

YS Jagan: వైయస్ జగన్ తిరుమల వెంకన్న దర్శనం వేళ డిక్లరేషన్ వివాదం
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్‌కు ఇష్టమైన కథానాయిక ఎవరో తెలుసా? 
Game Changer: గేమ్ ఛేంజర్ అప్ డేట్.. రెండో సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే..
Harsha Sai: యూట్యూబర్ హర్ష సాయిపై అత్యాచారం ఆరోపణలు.. ఏం జరిగిందంటే..
Esther Anil: దృశ్యం చిన్నది.. గ్లామర్‌తో కవ్విస్తున్నది

ట్యాగ్స్: , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading